తాకట్టుకోసం ఒక రాష్ట్రం

రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటున్నాడు ముఖ్యమంత్రి
చంద్రభోగ్.
క్లిష్ట పరిస్థితులు అంటే కమీషన్లు అదుకునేందుకు ప్రాజెక్టు అంచనాల పెంపును
కేంద్రం ఆమోదించకపోవడం, ఇచ్చిన సొమ్ములకు లెక్కలడగడం,
విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళితే విమర్శించడం, రాజధాని భూములను సింగపూరు సంస్థలకు ఇస్తే కన్నెర్ర చేయడం, కోట్లు పెట్టి సొంత ఇల్లు కట్టుకుంటే ఆడిపోసుకోవడం ఇవన్నీ క్లిష్ట పరిస్థితులే
కదా? ఓ పక్క చెప్పుకున్న ఎంఓయూల లెక్కకూ, వచ్చిన పెట్టుబడుల లెక్కకూ పొంతన కుదరక, ఇస్తామన్న ఉద్యోగాలకు,
ఇచ్చిన ఉద్యోగాలకూ వ్యత్యాసం ఎక్కువై కొట్టు మిట్టాడుతుంటే ఇంకా ప్రాజెక్టులు
పూర్తి కాలేదంటూ ప్రతిపక్షాలు విమర్శించడం ఏమన్నా బావుందా? అసలే
రాష్ట్రం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందింతెగ వాపోతున్నాడు చంద్రభోగ్. 

 ప్రాజెక్టుల పేరు వినగానే చంద్రభోగ్ కు మహత్తరమైన ఆలోచన వచ్చింది. ప్రాజెక్టులు
అంటే ఏమిటి, ప్రభుత్వానికి చెందిన ఆస్తులు. అప్పుల కోసం ఈ ఆస్తులను తాకట్టుపెడితే తప్పేంటి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంత్రి మండలిని సమావేశ పరిచాడు. ఎలాగూ
ఈ విడ్డూరాలను, విపరీతాలను నిరసిస్తూ ప్రతిపక్షం సభకు రావడం మానేసింది.
ఇక చంద్రబాబుకు అడ్డు అదుపూ లేదు. అనుకున్నదే తడవుగా
ప్రాజెక్టులను బింజాబ్ ఇంటర్నేషనల్ బ్యాంకుకు తాకట్టు పెట్టేసి 1000 కోట్లు అప్పు తెచ్చేసుకునేందుకు వీలుగా మంత్రి మండలిలో ప్రతిపాదన ప్రవేశపెట్టి
పాస్ చేసేసుకున్నాడు. ఈ పని చేస్తుండగానే చంద్రభోగ్ కు మరో అమోఘమైన
ఆలోచన కలిగింది. ప్రాజెక్టులను మాత్రమే ఎందుకు తాకట్టు పెట్టాలి?
ఒక్కో జిల్లానూ తాకట్టు పెడితే కనీసం 10,000 కోట్లు
అప్పు తెచ్చుకోవచ్చు. పర్యాటక స్థలాలనూ తాకట్టు పెట్టుకుని మరో
15000 కోట్లు తేవచ్చు. ఇక మిగిలింది ఏంటి జనాలు.
ఒకె వీళ్లను తాకట్టు పెడితే కొనేవాళ్లున్నారా? చంద్రభాగ్ ఆలోచనలు కొనసాగుతున్నాయిం గిలుగు రాష్ట్రంలో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.

Back to Top