తెలుగువారికి గొప్ప అవ‌కాశం..తెలుగు కోడి..!

చంద్ర‌బాబు కొత్త‌కొత్త ప‌థ‌కాల‌ని ప్ర‌వేశ‌పెట్టాడు. ఆ ప‌థ‌కాల‌ని వివ‌రించ‌డానికి తొలుత కుప్పం ప్ర‌జ‌ల వ‌ద్ద కెళ్ళాడు.
`` ప్ర‌జ‌లారా మీరు హాయిగా జీవించ‌డానికి నేను రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డుతున్న ఆడ‌వాళ్ళ‌కి ఆదరువుగా వుండ‌డానికి మీ కోడి ప‌థ‌కాన్నిప్ర‌వేశ‌పెడుతున్నా. దీని ప్ర‌త్యేక‌త ఏమిటో చ‌క చ‌కా ప‌ది ముక్క‌ల్లో చెప్పేస్తాను. నేన‌స‌లే స్పీడ్, ఈ మ‌ధ్య సింగ‌పూర్ స్పీడ్ లో దూసుకెళుతున్నా..

(1) మీకు కోడి పిల్ల‌ని సంవ‌త్స‌రం పాటు ఉచితంగా ఇస్తాం.
(2)దానికి మీరు మేలు ర‌కం జొన్న‌లు తినిపించి సాకాలి, జొన్న‌ల్లో క‌ల్తీ వుంటే ప్ర‌భుత్వం మీకు జ‌రిమానా విధి స్తుంది.
(3) అది పెట్టే గుడ్ల‌న్నింటిని మాకు ఉచితంగా ఇవ్వాలి. ఒక గుడ్డు ప‌గిలినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు.
(4) కోడి చ‌నిపోతే ఆ ఖ‌రీదుని తిరిగి క‌ట్టాలి. కోడిని పెంచే క్ర‌మంలో మీరు పోతే కోళ్ళ‌శాఖ వారు మీ కుటుంబానికి వెయ్యి రూపాయ‌లు ప‌రిహారిమిస్తారు.
(5)కోడిని మీరు ఎలా పెంచుతున్నారో ప‌ర్య‌వేక్షించ‌డానికి ప్ర‌తివూళ్ళోనూ జ‌న్మ‌భూమి కోళ్ళ  క‌మిటీ వుంటుంది. అందులో మా పార్టీ వాళ్ళు స‌భ్యులుగా వుంటారు. వాళ్ళ‌కు జీతంతో పాటు వారానికి రెండు కోళ్ళు ఉచితం 
(6) మా అధికారులు సింగ‌పూర్‌, మ‌లేషియాల‌తో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల‌న్నింటిని తిరిగి కోళ్ళ పెంప‌కంపై అధ్య‌య‌నం చేసి ఒక నివేదిక స‌మ‌ర్పిస్తారు. దాని ప్ర‌కారం ఉత్త‌మ రైతుల్ని సెలెక్ట్ చేసి తెలుగు కొక్క‌రోకో అవార్డుల‌ని బ‌హుక‌రిస్తాం.
(7) ఆఫ్రికా దేశాల్లో మ‌నుషులే న‌ల్ల‌గా వున్న‌పుడు కోళ్ళు మాత్రం తెల్ల‌గా ఎలా వున్న‌య‌నే అంశంపై ప‌లు యూనివ‌ర్సిటీల‌తో ప‌రిశోధ‌న‌లు చేయిస్తాం.
(8) ప‌క్షుల‌కు కూడా పాట‌లంటే ఇష్ట‌మ‌ని పెద్ద‌లు ఏనాడో చెప్పారు కాబ‌ట్టి. బంగారు కోడిపెట్ట అనే పాట సిడీని ఇంటింటికి ఇస్తాం. అది మీరు కోడికి విసిపిస్తే అది ప‌ర‌వ‌శించి ఎక్కువ గుడ్లు  పెడుతుంది.
(9)మ‌న పురాణాల్లో కోడి ప్రాముఖ్య‌త గురించి ప‌చ్చ‌కామెర్ల స్వామితో ప్ర‌తివారం టీవీల్లో ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం. దాని వ‌ల్ల పుణ్యం మీకు, పురుషార్ధం స్వాముల‌వారికి.
(10)కోడికి రెక్క‌లున్న‌ప్ప‌టికీ అది నేల‌పైనే వుంటుంది. అలాగే మీరు కూడా ఆకాశానికి నిచ్చెన‌లు వేయ‌కుండా  నేల‌మీదే వుండాలి.

ఈ ప‌థ‌కంవ‌ల్ల మీకు క‌లిగే లాభం ఏమంటే కోడి పెంట వ‌ల్ల మీ పొలాల‌కి ఎరువుల‌భిస్తుంది. ప్ర‌భుత్వం వారు దాన్ని చికెన్ వందుకున్న త‌రువాత ఈ క‌ల్నిమీకు ఉచితంగా ఇస్తారు. వాటిని మీరు విస‌న‌క‌ర్ర‌లుగా మార్చుకుని ఎండ‌కాలం ఉప‌శ‌మ‌నం పొందండి`` అని ముగించాడు బాబు.
-రాహుల్‌
Back to Top