నాయుడికి తగ్గ సేవకుడు


రాజకీయ భ్రష్టత్వానికి ఉదాహరణ ఓటుకు నోటు కేసైతే, దానికి పరాకాష్ట రేవంతిరెడ్డి దగ్గర బైటపడ్డ వేల కోట్లు.  సంచుల్లోపెట్టి నేతలను కొనడానికి వాడిన సొమ్ము ఈ కోట్లలోదో మరే కోటలోదో ఇంకా తేలలేదు. బాబుగారి వీర విధేయ రేవంతుడే 1000కోట్లాధీశుడైతే, మరి బాబుగారేపాటివారో లెక్కించడానికి కేలిక్లేటర్ సరిపోదేమో?? బాబు గారి శిష్యుడి వద్దే ఇన్ని మూటలు మూలుగుతుంటే బాబుగారి ఖజానా ఏవిధంగా ఉందో అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. పండిపోయిన తల చూపించి, ఎండిపోయిన గడ్డం చూపించి, అనుభవం అంతా నా సొత్తు అంటూ కులమీడియాతో కూతలు కూయించాడు. రాష్ట్రానికి నేను తప్ప లేదు దిక్కులేదంటూ ప్రచారం చేయించాడు. ఆయనొస్తున్నాడంటూ డప్పుదరువులేయించాడు. చివరికి కాలికింద నేలనుంచి, గగనంలో గమనం దాకా అన్నింటా దోపిడి రాజ్యాన్ని స్థాపించాడు. దేవుళ్లను దోచేసి, పింక్ డైమండ్ ను కాజేసి, ప్రతిపక్ష నేతలను అడ్డగోలుగా కొనేసి, అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించేసిన చంద్రబాబుపై దర్యాప్తు సంస్థలు కన్నెత్తైనా చూడకపోవడం వెనుక ఉన్న హస్తాలేవో? కాపుగాస్తున్న కమల ఛత్రాలేవో??? 
 
Back to Top