క్షణం తీరిక లేదు...దమ్మిడీ లాభం నేదు

ఏ మాటకామాటే చెప్పుకోవాలి.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు  ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా  కాలికి బలపాలు కట్టేసుకుని తెగ తిరిగేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక పట్టుమని ఓ పది రోజులు కూడా  పాపం ఆయన రెస్ట్ తీసుకున్న పాపాన పోలేదు. విమానం రెడీగా ఉంటే ఏదో ఒక దేశం వెళ్లిపోతారు. జపాన్..సింగపూర్..మలేషియా..చైనా...అబ్బో...ఆయన తిరగని దేశం లేదు. ఎక్కని గుమ్మం లేదు.తెగ కట్టపడిపోతున్నారు.
 • ఇంత బిజీగా ఉంటూనే  మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఎన్నికల ఖర్చులు సాయం చేసిన వారికోసం రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందాకి పెద్ద డిజైనే గీయించారు.
 • డిజైన్ గీసి పెట్టింది ఎవరో అల్లాటప్పా ఇంజనీర్లు అనుకునేరు..గీసింది సింగపూర్  పెబుత్వమే.
 • డిజైన్ కోసం సింగపూర్ కి వెళ్లాలా అని  పెతి పక్షాలు వేలాకోలం ఆడినా చంద్రబాబు  వెనక్కి తగ్గనే లేదు.
 • డిజైన్ గీసి పెట్టిన సింగపూర్ కట్టాన్నీ ఆయన ఉంచుకోలేదు. ఓ 50 వేల ఎకరాలు తీసుకోండ్రా అని రాసిచ్చేశారు. చేతికి ఎముక లేని దెర్మ పెబువు మరి.
 • ఇన్ని పనుల బిజీలో ఉండీ కూడా ఏపీకి కేంద్రం నుంచి రావల్సిన నిధుల కోసం మనస్షూర్తిగా ఎదురు చూస్తున్నారే తప్ప...కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనని  మంచి మనిషి ఆయన.
 • ప్రత్యేక హోదా ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక 15 నెలల తర్వాత కూడా ఆ ఊసెత్తని బిజెపి పెబుత్వం మీద ఈగవాలినా కత్తి పట్టుకుని తరిమేసే  ఔదార్యం చంద్రబాబు సొంతం.
 • అంత మంచి మడిసి కాబట్టే ...లోకంలో మాయలు..మర్మాలు..రహస్య కెమెరాలు..చాటు మాటు చెవులు ఉంటాయని తెలుసుకోలేక...ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు. అయినా సాటి ముఖ్యమంత్రి దొరికిపోతే మనసులో దాచుకోకుండా  పబ్లీక్ చేసేసి నానా యాగీ చేసిన తెలంగాణ సిఎం కేసీఆర్ కి మర్యాదే తెలీదు.
 • ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోడం కోసం..
 • అవసరమైతే ఆంధ్ర ప్రదేశ్ కు రావల్సిన నిధులను..ప్రత్యేక హోదాలను..ప్యాకేజీలను సైతం వదులుకోడానికి కూడా వెనుకాడని పౌరుషం  గల వీరుడు ధీరుడు మా చంద్రబాబు.
 • రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ..జనం ఓట్లేశాక ఆ మాఫీని మాఫీ చేసేసిన చాణక్యుడు.
అన్ని తెలివి తేటలు..అంత తెగువ ఉన్నా...
కేంద్రంలో బిజెపి...పక్కలో బల్లెంలా   పవన్ కళ్యాణ్ ఉన్నా..
 • రాజధాని నిర్మాణం కోసం రైతుల మెడలపై కత్తి పెట్టి భూములు సేకరించిన భగీరథుడూ ఆయనే.
 • అధికారంలోకి వచ్చిందగ్గర్నుంచీ ఇలా క్షణం తీరిక కూడా లేకుండా తిరుగుతున్నా చంద్రబాబు నాయుణ్ని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటూనే ఉన్నాయి. 
ఏదో సామెత చెప్పినట్లు..
 • క్షణం తీరిక లేకుండా ఆయన పని చేస్తోన్నా  దమ్మిడీ లాభం లేకుండా పోతోంది.
 • దమ్మిడీ లాభం కూడా లేదా అని నోళ్లు వెళ్లబెట్టకండి.లాభం లేనిది చంద్రబాబుకో..ఆయన పార్టీ నేతలకో కాదు.
 • ఆయన పాలించే ఆంధ్ర ప్రదేశ్ కే దమ్మిడీ లాభం చేకూరడం లేదు.
దానికి పాపం చంద్రబాబు మాత్రం ఏం చేస్తారు?
చేతనైనంతలో ఆయన ఏపీని ముంచుతూనే ఉన్నారు కదా..!
-కవికాకి
Back to Top