కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వులు

చంద్ర‌బాబు ప్రెస్‌మీట్ ప్రారంభించారు.
 • ``మేము ఏ ర‌కంగా ముందుకు పోతున్నామో మీకంద‌రికీ తెలుసు. అందులో భాగంగా ల‌క్ష‌మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వులిస్తాం`` అన్నాడు బాబు
 • ``ల‌క్ష‌మందికి ప‌ద‌వులు ఏ ర‌కంగా సాధ్యం సార్‌?``అడిగాడు విలేక‌రులు
 • ``అనుకుంటే సాధ్యంకానిది లేదు, మా మామ‌ని త‌ప్పించి సీఎం కావాల‌నుకున్నా అయ్యానా లేదా? ఏడాది నుంచి అర‌చేతిలో స్వ‌ర్గం చూపించాను...జ‌నం చూసారా లేదా?
 •  ఇది అంతే దీనిలో ప్ర‌ణాళిక వుంది. రాష్ట్రంలో ద‌ళారీ వ్య‌వ‌స్థ రూపుమాపితే ల‌క్ష‌మందికి ప‌ద‌వు అవ్వ‌వ‌చ్చు అర్థం కాలేదా?``
 • ``మీరు మాట్లాడేది ఏదీ అంత సుల‌భంగా అర్థం కాదు``
 • ``అర్థం కాకుండా మాట్లాడ్డ‌డం ఒక క‌ళ‌. ఈ క‌ళ‌తోనే నేను ఏళ్ళ‌త‌ర‌బ‌డి రాజ‌కీయాలు చేస్తున్నా ద‌ళారీ వ్య‌వ‌స్థ రూపుమాపి, ఆ వ్య‌వ‌స్థ కార్య‌క‌ర్త‌ల‌కు అప్ప‌చెపుతా``
 • ``అంటే కార్య‌క‌ర్త‌ల‌ను ద‌ళారులుగా మారుస్తారా?``
 • `` నేను చెప్పేది మీ క‌ర్థం కావ‌డంలేదు,వాళ్ళ‌ని స‌ల‌హా మండ‌లి స‌భ్యులుగా నియ‌మిస్తా అంటే ఉదాహ‌ర‌ణ‌కు పోలీస్‌స్టేష‌న్‌లో ఏ ప‌నులూ జ‌ర‌గ‌డంలేద‌ని జ‌నంఅనుకుంటూ వుంటారు. వాళ్ళ‌కి సాయంగా స్టేష‌న్ స‌ల‌హా మండ‌లి వుంటుంది``
 • ``అంటే వాళ్ళు జ‌నానికి సాయం చేస్తారా?``
 • ``సాయ‌మంటే నిజ‌మైన సాయం. ఇప్పుడు మ‌న‌కు ఏం కావాలంటే డ‌బ్బులు ఖ‌ర్చ‌యినా ప‌ర్వాలేదు, ప‌నులు జ‌ర‌గాలి, ఏ ప‌నికి ఎంత ఖ‌ర్చ‌వుతుందో ఈ స‌ల‌హా మండ‌లి నిర్ణ‌యించి ప‌నులు జ‌రిగేలా చూస్తుది, ఒక విధంగా అధికారుల‌కి ప్ర‌జ‌ల‌కి మ‌ధ్య అనుసంధాన‌మ‌న్న‌మాట‌``
 • ``వాటే ఐడియా సార్ జీ``
 • `` ఇదే విధంగా ఎమ్మార్వో, ఆర్డివో ఆఫీసులో కూడా స‌ల‌హామండ‌లి వుంటుంది.ఆఫీసుల్లో అవినీతిని ఎలాగూ నిర్మూలించ‌లేన‌పుడు దాన్ని వ్య‌వ‌స్థీక‌తం చేసే ప‌నిని మా కార్య‌క‌ర్త‌లు తీసుకుంటారు. వీళ్ళు చేసే ప్ర‌తి ప‌నికి వాళ్ళ సా్థ‌యిలో క‌మీష‌న్ ముడుతుంది``
 • ``దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కి న‌ష్టం కాదా?``
 • `` ప్ర‌జ‌ల‌కి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌ష్టం కాదు, లాభం కూడా, ఇది ఒక‌ర‌కంగా క‌న్స‌ల్టెన్సీ సిస్టం, మీ సేవ‌లాగా, ఒక‌ర‌కంగా ప్ర‌జ‌ల ముంగిట ప్ర‌భుత్వం లాంటిది. ఎందుకంటే మా ప్ర‌భుత్వంలో ఏ ఒక్క‌రూ నేరుగా ప‌నులు చేసుకోలేరు. అందువల్లే ఈ సిస్టం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని చిటికెలో ప‌రిష్క‌రించ‌డ‌మంటే ఇదే``
 • `` ఏమైనా మీరు గొప్ప వారు సార్‌``
 • ``వూరికే పొగ‌డ‌కండి, ఈ మూడున్న‌రేళ్ళ‌లో ఇంకా చాలా చేస్తాను. రాష్ట్రాన్ని సింగ‌పూర్‌గా మారుస్తానంటే రోడ్లు బాల్డింగులు క‌డ‌తాన‌ని కాదు అర్థం. గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చే ప్ర‌తి స‌ర్వీసుకి యూజ‌ర్‌చార్జీ వ‌సూలు చేస్తాను. జ‌నాన్ని యూజ్ అండ్ త్రో చేయ‌డంలో నన్ను మించిన‌వాడు లేడు. ఇక‌పై ప్ర‌తి ప్రెస్‌మీట్‌కి మీరు యూజ‌ర్ చార్జీలు చెల్లించాలి``
 • ``అదేంటి మేమే మీకు స‌ర్వీసు చేస్తున్నాం క‌దా, మీరు చెప్పిన‌వి ప్రంట్ చేస్తున్నాం``
 • నేను చెప్పినా వార్త‌లు అమ్ముకుంటున్నారు కాబ‌ట్టి టాక్స్ క‌ట్టాల్సందే ``అన్నాడు బాబు
 • విలేక‌రులు జ‌డుసుకుని ప‌రిగెత్తారు.
Back to Top