చంద్రబాబు సమర్పించు మురికివాడల సిద్ధాంతం


చంద్ర‌బాబు హుషారుగా అద్దం ముందు ముస్తాబ‌వుతుంటే పిఏ వ‌చ్చాడు
సార్‌, మీరు ప‌దేప‌దే మురికివాడ అంటూ వుంటారు. మురికివాడ అంటే ఏంటి సార్‌?"  పిఏ అడిగాడు
"మురికి అంటే డ‌ర్టీ, వాడ అంటే ఏరియా అని చెప్పాడు చంద్ర‌బాబు
"రెండేళ్ల నుంచి మీరు అద్భుతంగా పాలిస్తూవుంటే ఇంకా మురికివాడ‌లు ఎందుకున్నాయి సార్‌?"
"మురికి అంటే అదీ జీవ‌ప‌దార్థం. అది ఎప్పుడు వుండాలి. ఉంటేనే మ‌నం శుభ్ర‌త గురించి వాగ్దానాలు చేయ‌డానికి వీల‌వుతుంది. గ‌రీబీహ‌ఠావో అని అర‌వై ఏళ్ల నుంచి అరుస్తూవున్నారు. పోయిందా? అది పోదు. ఎందుకంటే అదిపోతే నాలాంటి నాయ‌కుల‌కి ప‌నేముంది?"
"మ‌న ఇంజ‌నీర్లు క‌డితే రాజ‌ధానిని మురికివాడ చేస్తార‌ని మీరెందుకు అంటున్నారు?"
మ‌న సినిమా హీరోలు ముంబైకి వెళ్లి క‌టింగ్ ఎందుకు కొట్టించుకుంటారు? ఇక్క‌డ షాపులు లేక‌నా? అలా చెబితే క్రేజ్‌. మ‌నం కూడా ఉక్రెయిన్‌లో వుంటే క‌స్‌మిస్ కోవ్ తో రాజ‌ధాని క‌ట్టిస్తే సూప‌ర్ అంటారు.
అదే తెనాలిలో వుండే ఇంజ‌నీర్ ముకుంద‌రావ్ తో క‌ట్టిస్తే ఓస్ ఇంతేనా అంటారు. ఉక్రెయిన్ మ‌న‌కంటే పాప‌ర్ ప‌ట్టిన దేశ‌మ‌ని ఎవ‌డికి తెలుస్తుంది!
వెన‌క‌టికి కుప్పంలో ఇజ్రాయిల్ సేద్యం చేయించి మీడియాలో తెగ రాయించాను. రైతులు దివాళ‌తీసిన విష‌యం ఎవ‌రూ రాయ‌లేదు. అదే గోదావ‌రి జిల్లా నుంచి రైతుల్ని తెచ్చి కుప్పంలో ప్ర‌యోగం చేస్తే ఎవ‌రైనా ప‌ట్టించుకుంటారా?  నువ్వు గోళ్లు గిల్లుకున్నా నెయిల్ మెనేజిమెంట్ అని ప‌బ్లిసిటీ ఇవ్వాలి. రెండేళ్ల నుంచి విమానాల్లో తిర‌గ‌డం త‌ప్ప నేనేమీ చేయ‌లేద‌ని అంద‌రికీ తెలుసు. కానీ న‌వ్యాంధ్ర అనే మాయ‌కంబ‌ళి క‌ప్పి గేమ్ ఆడుతున్నానా... లేదా?
"మీకిన్ని తెలివితేటలు ఎలా వ‌చ్చాయి సార్‌?"
"తెలివిలేని ప్ర‌జ‌ల‌కి ఏదో ఒక‌టి చెప్పి న‌మ్మిస్తూ వుండ‌డ‌మే తెలివి తేట‌లంటే"
ప్ర‌జ‌ల‌కు తెలివి లేద‌ని ఎందుకు అనుకుంటున్నారు?"
"తెలివి ఉంటే మ‌ళ్లీ న‌న్ను ఎన్నుకుంటారా?  తొమ్మిదేళ్లు వాళ్ల‌కి సినిమా చూపించాను క‌దా"
"ఈ సారి ఎన్నిక‌ల్లో మీకు సినిమా చూపిస్తారేమో!"
"చూపిస్తార‌ని తెలుసు కాబ‌ట్టే, ల‌క్ష‌ల కోట్లు సంపాదిస్తున్నా. నేను డ‌బ్బు సంపాదించ‌డానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను కానీ, ప్ర‌జ‌ల‌కి సేవ చేయ‌డానికి వ‌చ్చానా?"
"కానీ ప్ర‌జ‌లే మీ దైవం అంటారు క‌దా"
"అవును దేవున్ని మ‌నం ఎందుకు కొలుస్తాం. దండిగా డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని, ఉన్న డ‌బ్బులు జారిపోకుండా కాపాడ‌మ‌ని కోరుకుంటాం. వ‌రాలు ఇస్తాడ‌ని న‌మ్మ‌కం లేక‌పోతే దేవుడి మొహ‌మైనా చూస్తారా? ప‌్ర‌జ‌లే మ‌న దేవుళ్లు. ఎందుకంటే వాళ్లు అధికారం ఇస్తేనే మ‌న‌కు డ‌బ్బులొచ్చేది?"
"మ‌రి ఆ ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేయాలి కదా"
"ఏమీ చేయ‌క్క‌ర‌లేదు. ఐదేళ్లు వాళ్ల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బు లాక్కొని ఎన్నిక‌ల‌ప్పుడు ఓటుకి వెయ్యి రూపాయ‌లు ఇస్తే చాలు"
"ఓటుని కొంటారా?"
"రాజ‌కీయ‌మంటే కొన‌డం అమ్మ‌డ‌మే క‌దా, అందుకే క‌దా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొంటున్నాను"
"మీ ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ కొంటే ఎందుకు గ‌గ్గోలు పెడుతున్నారు"
"మ‌నం చేస్తే న్యాయం. అవ‌త‌లి వాడు చేస్తే మోసం"
"మీ జీవితాన్నిఒక పుస్త‌కం రాయ‌చ్చు క‌దా"
"నా జీవిత‌మే ఒక తెరిచిన పుస్త‌కం"
"అందులో అన్నీ ఖాళీ పేజీలే"
ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ప్ర‌జ‌ల‌కి సేవ చేస్తున్న అందుకే ఖాళీ పేజీలు
Back to Top