నారా పవనం

వ్యాపారం రెండు రకాలు. ఒకటి హోల్ సేల్. రెండు రీటైల్. రకం ఏదైనా వ్యవహారం వ్యాపారమే. వ్యాపారం ఎలా చేసినా వ్యాపారులకు కావాల్సింది లాభమే. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వ్యాపారం ఇప్పుడు మాంచి ఊపుమీదుంది. సినిమా వాళ్లకు ఇప్పుడున్నది మంచి కాలం. అటు పొరుగున్న తమిళనాట హీరోలు డైరెక్టుగా ఎన్నికల బరిలోకి దిగి సత్తా చూపించుకోవాలనుకుంటుంటేం..ఇటు మన రాష్ట్రంలో కొందరు హీరోలు మాత్రం ప్యాకేజీ పుచ్చుకుని యాక్ట్ చేసి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయులుగా వృద్ధి చేసుకుంటున్నారు. పార్టీలు పెట్టడం, అధికార పార్టీతో సంప్రదింపులు చేసుకుని అవసరానికి వారికి ఉపయోగపడటం  లాభసాటిగా పార్టీని అమ్ముకోవడం లేదా బేరసారాలతో నడుపుకోవడం. ఇదే ఈ వ్యాపార సూత్రం.

అధికార పార్టీకి ఆట‌బొమ్మ ఈ అజ్ఞాత‌వాసి..
పవన్ కళ్యాణ్ నే చూడండి. ప్రశ్నించడం కోసం ఒక పార్టీ అని పెట్టి జనాలందరిలో క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టుకునేలా చేసాడు. అప్పుడప్పుడూ తన పార్టీని, ప్రశ్నలను, సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని అధికార పార్టీకి ఆయుధంగా ఉపయోగపడుతున్నాడు. అధికార టిడిపికి ఆటబొమ్మ ఈ అజ్ఞాతవాసి. అప్పుడప్పుడూ అజ్ఞాతంలోకి, అడపాడదడపా జనావాసాల్లోకి (అంటే చంద్రబాబుకు అవసరం అయినప్పుడు) వచ్చి వెళుతుంటాడు. అలా వచ్చినప్పుడు కొన్ని పంచ్ లు వేసి వెళ్తుంటాడు. అయితే ఒకప్పుడు అన్నగారి ప్రజారాజ్యం కోసం కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతాన్న పవన్, ఇప్పుడు తన పంచ్ లతో తన పంచె తనే ఊడగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే అన్యాయాన్ని ప్రశ్నిస్తా అంటూ పెట్టిన పార్టీ నుంచి అప్పుడప్పుడూ వచ్చి, అన్యాయం చేసే వాళ్ల గురించి ఒక్కమాటైనా నోరు తెరిచి అడగడు పవన్. అయితే ఇదంతా వ్యాపారంలో భాగమే మరి. 

ప్ర‌శ్నించాల్సింది ఎవ‌ర్నీ?
అన్నగారి ప్రజారాజ్యం పార్టీ సింగిల్ సెటిల్మెంట్ తో సెట్ అయిపోయి, కాంగ్రెస్ లో మెర్జ్ అయిపోయింది. దానివల్ల చిరంజీవి రాజకీయ జీవితానికి ప్రస్తుతానికి తెరపడిపోయింది. ఇలా అయితే వ్యాపారంలో భవిష్యత్ లాభాలన్నీ పోతాయని పవన్ కు అర్థం అయ్యింది. అన్నలా కాకుండా పార్టీని అప్పుడప్పుడూ వాడుకుంటూ ఈఎంఐ పద్ధతిలో అధికార పక్షానికి పనిచేయడం వల్ల ఎక్కువ లాభం అనే విషయం తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు జనసేన అధినేత పోలవరం గట్లు, టిడిపి నాయకుల ఇంటి మెట్లు ఎక్కిదిగుతున్నాడు. వ్యాపారం వర్థిల్లాలంటే ఈ మాత్రం కష్టపడాలి మరి. చివరిగా ఒక్క ప్రశ్న పవన్ కళ్యాణ్ అడిగే చచ్చు పుచ్చు ప్రశ్న కాదనుకోండిం ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్ ప్రశ్నించేది అన్యాయం చేసే వాళ్లనా?. అన్యాయానికి గురైనవాళ్లనా? ఎవరకైనా అర్థం అయితే ఇంకెవరికైనా చెప్పండి ప్లీజ్. 

 
 
Back to Top