చంద్రబాబు అతి మంచితనం..!

చంద్రబాబు నాయుడి మంచి తనాన్ని మంత్రులు చేతకాని తనంగా తీసుకుంటున్నారో...సాకుగా తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదు కానీ...ఆయన్ని మాత్రం ఆటపట్టించేస్తున్నారు. అంతే కాదు ఆయన పరువు తీసి బజారున పడేస్తున్నారు.

ఎమ్మెల్యే కూడా కాకపోయినా.. నారాయణ కాలేజీలు పెట్టి విద్యావ్యాపారం చేసుకుంటోన్న నారాయణను పిలిచి  మంత్రి పదవి ఇచ్చారు పాపం చంద్రబాబునాయుడు.
చంద్రబాబునాయుడు అంత ఉదారంగా పదవిని ఇస్తే..నారాయణ స్థానంలో ఇంకెవరున్నాజీవితాంతం చంద్రబాబుకు రుణపడి ఉండేవారు.
కానీ నారాయణ మాత్రం  తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు..పదవినిచ్చిన చంద్రబాబునే అప్రతిష్ఠపాలు చేశారు.
అది కూడా చాలా పకడ్బందీగా..చంద్రబాబుకు ఏమాత్రం తెలీకుండా..అత్యంత రహస్యంగా ..కుట్రపన్నిమరీ చంద్రబాబు ప్రతిష్ఠను మంటగలిపారు.
నారాయణ చేసిన పనికి రైతులంతా చంద్రబాబును ఓవిలన్ లా చూస్తున్నారు.

ఇంతకీ నారాయణ ఏంచేశారో తెలుసా..?
  • నమ్మి మంత్రి పదవిని ఇస్తే... బుద్ధిగా ఆఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపం చేయకుండా రైతుల జీవితాల్లోకి తొంగిచూశారు.
  • రాజధాని నిర్మాణానికి భూముల కోసం పాపం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకోండయ్యా అని మంత్రులకు..అధికారులకు కూడా పదేపదే చెప్పారు.
  • బలవంతంగా భూసేకరణ చేస్తే రైతులు బాధపడతారని చంద్రబాబు వారితో అన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తూ...పరిపాలనలో బిజీగా ఉన్నారు.
  • సరిగ్గా అదే అదను అనుకున్ననారాయణ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూసేకరణ కోసం నోటీసులు జారీ చేసేశారు. దాంతో రైతులు లబోదిబోమన్నారు. దాంతో మరికొందరు మంత్రులకు చిర్రెత్తుకొచ్చింది.
  • నారాయణతో కుమ్మక్కయిన మంత్రులు రావెల కిషోర్బాబు...పత్తిపాటి పుల్లారావు...దేవినేని కూడా చంద్రబాబుకు ఏమాత్రం తెలీకుండా రైతులను బెదిరిస్తూ పోయారు. భూములు ఇవ్వకుంటే బలవంతంగా లాక్కుంటామని హెచ్చరించారు.
  • మర్యాదగా భూములు ఇస్తే ఏదో ఒక పరిహారం అయినా వస్తుందని..ప్రభుత్వమే బలవంతంగా భూములు గుంజుకుంటే దమ్మిడీ కూడారాదని భయపెట్టారు.
  • రైతులు గగ్గోలు పెడితే..భూసేకరణ వద్దంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ ఇచ్చేశారు. 
  • దానికి ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. భూసేకరణ జరపకుండా ఏంచేయాలో చెప్పండంటూ పవన్ కు కౌంటర్ వేశారు.
  • భూమిని సేకరించకుండా రాజధాని నగరాన్నిఆకాశంలోకట్టాలా అని  నిలదీశారు. 
  • మరో మంత్రి రావెల కిషోర్బాబు అయితే ఆఫ్ట్రాల్ మూడున్నర వేల ఎకరాల గురించి ఏంటీ రాద్దాంతం అని నొచ్చుకున్నారు.
  • దయచేసి అభివృద్ధికి మోకాలడ్డు పెట్టకండని పవన్కళ్యాణ్కు హితవు చెప్పారు కూడా.
  • అది విని పవన్కళ్యాన్ అక్కడికి పరిగెత్తుకు వెళ్లారు.
  • భూసేకరణ జరపకండంటూ మరోసారి చెప్పారు.
  • అప్పటిదాకా అసలక్కడ భూసేకరణకోసం నోటీసులు జారీ చేసిన సంగతి కూడా తెలీని చంద్రబాబు షాక్తిన్నారు. 
  • వేగులను పంపించి రైతులేమనుకుంటున్నారో కనుక్కుంటే అందరూ కూడా తనను తిట్టిపోస్తున్నారని తెలిసింది. 
  • జనమే కాదు...జనసేన అధినేత పవన్కళ్యాణ్కూడా ఎప్పుడు ఏమంటారో చెప్పలేని పరిస్థితి.
  • ఒక్క నారాయణే కాదు..సీనియర్మంత్రి యనమల రామకృష్ణుడు...ఇతర మంత్రులు రావెల కిషోర్బాబు..పత్తిపాటి పుల్లారావు..దేవినేని ఉమామహేశ్వరరావులు భూసేకరణ కోసం ఇంత దుర్మార్గంగా..దౌర్జన్యంగా రైతుల పైకి దూసుకుపోవడం గురించి ఏమాత్రం తెలీని చంద్రబాబు తీరా తెలిసాక మనస్తాపం చెందుతున్నారు.
  • దాంతో భూసేకరణకు నోటీసులు జారీ చేసిన నారాయణని పిలిచి నారాయణ ఇదేమన్నా బాగుందా అని అడిగారు. అప్పుడు నారాయణ మీడియా వాళ్లని పిలిచి తన నేరాన్నిఒప్పుకున్నారు.
  • ఇంతటి ఘోరానికి పాల్పడ్డా..మంచి మనసు కాబట్టి చంద్రబాబునాయుడు నారాయణను ఏమీ అనలేదు. ఆయన్ని పదవి నుంచి తప్పించలేదు.
  • నారాయణే కాదు..ఆమధ్య టిడిపి ఎమ్మెల్యే చింతమనేని కూడా చంద్రబాబుకు ఏమాత్రం తెలీకుండా ఇసుక మాఫియా చేసుకుంటూ..మహిళా తహసిల్దార్పై దాడి కూడా చేశాడు.
  • కానీ చింతమనేని చాలా అమాయకుడని నమ్ముతూ వచ్చిన చంద్రబాబునాయుడు ఆయన్నేసపోర్ట్చేసి అందరి దృష్టిలో అవినీతికి మద్దతునిచ్చే వ్యక్తిగా ముద్రపడిపోయారు.
  • చేయని తప్పుకు చెడ్డపేరు తెచ్చుకొన్నారు.
  • అంతెందుకు ఆడబిడ్డకు మంత్రి పదవినిచ్చి ప్రోత్సహించాలని చంద్రబాబునాయుడు ...పీతల సుజాతకు కేబినెట్లో చోటిచ్చారు. ఆమె కూడా  అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఆచెడ్డపేరు కూడా చంద్రబాబును కలచివేస్తోంది.
  • ఇలా మంత్రులంతా కక్ష కట్టినట్లు చంద్రబాబును నానా ఇబ్బందులూ పెట్టి ఆయనకున్న మంచిపేరును పాడుచేస్తున్నారు.
  • ఈమంత్రులందరినీ కేబినెట్నుంచి తప్పించి కొత్తమంత్రులను పెట్టుకుని తనకున్నమంచి పేరును కాపాడుకోవాలని చంద్రబాబుకు నావిజ్ఞప్తి.

-కవికాకి


Back to Top