తండ్రిని మించిన తనయుడు


ఇరవై రెండేళ్ల  క్రితం నాటి విషయం.
లోకేష్  బాబు ఆరో తరగతో ఏడో తరగతో చదువుతున్నాడు.
తన మిత్రులతో కలిసి గోళీ కాయలు ఆడుకుంటున్నాడు.
అప్పుడు ఆకాశమంతా మబ్బులు కమ్మేసి ఉన్నాయి.
అది ఆగస్టు నెల.
లోకేష్ బాబు గోళీ కాయ తీసి దూరంగా ఉన్న   పచ్చరంగు గోళీని కొట్టడానికి రెడీ అవుతున్నాడు.

అంతలో ఎవరో లోకేష్ చెయ్యిని గట్టిగా పట్టుకున్నారు.
ఎవరా అని లోకేష్ బాబు వెనక్కి తిరిగి చూస్తే... నాన్న.
అవును చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ లో...చాలా అయోమయంగా ... ఆయాసపడుతూ కనిపించేసరికి లోకేష్ బాబు కంగారు పడ్డాడు.
"ఏంటి నాన్నా  ఏంటి అలా ఉన్నావని" అడిగాడు.
నువ్వు అర్జంటుగా ఇంటికిరారా మాట్లాడాలి అని చంద్రబాబు లోకేష్ ను తీసుకుని వెళ్లిపోయాడు.
ఇంటికి  వెళ్లిన వెంటనే  ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు.
"ఏంటి నాన్నా అలా ఉన్నావు? ఏమైంది? ఏంటో మాట్లాడాలన్నావు ఏంటి? "
అని అడిగాడు లోకేష్ బాబు.

చంద్రబాబు ఓ గ్లాసు మంచి నీళ్లు తాగి...
"ఏం లేదురా.. పార్టీలో మన పరిస్థితి ఏమీ బాగాలేదు.
మా మామగారు (ఎన్టీఆర్) ఇదివరకటిలా లేరు. మన  దొంగ వేషాలన్నీ  ఆయనకి తెలిసిపోయాయి. మనల్ని ఖాతరు చేయడం లేదు. అసలు విలువే ఇవ్వడం లేదు. ఇపుడేం చేయమంటావు? నాకేమీ తోచడం లేదు. మంచి ఐడియా ఇస్తావని నీ దగ్గరకొచ్చాను "అన్నారు చంద్రబాబు.
లోకేష్ జేబులోంచి నీలం రంగు  గోళీని బయటకు తీసి విసిరాడు. దాన్ని ఎర్ర రంగు గోళీతో కొట్టాడు. అంతే ఐడియా వచ్చేసింది.
తండ్రి దగ్గరకు వచ్చి..
"నాన్నా.. దీనికంత కంగారు పడాల్సిన అవసరం లేదు.
సీటు మార్చేయ్" అన్నాడు.
చంద్రబాబుకు అర్ధం కాలేదు.
"సీటు మార్చడం ఏంట్రా  "అని అయోమయంగానూ..కోపంగానూ అడిగారు చంద్రబాబు.
"అబ్బా.. అర్ధం చేసుకో నాన్నా..
సిఎం సీటు మార్చేయ్.
అంటే ఆ సీటులో ఉన్న  తాతగారిని మార్చేసి.. నువ్వా సీట్లో సెటిల్ అయిపో " అని అర్జునిడికి అయిడియా ఇచ్చిన కృష్ణుడిలా లోకేష్ బాబు నవ్వాడు.
చంద్రబాబుకు అప్పటికి లైటు వెలిగింది.
అంతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే పనిలో బిజీ అయిపోయారు.

లోకేష్  ఐడియా చంద్రబాబు జీవితాన్ని మార్చేసింది.
చంద్రబాబు సిఎం అయిపోయారు.
లోకేష్ ను మనసులోనే పొగుడుకుంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా  కాలక్షేపం చేస్తున్నారు.
మధ్యలో కేంద్రంలో సంకీర్ణాల యుగం మొదలైంది.
చంద్రబాబును ప్రధానిని చేయాలని గిట్టని వాళ్లు విశ్వ ప్రయత్నాలు చేశారు.
చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోలేదు.
లోకేష్ బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు.
లోకేష్ బాబుకు ఫోను చేసి  " ఏరా బాబూ... ఓ సమస్య వచ్చిందిరా " అన్నారు చంద్రబాబు.
లోకేష్ చిన్నగా నవ్వి " మళ్లీ ఏమైంది నాన్నా " అని అడిగాడు.
పి.ఎం. పోస్ట్ ఆఫర్ వచ్చిందిరా అని చెప్పారు చంద్రబాబు.
"పొరపాటున కూడా ఆ ఉద్యోగంలో చేరద్దు నాన్నా.  అది  అంగన్ వాడి టీచర్ పోస్ట్ కన్నా హీనం. కాంటాక్ట్ జాబ్ కన్నా ఘోరం.  కాస్త పెర్మనెంట్ గా ఉండే సిఎం పోస్టులోనే ఉండిపో" అని లోకేష్ బాబు ఐడియా ఇచ్చాడు.
చంద్రబాబు అలాగే చేశారు.

ఇరవై ఏళ్లు కాల చక్రం గిర్రున తిరిగిపోయింది.
రాష్ట్ర విభజన కోసం  యూపీయే ప్రయత్నాలు చేస్తోంది.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోంది.
సమైక్యాంధ్రే ముద్దని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అంటోంది.
ఏం చేయాలో పాలుపోలేదు చంద్రబాబుకి. లోకేష్ కు ఫోన్ చేశారు.
ఏం చేయమంటావురా అని అడిగారు.  రాష్ట్రాన్ని కొబ్బరికాయ ను బద్దలు కొట్టినట్లు రెండు ముక్కలు చేసేయమని లెటర్ ఇయ్యి నాన్నా అన్నాడు. అంతే చంద్రబాబు స్పీడ్ పోస్ట్ లో  లెటర్ పంపేశారు.
ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా  హామీ అటకెక్కింది.
వెంకయ్యనాయుడుగారేమో హోదా లేదూ గీదా లేదు ..కావాలంటే ప్రత్యేక సాయం తీసుకోండన్నారు.
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది.
చంద్రబాబుకు బుర్ర తిరిగిపోతోంది. ఏం చేయాలో పాలుపోలేదు.
లోకేష్ బాబుకు కబరంపారు.

ఫైవ్ స్టార్ హోటల్ లోని సిఎం పేషీ లో లోకేష్ బాబుతో మాట్లాడారు చంద్రబాబు.
ఏం చేయమంటావురా అన్నారు.
ప్రత్యేక హోదా తో ఏం వస్తుంది ఏమీ రాదు దాన్ని అటకెక్కించేయ్ నాన్నా అన్నాడు లోకేష్ బాబు.
అంతే చంద్రబాబు మరో ఆలోచన చేయలేదు. ప్రత్యేక హోదా వద్దన్నారు.
ప్రత్యేక హోదా గొడవకి ముందు మరోటి జరిగింది.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీడం లేదు.
చంద్రబాబు టెన్షన్ ని గమనించిన లోకేష్ బాబు... నాన్నా   ఓటుకు కోట్లు కేసు  విచారణ జరక్కుండా  కోర్టుకెళ్లి స్టే తెచ్చుకో అన్నాడు.
లోకేష్ ఐడియా వినగానే చంద్రబాబు మొహం చంద్రబింబంలా వెలిగిపోయింది.
కొడుకు పుట్టినపుడు కాదు వాడు ప్రయోజకుడైనపుడే కదా తండ్రికి అసలైన ఆనందము అని పాడుకుంటూ ...ఆ విధంగా ముందుకు సాగారు చంద్రబాబు.
-----------------------
-కవికాకి
----------------------
9505555384(C.N.S.YAZULU)

Back to Top