అందుకోండి వీర‌తాడు

పార్టీలో బాగా ప‌ని చేసిన‌వాళ్ల‌కు ర్యాంకులు, బిరుదులు ఇవ్వాల‌ని నిశ్చ‌యించాడు చంద్ర‌బాబు.
చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ని వేదిక‌పైకి పిలిచారు
"ప్ర‌జాసేవ అంటేనే అధికారం. అధికారుల‌ని బెదిరించ‌డ‌మే ప్ర‌జాసేవ అని నిరూపించిన నేర‌శీలి ప్ర‌భాక‌ర్‌. ఈ రోజుల్లో మాట‌ల‌తో ఎవ‌డూ విన‌డు. బెదిరిస్తేనే ప‌ని జ‌రుగుతుంది. ఈయ‌న సేవ‌ల్ని గుర్తించి బెదిరింపుర‌త్న అని బిరుదు ఇస్తున్నా, ఇప్ప‌టి వ‌ర‌కు బెదిరింపుల్లో ఈయ‌న‌దే ఫ‌స్ట్ ర్యాంక్‌. మిగిలిన వాళ్లు ఈ ర్యాంక్‌ని అందుకోడానికి ప్ర‌య‌త్నించాలి" అన్నాడు బాబు.
చింత‌మ‌నేని ఆ బిరుదుని అందుకుని వేదిక‌పైన విసిరికొట్టాడు. 
"నేను చేసిన సేవ‌ల‌కి క‌నీసం బెదిరింపు వ‌జ్ర‌ర‌త్న‌ముత్యం అని బిరుదు ఇవ్వాలి. ఇంత చిన్న బిరుదుని నేను తీసుకోను" అని బెదిరింపుల‌కి దిగాడు.
"బెదిరింపుల్లో నేను పిస్తాబంగ‌దుర్‌ని. ఎన్టీఆర్ నుంచే అధికారం లాక్కున్న‌వాడ్ని. ఒక‌సారి మేక‌ప్ తీసేస్తే నీకంటే పెద్ద‌రౌడీని తెలుసా?  నీలాంటి వాడికి ఎరికోరి టికెట్లు ఇచ్చానంటే నేను మాములోన్ని కాదు" అని ఎదురు బెదిరింపుల‌కి దిగాడు చంద్ర‌బాబు.
చింత‌మ‌నేని చింతాకైంతుడై వేదిక దిగాడు
రేవంత్‌రెడ్డిని వేదిక‌పైకి పిలిచాడు. 
రేవంత్ సంతోషంగా వ‌చ్చి "తెలంగాణ అసెంబ్లీపై ప‌చ్చ‌జెండా ఎగుర‌వేస్తే, ప‌చ్చ‌జెండా ఎన్నియ‌ల్లో" అని పాట అందుకున్నాడు. 
వెంట‌నే ఒక డాక్ట‌ర్ వ‌చ్చి ఆయ‌న నాడీని ప‌రిశీలించి "ఈయ‌న‌కి గ‌త రెండేళ్లుగా ప‌చ్చ‌కామెర్లు. ఏది చూసినా ప‌సుపు ప‌సుపు అని అరుస్తాడు. ఇంట్లో వంట‌ల్లోకి కారంపోడికి బ‌దులు ప‌సుపుపొడి వేయ‌మంటున్నాడ‌ని వాళ్లావిడ కంప్ల‌యింట్ చేసింది" అని చెప్పాడు. 
రేవంత్‌రెడ్డి వెంట‌నే "ప‌చ్చ‌బొట్టేసినా" అని పాట మొద‌లుపెట్టాడు. 
"ఈయ‌న‌కి పాటరాదు. ఎమ్మెల్యేల వేలం పాట రాదు" అని బాబు కొప‌డ్డాడు. 
"వాస్త‌వానికి ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కార్య‌క్ర‌మ‌మే అయినా అన‌వ‌స‌రంగా రేవంత్ దూరాడు. ఈయ‌న‌కి రాంగ్ క‌మ్యునికేష‌న్స్ ర‌త్న అని బిరుదునిస్తున్నాను. ఈయ‌న ఫొన్ల‌లో మాట్లాడి దొరికిపోవ‌డం వ‌ల్లే మ‌నం అల‌ర్టయ్యాం. ఆ త‌రువాత ఎన్ని బేర‌సారాలు చేసినా దొర‌క్క పోవడానికి ఈయ‌న నేర్పిన గుణ‌పాఠ‌మే. పాఠాలు నేర్పిన‌వాళ్ల‌ని మ‌ర‌చిపోయినా త‌ప్పులేదు గానీ గుణ‌పాఠాలు నేర్పిన‌వాళ్ల‌ని మ‌ర‌చిపోకూడ‌దు. 
ఆ త‌రువాత క‌ర‌ణం బ‌ల‌రాం, గొట్టిపాటి ర‌వికుమార్‌ని వేదిక‌పైకి పిలిచాడు. 
"చీటింగ్‌, ఫైడింగ్ లేకుంటే రాజకీయాలు లేవు. క‌ర్త‌వ్య‌ములో వీళ్లు ఎక్స్‌ప‌ర్ట్‌లు. వీళ్ల‌కి ఫైటింగ్ ర‌త్న అని బిరుదునిస్తున్నాం" అన్నాడు బాబు
మంత్రి నారాయ‌ణ‌ని వేదిక‌పైకి పిలిచి "వ్యాపారంలో విద్య లేక‌పోయినా ప‌ర్లేదు. విద్య‌ని వ్యాపారం చేయ‌డం మాత్రం అత్య‌వ‌స‌రం. ఈ రాష్ట్రంలో ప్ర‌తి ప‌ట్ట‌ణాన్ని చైత‌న్యం చేసి విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ని పాప‌ర్ ప‌ట్టించిన ఈయ‌న సూప‌ర్‌. అందుకే ఈయ‌న‌కి ఫీజుల‌ర‌త్న అని బిరుదుని అందిస్తున్నాం" అన్నాడు.
మంత్రి రావెల‌ని పిలిచి "కొడుకు త‌ప్పుచేసినా కాపాడడం తండ్రి బాధ్య‌త‌. కొడుకు వీడియోలో అడ్డంగా దొరికిపోయినా నా కొడుకు మంచివాడు అని స‌ర్టిఫికేట్ ఇచ్చిన ఈయ‌న" మంత్రిగా వుండ‌ద‌గిన‌వాడు. అందుకే ఈయ‌న‌కి దృత‌రాష్ట్ర స‌మాన అని బిరుదుని అందిస్తున్నాం అన్నాడు బాబు.
ఆ త‌రువాత మంత్రులంద‌రూ వేదిక‌పైకి వ‌చ్చి 
"రెండేళ్లుగా ఏమీ చేయ‌కుండా అర‌చేతిలో వైకుంఠం చూపిన చంద్ర‌బాబుకి ఉత్తుత్తి ర‌త్న అని బిరుదునిస్తున్నాం" అన్నారు.
దీనికి చంద్ర‌బాబు ఒప్పుకోలేదు. "గ‌తంలో నేను పాలించినా తొమ్మిదేళ్లు కూడా ఏమీ చేయ‌లేదు. కాబ‌ట్టి నాకు ఉత్తుత్తి మంత్రి ర‌త్న అని టేబుల్ బిరుదును ఇవ్వాలి" అన్నాడు.
గ‌త్యంత‌రం లేక ఆయ‌న కోరిన బిరుదుని ఇచ్చారు. 
Back to Top