నారా డబ్బా నాయుడు అండ్ కో

చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు
ప్రపంచమంతా మన రాష్ట్రాన్ని గర్విస్తున్నారు. ఈ మధ్య దావోస్ వెళితే అక్కడ నన్నుచాలామంది గుర్తుపట్టి ఇండియా అంటే ఏపీనే అన్నారు. ప్రపంచంలో ఇప్పుడు హోమియోపతి కంటే అమరావతి ఫేమస్ అన్నాడు బాబు
దావోస్ లో మిమ్మల్ని జనం గుర్తుపట్టడం వల్ల రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం? అడిగాడు ఓ విలేకరి
గుర్తుపట్టడం అంటే మనకి గుర్తింపు వుందని అర్థం. ఎన్నికల్లో గుర్తులెందుకిస్తారు. గుర్తు పట్టడానికే కదా
తలాతోక లేకుండా మాట్లాడ్డంలో మీరు ఆరితేరిపోయారు
ఇంతలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి వచ్చి మన చంద్రబాబు ఎంత హార్డ్ వర్కరంటే రోజుకి 36 గంటలు పనిచేస్తాడు అన్నాడు
రోజుకి 24 గంటలే కదా మిగిలిన 12 గంటలు ఎక్కన్నుంచి వస్తాయి అని అడిగారు విలేకరులు
అంటే మామూలు మనుషులు గంటలో చేసే పనిని మన బాబు అరగంటలో చేస్తాడు. అందువల్ల ఆయనకి రోజుకి 48 గంటలన్నమాట. ఈ లెక్కన ఇంకా 12 గంటలు మిగులున్నమాట అన్నాడు పల్లె.
మీ మ్యాథ్స్ టీచర్ ఎవరు సార్? అని పల్లెని అడిగారు విలేకరులు
గురువుల్ని గుర్తుపెట్టుకోకూడదని చంద్రబాబు చెప్పాడు. అందుకే ఆయన రాజగోపాలనాయుడిని, అంజయ్యని, ఎన్టీఆర్ ని మంచిపోయిండు అన్నాడు పల్లె
36 గంటల పని ఆయన ఏం చేస్తున్నారు సార్?
నాలుగు గంటలు ప్రతిపక్షాల్ని తిడతాడు. పది గంటలు విమానంలో తిరుగుతాడు
ఆరుగంటలు అమరావతి గురించి ఆలోచిస్తారు. రైతుల భూములు లాక్కోవడానికి 6 గంటలు ప్రణాళిక రచిస్తారు. మిగిలిన పది గంటలు మోదీని పొగుడుతారు అని చెప్పాడు పల్లె
అదేంటి మీ బాబుగారు నిద్రపోరా?
ఆయన నిద్రపోడు, పోనివ్వరు
అదే నా స్పెషాలిటీ. రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకి తీసుకుపోవాలా అని ఆలోచిస్తూ నేను నిద్ర కూడా మరిచిపోయాను. అందుకే ప్రజలంతా నా గురించి ప్రార్థనలు చేయాలి అన్నాడు చంద్రబాబు కల్పించుకుంటూ
ప్రజలు ఆల్రెడీ ప్రార్థనలు చేస్తున్నారు. తమరు తొందరగా దిగిపోవాలని అన్నారు విలేకరులు
నేను దిగిపోతే అరాచక శక్తులొచ్చి రాష్ట్రాన్ని తగలబెట్టేస్తాయి
ఆల్రెడీ మీరు తగలబెట్టేసారు. ఇంతకూ ప్రత్యేకహోదా ఏమైంది అడిగారు విలేకరులు
హోదా గురించి మన బాలయ్య బాబు మాట్లాడతాడు అన్నాడు బాబు
బాలకృష్ణ శాతకర్ణిలా మీసాలు తిప్పుకుంటూవచ్చి హోదా అంటే ప్రత్యేకం. ప్రత్యేకహోదా అంటే రావచ్చు. వస్తే ఏంటి, పోతే ఏంటి ఆలోచించుకోవాలి
స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేకహోదా కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంతో చర్చించి ప్రజలతో ముఖాముఖి...
భరించలేక విలేకరులు పారిపోయారు.

Back to Top