సెట్టా? గ్రాఫిక్కా??

భువనేశ్వరీ పుత్ర లోకేష్ కర్ణికి తెలిసినంతగా ఎన్టీఆర్ చరిత్ర మిగతావారికి తెలియదు. అందుకే పుత్ర, పాత్ర, ప్రపాత్రుల వరకు మిగిలిపోయేలా లోకేష్ విజయవాడలో ఎన్టీఆర్ మ్యూజియం పెట్టించారు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఎన్టీఆర్ పేరు నిలబడాల్సిందే. అందులో ఎవరికీ సందేహం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణిగా రూపాంతరం చెంది ఆవేశంతో, అదే గాంభీర్యంతో బయట విజయాశ్వం ఎక్కి తిరుగుతున్న బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి పొంగిపోయి చెప్పారు.

                                      తెలుగువారికి తెలియని, తెలుగువారు గర్వించదగ్గ తెలుగు రాజోత్తముడు  అంటూ సినీ అతిరథ మహారధులు చెప్పినట్లు మహాదృశ్యకావ్యం శాతకర్ణి. ఇదెక్కడి చరిత్ర? ఆధారాలెక్కడ అని ప్రధాన స్రవంతి మీడియా మొహమాటం కొద్దీ, అవసరాల కొద్దీ అడగలేకపోయింది . కానీ, సోషల్ మీడియా ఉతికి ఆరేసింది. దెబ్బకు రచయిత సిరివెన్నెల, దర్శకుడు క్రిష్ విశ్వనాథ సత్యనారాయణను తెరపైకి తెచ్చారు. 

                             కట్టలు కట్టలు నోట్ల కట్టలు కురిపించిన కట్టప్పకథను చెక్కిన జక్కన్ననే అమరావతి నిర్మాణానికి సాయమడిగినప్పుడు, శాతకర్ణిని చెక్కిన కట్టన్నను అడగలేకపోతే మర్యాద కాదని ఒక చేయి వేయవలసిందిగా అడిగారు. అయ్య వారిని చేయబోతే ఏదో అయ్యిందని సామెత. ప్రపంచ గొప్ప నగరాల్లో నిలబడబోయే అమరావతికి ఇంకా ఎవరెవరు సెట్లు వేయాలో? భూములిస్తూ ఎందరెందరు మెట్లుగా మారాలో? సమయం లేదు మిత్రమా! సెట్టా ? గ్రాఫిక్కా??
Back to Top