శాతకర్ణి కథ

శాతకర్ణి సినిమా విడుదల తర్వాత తానే గత జన్మలో శాతకర్ణి అని బాలకృష్ణకి నమ్మకం కుదిరింది. అవే మీసాలు, డ్రెస్ తో తన నియోజకవర్గం హిందూపురం పర్యటనకి వెళ్లాడు. తమ ఎమ్మెల్యే కొత్త గెటప్ లో వచ్చేసరికి చూడడానికి జనం వచ్చారు.
     
"నేను గౌతమిపుత్ర శాతకర్ణిని" అన్నాడు బాలకృష్ణ
"మీరు సినిమాల్లో శాతకర్ణి కానీ, హిందూపురంలో మాత్రం పాతకర్ణివే" అన్నారు ప్రజలు
"సమయం లేదు మిత్రమా"
"అవును ఎన్నికలు దగ్గరికొచ్చేశాయి"
"యుద్ధం చేసయినా గెలుస్తాను"
"అవును మిమ్మల్ని గెలిపించి మేము సమస్యలతో యుద్ధం చేస్తున్నాం"
నా పాలనలో ప్రజలు సుభిక్షంగా వుండాలి
సుభిక్షం సంగతేమోకానీ భిక్షంగా మాత్రం వున్నాం
సమస్యలుంటే చెప్పుకోండి సమయం లేదు, అవతల సినిమా పనులున్నాయి
పెన్షన్లు రాలేదు సార్
"ఆర్డీవోని పిలిపించండి"
ఆర్డీవో వచ్చాడు
"పెన్షన్లు ఎందుకు రాలేదు"
"డబ్బులు లేవు"
ఎందుకు లేవు
మీ బావగారు ఇవ్వలేదు
"శరణమో రణమో తేల్చుకోమను"
ఆయన చంద్రబాబు, డిమిట్రియాస్ కాదు
మా బావగారా, అయితే నేనే శరణ కోరుతాను
"కనీ మీరు శాతకర్ణి"
నేను శాతకర్ణి అయితే ఆయన పలువర్ణి. ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో తెలియదు
హిందూపురం ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు తీసుకొని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు బాలకృష్ణ
బాలకృష్ణని చూసి ఇంకా మేకప్ తీయలేదా? అని అడిగాడు బాబు
మీరు రాజకీయాల్లో కనపడని మేకప్ వేసుకుంటారు. నేను సినిమాల్లో కనిపించే మేకప్ వేసుకుంటా అంతే తేడా
"ఏంటి విషయం?
నియోజకవర్గంలో నిధులు లేవు
"నిధులు కావాలంటే మోడీ ఇవ్వాలి"
ఎందుకివ్వడు? శరణమా? రణమా? తేల్చుకోమను
ఏంటి తేల్చేది. ఆయనతో తేల్చుకుంటే మనల్ని ముంచుతాడు

తాజా ఫోటోలు

Back to Top