అస‌లే నిప్పు... ఆపై కేసు

అన‌గ‌న‌గా కాదు, మ‌న‌మ‌ధ్యే ఒక రాజు. ఆయ‌న మాతృభాష ఏమిటో ఎవ‌రికీ స‌రిగా తెలీదు. ఉన్మాద భాష అంటారు కానీ అది ఆయ‌న ఉన్మాదం వ‌ల్ల వ‌చ్చిన పేరో లేక ఆయ‌న మాతృభాష‌కు ఆ పేరుందో స్ప‌ష్టంగా చెప్పే భాష‌శాస్త్ర‌వేత్త‌లు క‌రువ‌య్యారు. త‌ర‌చుగా ప‌త్రికా స‌మావేశాల్లో ఉన్మాదంతో ఊగిపోతే ఎదుటి వారిని ఉన్మాదులుగా ముద్ర వేస్తూ ఉంటారు.

      భ‌ళీభ‌ళీ మీరు ఇంద్రుడు, చంద్రుడు, మీ పాల‌న అహో అంతఇంత అంటూ సామాజిక స‌మీక‌ర‌ణ‌ల మీడియా పొగిడినంత సేపు రాజు ఆనంద తాండ‌వం చేస్తాడు. 2050 నాటికి ప్ర‌పంచం అంత‌మైనా మ‌న‌మూ, మ‌న రాజ‌ధాని నిలిచి వెలుగుతూ ఉంటుందని సింగ‌పూర్ భాష‌లో జ‌పాన్ క‌ల‌లు కంటూ చైనా గాలిలో మేడ‌లు ఆయ‌న క‌డ‌తాడు. దానికి ప్ర‌చారం, ఆర్భాటం తానా తందాన కంపెనీలు చేసి పెడ‌తాయి. దేవ‌తా వ‌స్త్రం క‌థ‌లా న‌గ్న‌స్వ‌రూపం న‌లుగురికీ క‌న‌బ‌డుతూ ఉంటుంది. కానీ ఎవ‌రూ నిజం చెప్పరు. రాజు గారికి నిజం రుచించ‌దు కాబ‌ట్టి అబ‌ద్దాల‌ను వండి వార్చే నిపుణులు 24 గంట‌లూ ఆ ప‌ని మీదే ఉంటారు. 

        ప్ర‌జాస్వామ్యం మీద ప్ర‌మాణం, విలువ‌లు, నైతిక‌త‌, మ‌ర్యాద‌, గౌర‌వం, ఆద‌ర్శం, హుందాత‌నం లాంటి  అంశాలు, ప‌దాలు మ‌న రాజు నిఘంటువులోనే లేవు. ప్ర‌శ్న అడిగిన వాడిమీద నిప్పులు చెర‌గ‌డం, కారాలు మిరియాలు నూర‌డం, క‌ళ్లేగరేయ‌డం, వేలుపెట్టి ఖ‌బ‌డ్దార్ అన‌డం, నిలువెల్లా ఊగిపోతూ ఉన్మాదం ఉన్మాదం అంటూ రంకెలు వేయ‌డం, ప‌త్రికా స్వేచ్ఛ‌కు ప‌బ్లిక్‌గా కొరివి పెట్ట‌డం మ‌న రాజు ప్ర‌త్యేకత‌. అస‌లే నిప్పు - ఆపై కేసు గొంతులో వెల‌క్కాయ‌. ఇక భాష ఉన్మాదం కాకుండా ఎలా ఉంటుంది? ఆయ‌న్ను అలా వ‌దిలేయ‌కండ్రా. రాజవైద్యుడికి చూపించండ్రా.

తాజా వీడియోలు

Back to Top