ప్రవాసులతో పిట్టలదొర ముచ్చట్లు

 


పిట్టల దొర కొయ్య తుపాకిని భుజానేసుకుని ఫైటెక్కి అమెరికా వెళ్లాడు. అలా దిగాడో లేదో ఇలా చుట్టుముట్టేసారు ప్రవాసంధ్రులు. అమరావతి గురించి చెప్పండి అంటూ రెక్కలుచ్చుకుని ఈడ్చుకుపోయి పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టారు. తుపాకి సరిచేసుకుని టోపీ దులుపుకుని పిట్టల దొర మొదలెట్టాడు. 
అమెరికాలో మీరంతా ఇలా ఉండటానికి కారణం నేనే. అసలు మీరనేముంది అమెరికన్లు అమెరికాలో బతుకుతున్నారంటే నా దయవల్లే. ముందసలు అమెరికా అనేదాన్ని కనిపెట్టింది కూడా నేనే. అబ్రహం లింకన్ కు గడ్డం పెంచమని, బుష్ ను బుష్ కోట్ వేసుకోమని, ట్రంప్ ను తలదువ్వుకోవద్దని సలహాలు నేనే ఇచ్చాను. అప్పట్లో ప్రపంచబాంకుకు అప్పిచ్చిన ఘనత కూడా నాదే....పిట్టల దొర వాక్ప్రవాహానికి ముగ్ధులైపోయిన ప్రవాసభారతీయులు...
మరి అమరావతి అని మళ్లీ గుర్తు చేసారు.
హైదరాబాద్ లో సైబర్ టవర్స్ నేనే కట్టాను. హైదరాబాద్ ను రాష్ట్ర పటంలో నేనే కుట్టాను. అమెరికానుంచి ఐటిఇ తెచ్చి ఆంధ్రాలో పెట్టాను. అలా పెట్టేయడంతో అమెరికాలో ఐటి అనేది లేకుండాపోయింది. 
దొరా అమరావతి...గొంతు పెగల్చుకుని ఆశగా అడిగారు ప్రవాసాంధ్రులు
దానికేం భేషుగ్గా ఉంది. నా తుపాకి పనిచేయకపోయినా నక్సల్ తుపాకులు పని చేస్తున్నాయి. నేను న్యాయం చేయకపోయినా ఆటవిక న్యాయం రాష్ట్రంలో రాజ్యం ఏలుతోంది. ఓటుకు నోటులో దొరక్కపోయినా బాబ్లీ కేసులో కోర్టు లెంపకాయలు తిన్నాను. రుణమాఫీలు చేయకపోయినా కాబూలీవాలాలా మాఫీ అయ్యిందని సంతకాలు పెట్టించుకుంటున్నాను. 
రేపు రాబోయే ఎన్నికల్లో...ప్రవాసాంధ్రులు ఏదో చెప్పబోయారు...
అందుకే వచ్చాను. మీరు మన గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎలాగూ అక్కడ ఏదో చేసేసాం అనే బిల్డప్ నేను ఎలాగూ ఇస్తాను. ఇక్కడ మీరు కూడా అలాగే ఇస్తే సరిపోతుంది. ఓటు హక్కు మీకు ఇస్తున్నాం...కనుక మాకే ప్రచారం చేయాలి. అంటూ స్టేజ్ దిగివెళ్లిపోయాడు పిట్టల దొర. 
జై పిట్టల దొర...జై జై పిట్టల దొర...పిట్టల దొర నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేసారు సభికులు...
అంతేమరి...పిట్టలదొర వినిపించే కథలకు సొంతూరు, పై ఊరు అనే తేడా లేదు. మీ నమ్మకమే మా ఓటుబ్యాంకు....నోటు బాంకు ఇదీ పిట్టలదొర పచ్చ సిద్ధాంతం. 
 


Back to Top