ప్రేతాత్మ విమర్శ


అవును అవును అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. 
హోదా 15 ఏళ్లు కావాలని, తర్వాత హోదా ఏమైనా సంజీవనా అని ఎవరైతే అనలేదో వాళ్లంతా ఆత్మవిమర్శ చేసుకునే తీరాలి. 
హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని వాగి, తర్వాత కేంద్రం రాష్ట్రానికి హోదా ఎందుకు ఇవ్వదు అనే ప్లేటు ఫిరాయింపులు  చేయనందుకు ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
పైనుంచి బోళ్లు వచ్చిపడుతున్నాయి...ఇంకా ఏం రావాలి...అందరికంటే మనకే ఎక్కువ వచ్చాయి..అందుకు ఇచ్చినవాళ్లకి ధన్యవాదాలు...తిరుపతి లడ్లు అని భజన చేయనందుకు చింతిస్తూ ఆత్మను కుళ్లబొడిచి మరీ విమర్శ చేసుకునే తీరాలి. 
నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని అర్థమైన వాళ్లంతా భేషుగ్గా ఆత్మవిమర్శచేసుకోవాలి.
రెండు నాల్కల సిద్ధాంతాన్ని పాటించనందుకు ప్రతి ఒక్కరూ బాధతో తమని తాము నిందించుకుంటూ విమర్శించుకోవాలి. 
మాట మీద నిలబడటం అనే సిద్ధాంతం ఎవరికైనా ఉంటే వాళ్లు మరింత లోతుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. 
సిద్ధాంతం అంటే బాబుదే...స్వింగ్ పాలసీ అంటే బాబుదే...మడతేసే స్టేటజీ బాబుదే...అని అర్థం కాని వాళ్లంతా తమలోకి తాము తొంగి చూసుకుని మరీ విమర్శ చేసుకోవాలి. 
ఓటుకు నోటు, స్టేలు, కాల్ మనీ, విశాఖ కుంభకోణాలు, భూ కబ్జాలు, ఎస్సీఎస్టీలపై దాడులు వీటన్నిటికీ కారణం ఎవ్వరో రివైండ్ చేసుకుని మరీ ఆత్మవిమర్శ చేసుకోవాలి..
సొంత డబ్బా కొట్టుకోవడం, సొంత మీడియాతో డప్పు కొట్టించుకోవడం, ప్యాకేజీలతో పొగిడించుకోవడం, అవసరమైతే తిట్టించుకోవడం తెలుసా లేదా అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 
అన్నిటికీ మించి సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లెక్కలోకి తీసుకోని సెంటిమెంటును కలిగి ఉన్నామో లేదో విమర్శ చేసుకోవాలి. 
బాబు తప్ప అందరూ ఆత్మవిమర్శ చేసుకునే తీరాలి. బాబుకు మాత్రం ఆ అవసరం లేదు లెండి. ఎందుకంటే అంతరాత్మ అనేది ఒకటి ఉండేడిస్తే గదా...!! బాబు కప్ప గెంతులకు, నాలిక మడతలకు భయపడి ఎప్పుడో మర్రిచెట్టు తొర్రమీదకు పారిపోయింది. దానికి సిగ్గంటూ ఉందిగా మరి...

 
Back to Top