ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు...
మిత్రుడు, తెలంగాణా ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌రరావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. కానీ రాజ‌కీయాల్లో టెక్నాల‌జీ ఉప‌యోగించ‌డం నాతోనే మొద‌లైంది. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ స్టార్ట్ చేస్తా... పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్టు నాకు చిన్న‌ప్పుడే ప‌వ‌ర్ పాయింట్ అర్థ‌మైంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో రాజ‌గోపాల్‌నాయుడిని ప‌ట్టుకొని ఎమ్మెల్యే అయ్యాను. అంజ‌య్య‌ను ప‌ట్టుకొని మంత్రిన‌య్యా. ఒక సెల‌బ్రిటికి అల్లుడైతే సేప్టీ అని ఎన్టీయార్‌తో బంధుత్వం చేసా... మ‌న ద‌గ్గ‌ర పాయింట్‌వున్న లేక‌పోయినా ప‌వ‌రుండాలి. అందువ‌ల్ల ఎన్టీయార్‌ అధికారంలోకి వ‌స్తాడో రాడోన‌నే అనుమానంతో కాంగ్రెస్‌లోనే వుండి పోటీ చేసా ఎన్టీయార్‌ని జ్యోతిల‌క్ష్మితో పోల్చి బండ‌బూతులు తిట్టా. ఎన్టీయార్‌ అధికారంలోకి రాగానే ప‌వ‌ర్ పాయింట్‌కి ద‌గ్గ‌ర‌య్యా. నాదెండ్ల తిరుగుబాటు చేస్తే ఎమ్మెల్యేల‌ను వూరూరు తిప్పి మామ‌కి ప‌వ‌ర్ తెచ్చా. అదే పాయింట్ ప్ర‌యోగించి ప‌వ‌ర్ వూడ‌గొట్టా. ఇప్పుడు చెప్పండి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో న‌న్నుమించిన వాడున్నాడా? అనగానే అందరూ కామ్ అయిపోయారు.
అప్పుడు చంద్రబాబు  ల్యాప్‌ట్యాప్ ఆన్ చేస్తే స్క్రీన్‌పైన మోదీ బొమ్మ క‌నిపించింది.
ఇప్పుడు నా ప‌వ‌ర్ పాయింట్ మోదీనే. ఒక‌ప్పుడు గుజ‌రాత్ అల్ల‌ర్ల గురించి విమ‌ర్శించాను. గాలి ఇటువీయ‌గానే మోదీ భ‌జ‌న మొద‌లుపెట్టాను. రేపు ప‌వ‌ర్ మారుతుంద‌న్న అనుమాన‌మొస్తే ఫిరాయించి బీజేపీని తిడతా...
స్క్రీన్ పైన వెంక‌య్య నాయుడు బొమ్మ వ‌చ్చింది.
నాకంటే ప‌వ‌ర్ పాయింట్ బాగా తెలిసిన‌వాడు ఈయ‌న‌. 30 ఏళ్ల క్రితం ఎన్నిక‌ల్లో గెలిచి, తర్వాత ఎప్పుడూ గెలవకపోయినా, ప‌వ‌ర్‌కి ద‌గ్గ‌ర‌గా వుండ‌డం ఈయ‌న ప్ర‌త్యేక‌త‌.
స్క్రీన్‌పైన అమ‌రావ‌తి బొమ్మ‌వ‌చ్చింది.
చెట్టుపేరు చెప్పి కాయ‌ల్ని అమ్మ‌డ‌మే రాజ‌కీయం. అమ‌రావ‌తి పేరు చెప్పి ఐరావ‌తం ఎక్కి వూరేగాలి. రాష్ట్రంలో ల‌క్ష స‌మ‌స్య‌లుంటే, రాజ‌ధాని నిర్మాణానికి కోట్ల ఖ‌ర్చు ఎందుక‌ని ఎవ‌రు అడ‌క్కుండా కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌తో ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూ వుండాలి.
స్క్రీన్‌పై రాయ‌ల‌సీమ మ్యాప్ వ‌చ్చింది
నీళ్ళు ఎలా వ‌స్తాయో కేసీఆర్ చెబితే, సీమ‌కు నీళ్ళు ఎప్ప‌టికీ రావ‌ని నేను చెబుతున్నాను. ఇది ఎడారిగా మారిన త‌రువాత మ‌న అదృష్టం బాగుండి పెట్రోల్ ప‌డితే గ‌ల్ఫ్ కంట్రీల్లాగా మ‌న‌ది గ‌ల్ఫ్ రాష్ట్రం అయిపోతుంది.
Back to Top