పోలవరం మాయ

విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు చంద్రబాబు
సార్, పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది. అడిగారు విలేకరులు
పూర్తయ్యేనాటికి పూర్తవుతుంది. ఏదీ మన చేతుల్లో లేదు. అంతా దైవాదీనం. చెయ్యి తడిస్తేనే పోలవరం తడిసేది. ఇచ్చిపుచ్చుకుంటేనే ప్రాజెక్ట్ వర్కవుటయ్యేది. అన్నాడు బాబు.
మీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చారు కదా
ఇచ్చేదెవడు. పుచ్చుకునేదెవడు? అంతా మాయ
ఈ కాంట్రాక్ట్ ని రాయపాటికి ఇవ్వకూడదని మీరు గతంలో డిమాండ్ చేసారు కదా
ఒపీనియన్ మార్చుకోవడమే పాలిటిక్స్. అప్పుడాయన కాంగ్రెస్. ఇప్పుడు మా పార్టీ. సైకిలెక్కిన వ్యక్తిని చంకనెక్కించుకోవడం మా పాలసీ.
ప్రాజెక్టుల్లో నీళ్లు వచ్చినా రాకపోయినా మీకు డబ్బులు రావడం ముఖ్యం అంతే కదా
ముమ్మాటికి, డబ్బుల కోసం కాకపోతే ప్రజల కోసం రాజకీయం చేస్తున్నానని అనుకుంటున్నారా?
ఎప్పుడు చూసినా నీతి, నిజాయితీ, ప్రజలు అంటూ వుంటారే
జనం కోసం అట్లా మాట్లాడుతూ వుండాలి. నీతి గురించి మాట్లాడితే మా ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవదు.నీతి గురించి మాట్లాడుతూనే రెండెకరాల నుంచి లక్ష కోట్లు సంపాదించాను. మా మంత్రి నారాయణ విలువల గురించి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో  విద్యాదోపిడీ చేసి పారేసాడు. మా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సారా వ్యాపారం నుంచి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే వంద పేర్లున్నాయి. అన్నాడు బాబు
అవన్నీ మాకు తెలుసు కనీ, పోలవరం సంగతి చెప్పండి అడిగారు విలేకరులు
పోలవరం అంటే కాంట్రాక్టర్లకి వరం. ఇప్పటికీ వందలకోట్లు అడ్వాన్స్ లు ఇచ్చేసాం.అందులో మా పర్సంటేజి మాకు ముట్టింది.కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్ట్ లిచ్చారు.వాళ్లు సబ్ సబ్ కాంట్రాక్ట్ లిచ్చారు. వాళ్లు మినీ సబ్ కాంట్రాక్ట్ లిచ్చారు.  చివరకి తాపీ మేస్త్రీలు, అడ్డా కూలీలు కలిసి దీన్ని పూర్తిచేస్తారు. ఏడాది తిరక్కుండా అది మరమ్మతులకి వస్తుంది. అప్పుడు మళ్లీ కాంట్రాక్టర్లని పిలుస్తాం. మళ్లీ టెండర్లు, మళ్లీ కమిషన్లు ఇదంతా పెద్ద కథలే
మరి రష్యా, ఒమన్ ల పార్ట్ నర్ షిప్ అన్నారు
మీ మీడియా వాళ్లకి రాసుకోవడానికి న్యూస్ కావాలి కాబట్టి ఏదో చెబుతాం. ఆ కంపెనీలు కాగితాల మీద వుంటాయి. ఆ కాగితాలు మా ఫైళ్లలో వుంటాయి, రష్యా, ఒమన్ దేశాల్లో ఏమి కంపెనీలుంటాయో ఎవడికి తెలుసు.
మరి జనం సొమ్ముకి జవాబుదారీతనం లేదా?
వుంది కాబట్టే దోచుకుంటున్నాం. జనం సొమ్ము అంటే మన సొమ్మే కదా. మన సొమ్ముని మనం తినకపోతే ఇంకెవరు తింటారు చెప్పు?
ఇంతకూ ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు?
మోడీ ఈ దేశాన్ని పాపర్ పట్టించే పనిలో వున్నాడు. ఆయనకి మద్దతుగా నేను రాష్ట్రాన్ని డబుల్ పాపర్ పట్టిస్తాను
పోలవరం పూర్తయితే అద్భుతాలు జరుగుతాయని చెప్పారు
పూర్తయితే జరుగుతాయి. కానీ పూర్తికావాలి కదా. 2018కి పూర్తి చేస్తామని చెప్పాం. అది ఎలాగూ పూర్తి కాదు. 2019కి ఎలాగూ నేను అధికారంలో వుండను. మీకెందుకు టెన్షన్.
పోలవరం పూర్తయినా, కాకపోయినా మీరు ఎలాగూ అధికారంలో వుండరు అది గ్యారంటీ అన విలేకరులు వెళ్లిపోయారు
Back to Top