వీల్లేదంతే !


బాబుకు బిపి పెరిగిపోతోంది. 
బాడీ టెంపరేచరే కాదు, పొలిటకల్ ఫీచర్ కూడా యమా హీటుగా ఉంది. 
పట్టపగలే జగన్ కల్లోకొస్తున్నాడు. పడుకుంటే విజయసాయి రెడ్డి అరుస్తున్నాడు. 
మోదీ ఏ నిమిషంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియకుండా ఉంది. 
రాజీలకు బేరసారాలు సాగుతున్నాయి..కానీ అవి ఫలిస్తాయోపుల్ల విరుస్తాయో తెలియదు..
పార్లమెంటు పేరు చెబితే వణుకొస్తోంది. మోదీ పేరెత్తితే మరుగుదొడ్డి గుర్తొస్తోంది. 
ఎవరైనా ఢిల్లీ అన్నారంటే దడ పుట్టుకొస్తోంది. 
బిజెపిని తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టి నందుకు, కేంద్రంలో మంత్రులను రాజీనామాలు చేయించినందుకు, మిత్రధర్మం పాటించకుండా తన తప్పులన్నీ వాళ్లమీద తోసేసినందుకు...
ఏదో కాళ్లా వేళ్లా పడి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుందామని ఓ పక్క తంటాలు పడుతుంటే...
సుజనాతో రాయబారాలు సాగిస్తుంటే...
హోదా గురించి నోరెత్త కుండా రాష్ట్రాన్ని ఏదోలా మడతేస్తానని కన్విన్స్ చేస్తానని మాటిస్తుంటే...
ప్యాకేజీ ఇస్తే చాలని పిటీషన్ పెడుతుంటే......
ఆ ప్రయత్నాలన్నిటినీ బూడిదలో పోసేస్తున్నారు....
ఏదో ఆ కచ్చ ప్రతిపక్షం వాళ్లు పదే పదే ప్రధానిని, కేంద్ర మంత్రులనూ కలుస్తున్నారు..నా మీద కుట్ర పన్నుతున్నారు అన్నానే అనుకో...ఆ మాత్రానికే  అంత సవాల్ గా తీసుకోవాలా?? 
కుట్రలకు, కుతంత్రాలకు పెట్టింది పేరు గనుక నాకేవో అనుమానాలొస్తాయి...ఆ మాత్రానికే వాటిని నిజం చేసేస్తారా?
నన్ను బోనులో నిలబెట్టేస్తారా? సిబిఐ ఎంక్వైరీ వేసేస్తారా???
నన్ను జైలుకు పంపందే నిద్దర పోమంటారా???
ఇలాగైతే నే ఒప్పుకోను....
 
Back to Top