బాబు మాట‌ల‌కి అర్థాలే వేరులే

చంద్ర‌బాబు
విలేక‌రుల స‌మావేశం

``
సార్ సీమ‌కు
మీరేం చేశారు?``
అడిగారు విలేక‌రులు

``
నేను రాజ‌కీయాల్లోకి
 వ‌చ్చిన  కొత్త‌లో  సీమ  అనే  యాక్ట‌ర్  వుండేది. ఆమె సినిమాలు
కానీ,
ఆమెని కానీ
నేనెప్పుడు చూడ‌లేదు``
అన్నాడు బాబు

``
సార్, మేము అడిగింది సినిమాలు గురించి కాదు, సీమ‌కు మీరేం చేసార‌ని ?``

``
నాకు తెలిసి ప్ర‌పంచ
వ్యాప్తంగా  8650 ర‌కాల చీమ‌లున్నాయి. బ‌యాల‌జీపై అవ‌గాహ‌న
వున్న‌వాళ్ళు  ఇంకా  క‌రెక్ట్ గా చెబుతారు. చీమ‌లు  కూడా నాలాగే
శ్ర‌మ‌జీవులు,
మంచి దైవ‌భ‌క్తి
 క‌లిగిన‌వి. శివుని  ఆజ్ఞ‌లేక‌పోతే కుట్ట‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌వు.

``
త‌లా తోకా
 లేకుండా  మాట్లాడ‌కండి, మేమడిగింది రాయ‌ల‌సీమ గురించి?``

``కృష్ణ‌దేవ‌రాయ‌లు గురించా? ఆయ‌న తెలుగుకి వీరాభిమాని. చెరువులు త‌వ్వించిన‌వాడు.
విజ‌య‌న‌గ‌ర స్థాప‌న ఎలా జ‌రిగిందో తెలుసా? హ‌రిహ‌ర‌రాయులు, బుక్క‌రాయులు అనే అన్న‌ద‌మ్ములు క‌లిసి.....``

``మేము చ‌రిత్ర అడ‌గ‌లేదు సార్‌, వ‌ర్త‌మానం ఏంటి అని అడుగుతున్నాం``

``
గ‌తం వుంటే వ‌ర్త‌మానం
వుంటుంది. వ‌ర్త‌మాన‌ముంటే  భ‌విష్య‌త్ వుంటుంది. భావిత‌రాల కోసం అమ‌రావ‌తి
నిర్మిస్తున్నాం. ఈ రోజు వేసే ఒక్క అడుగు రేపు వెయ్యి అడుగుల‌వుతుంది, రేప‌టి వెయ్యి అడుగులు.....``

సార్, బట్ట
తలకు మోకాలికి లింకు పెడుతున్నారు.

``
బ‌ట్ట‌త‌ల వంశ‌సారంప‌ర్యం, ఒక ర‌కంగా వార‌స‌త్వం చైనా సాయంతో బట్ట‌త‌ల‌పై
జుత్తు మొలిపించే  క్లినిక్ లను   రాష్ట్ర‌మంతా పెడ‌తాం. ఇసుక‌లోంచి తైలం
తీయ‌గ‌లిగిన‌వాళ్ళు,
డూప్లికేట్‌కే
డూప్లికేట్  క్రియేట్  చేయ‌గ‌లిగిన చైనావాళ్ళు . బ‌ట్ట‌త‌ల‌పైనే కాదు, మోకాలు పైన కూడా జుత్తు మొలిపించ‌గ‌ల‌రు.

ఇక మోకాలు విష‌యానికి వ‌స్తే జ‌నం  ఎవ‌రి కాళ్ళ మీద వాళ్ళు నిల‌బ‌డ‌డానికి
 ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల ఈ ప్రాబ్ల‌మ్స్  ఎక్కువ‌వుతున్నాయి. నాలాగా
 ఇత‌రుల  భుజాల‌పై  ఎక్కి నిల‌బ‌డితే నో ప్రాబ్ల‌మ్‌, రాష్ట్రానికి  నేను  ఇవ్వ‌బోతున్న
మోకాలు చిప్ప‌లు అద‌నం.``

``సార్ మేమ‌డిగింది  రాయ‌ల‌సీమ
 గురించి,
అంటే అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల గురించి, ఆ జిల్లాల‌కు ఏం చేయ‌బోతున్నారు?``

``ఏం చేయ‌బోతున్నానంటే, ఆ జిల్లాల‌కు చాలా చేస్తాను, అనంత‌పురాన్ని  కొంద‌రు  అనంత‌పూర్
అని పిలుస్తారు. అలా  కాకుండా  యూనివ‌ర్స‌ల్ గా  ఒకే  పేరు
 వుండేలా  చూస్తా. దీనికి  భాషా  పండితుల్ని  సంప్ర‌దిస్తా
 క‌ర్నూల్‌లో నూలు అనే  ప‌దం వుంది. నూలు  అంటే  దార‌మ‌ని
 ఒక  అర్థం,
మాండ‌లికంలో
నువ్వుల‌ని ఇంకో అర్థ‌ముంది.  ఇందులో  ఏది  క‌రెక్టో ఒక క‌మిటీ
వేసి నిర్థారిస్తా,
ఇక  క‌డ‌ప‌లో
 మా పార్టీని  గెలిపించ‌లేదు  కాబ‌ట్టి దాన్ని  ఏం
 చేయాలో  ఇంకా  నిర్ణ‌యించ‌లేదు.  ఇక  చిత్తూరు మా
సొంతూరు  చంద్ర‌గిరిలో  న‌న్ను  ఓడించారు, ఎందుకు  ఓడించార‌నే  దానిపై
 ఒక క‌మిటీ,
నేనేమీ
 చేయ‌క‌పోయినా  తెలివి  త‌క్కువ‌గా  ఇన్నిసార్లు  కుప్పం
 ప్ర‌జ‌లు  ఎందుకు  గెలిపిస్తున్నార‌నే  దానిపై  ఇంకో
 క‌మిటీ  వేస్తాను.

``
అది కాదు సార్‌, మేమ‌డిగింది  ఈ  కాక‌మ్మ  క‌బుర్లు
 గురించికాదు.  అక్క‌డి  ప్ర‌జ‌ల‌కు  ఏం  చేస్తార‌ని? సాగునీరు  ఎలా  ఇస్తార‌ని?``

``
నీరు ప్ర‌కృతి
 ప్ర‌సాదితం ఇచ్చేదెవ‌రు?  పుచ్చుకునేదెవ‌రు?``

``
నిద్ర
పోయేవాన్ని  లేప‌చ్చుకానీ, న‌టించే  వాన్ని  లేప‌లేంసార్‌``

విలేక‌రుల‌కి  బాబు  మాట‌ల‌కి   అర్థ‌మై  వెళ్ళి
పోయారు.


Back to Top