మహానాడు విశేషాలు

మ‌హానాడు విశేషాలు చెప్పండి సార్" చంద్ర‌బాబుని అడిగారు విలేక‌రులు
"మ‌హానాడులో నేను ఎన్టీఆర్‌ని పొగిడాను. మంత్రులు న‌న్ను పొగిడారు. నేను కార్య‌క‌ర్త‌ల‌ను పొగిడాను. వాళ్లు న‌న్ను పొగిడారు. అంద‌రం ఒక‌రికొక‌రం పొగుడుకున్నాం. తెలంగాణ వాళ్లు వ‌చ్చి డ‌ప్పు కొట్టారు. బ‌తుకమ్మ‌ను తెచ్చారు. నేను మోసాను. మంచి భోజ‌నాలు చేసారు. మా కార్య‌క‌ర్త‌ల‌కు బాగా తిన‌డం అల‌వాటైంది. కాబ‌ట్టి వాళ్లే వండుతూ తిన్నారు. కొంద‌రు వెళ్లేవాళ్లు వెళ్లారు. కొంద‌రు గుండు కొట్టించుకున్నారు."
"మేము అడిగింది బోడిగుళ్లు, దేవుడిగుళ్ల గురించి కాదు ప్ర‌జ‌ల గురించి ఏం మాట్లాడార‌ని?"
"పొద్ద‌స్త‌మానం ప్ర‌జ‌ల గురించి ఏం మాట్లాడుతా? అయినా ప్ర‌జ‌ల పాపాలు ఎక్కువ చేసి గుళ్ల‌కు వెళుతున్నార‌ని మొన్న చెప్పాను క‌దా"
"అంటే గుళ్ల‌కు వెళ్లేవాళ్లంతా పాప‌ాత్ములా?"
"నా మాట‌లు వ‌క్రీక‌రిస్తున్నారు"
"అనేదంతా అనేసి చివ‌ర‌కు వ‌క్రీక‌రిస్తున్నారు అని ప‌త్రిక‌లపైనే నింద‌లు వేస్తున్నారు"
"రాజ‌కీయ‌మంటే అదే... ఎన్టీఆర్‌కి నేను వెన్నుపోటు పొడిచి, నేను భార‌త‌ర‌త్న సిఫార‌స్ చేశానుక‌దా"
"అప్పుడు మీకు భార‌త వెన్నుపోటుర‌త్న అని బిరుదు ఇవ్వాలి?"
"ఇదే మరీ త‌ల‌పోటు, వెన్నుపోట్లు లేకుండా రాజకీయాలు న‌డుస్తాయా?  వెన‌క‌టికి వీభీష‌ణుడు రావణ‌సురుడికి వెన్నుపోటు పోడ‌వ‌లేదా?  సుగ్రీవుడు వాలిని మోసం చేయ‌లేదా? శ‌కుని మాయ జూదం ఆడ‌లేదా?"
"అవ‌న్నీ పురాణాలు"
"
పుర‌ణామైనా, వ‌ర్థ‌మాన‌మైనా మ‌న‌కేంటి ప్ర‌యోజ‌న‌మ‌నేదీ ఆలోచించాలి"
"ఇంత‌కూ మ‌హానాడులో ఏం తీర్మానాలు చేసారు?"
"తీర్మానాల‌కు ప‌నులు జ‌ర‌గ‌వ‌ని నాకూ తెలుసు. కానీ ప్రెస్ వాళ్ల‌కి రాసుకోవ‌డానికి ఏదో ఒక‌టి మేత కావాలి కాబ‌ట్టి కొన్ని తీర్మానాలు త‌ప్ప‌వు. అగ్ర‌వ‌ర్గాల్లో పేద‌ల్ని గుర్తించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని తీర్మానించాం"
"ఎలా గుర్తిస్తారు?"
"మొదట నాతో ప్రారంభిస్తా. చేతికి వాచీకుడా పెట్టుకోని నాకంటే పేద‌వాడు ఎవ‌డుంటాడు? అందుకే లోకేష్‌బాబుకి ముఖ్య‌మంత్రి పోస్టుని రిజ‌ర్వ్ చేశా. అదేవిధంగా కారుండి డ్రైవ‌ర్‌ని అపాయింట్ చేసుకోలేని వాళ్లు కూడా పేద‌వాళ్లే. మా మంత్రుల్లో కూడా చాలా మంది పేద‌వాళ్లున్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యం  చేయించుకున్న మా మంత్రి కామినేని శ్రీ‌నివాస్ కూడా పేద‌వాడే."
"అంటే ప్ర‌భుత్వాస్ప‌త్రిలో పేద‌వాళ్లే వైద్యం చేయించుకుంటార‌నా మీ ఉద్దేశం."
"ప‌సిపిల్ల‌ల్ని ఎలుకలు కొరికి తినే ఆస్ప‌త్రుల్లో పేద‌వాళ్లు కాకుంటే ధ‌నికులు వైద్యం చేయించుకుంటారా?"
"మేము అడిగేది గేదెల్ని సాక‌కుండా పాలు, పెరుగు అమ్ముకునే మీలాంటి హెరిటేజ్ పేద‌వాళ్ల గురించి కాదు నిజ‌మైన పేద‌ల గురించి"
"ఏమండి సింపుల్. దీనికి ఒక క‌మిటీ వేస్తాం. ఆ క‌మిటీ మొద‌ట క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తుంది. ఆ తరువాత అమెరికా వెళ్లి అక్క‌డ రిజ‌ర్వేష‌న్ల‌ని ఎలా అమ‌లు చేస్తున్నారో అధ్య‌య‌నం చేస్తుంది."
"అమెరికాలో రిజ‌ర్వేష‌న్లులేవు"
"ఆ విష‌యం తెలుసుకోవ‌డానికైనా అమెరికా వెళ్లాలి క‌దా"
"ఇంకా ఏమేమిచేస్తారు?"
"
ఏమీ చేయం. అర‌చేతిలో అమ‌రావ‌తి... గాలిలో ప్ర‌త్యేక‌హోదా... ప‌ట్టిసీమ వుత్తుత్తిసీమ‌... పోల‌వ‌రం న‌త్త‌న‌డ‌క ఏళ్ల త‌ర‌బ‌డి ఇలా చెబుతూఉంటాం"
"జ‌నం వింటారా?"
"
రాష్ట్ర‌మంతా పూల‌తోట‌లు పెంచితే వింటారు"
"పూల తోట‌లా? అవేందుకు?"
"
జ‌నం చెవిలో పెట్టాలంటే పువ్వులు కావాలిగా"
Back to Top