చెనక్కాయలు - చెప్పుదెబ్బలు

నంద్యాల ఉప ఎన్నికలు చూస్తుంటే నాకు చిన్ననాటి సంగతోటి గుర్తొస్తోంది. చిన్నప్పుడు బళ్లో నాకో ఫ్రెండుండేవాడు. అందరం వాణ్ణి ముద్దుగా నాచూ అని పిలిచేవాళ్లం. ఎందుకంటే తోటలో జామకాయలు దొంగతనంగా కోసి జర్రున జారుకునేవాడు. హోమ్ వర్క్ చేయలేదని మాస్టారు కొట్టబోతే కళ్లనీళ్లు పెట్టేసుకుని దెబ్బలు తప్పించుకుని జంపయ్యి పోయేవాడు. ఫ్రెండ్సందరి దగ్గరున్న బిళ్లలు, చెగోడీలు తెగ తినేసి, వాడి జేబులోని చెనక్కాయలు వాసన దొరక్కుండా జారిపోయేవాడు. అట్టాంటోడు ఓ రోజు నా దగ్గరకొచ్చాడు. ఒక చేతిలో చెనిగుండలు, ఓ చేతిలో చక్కిలాలు పట్టుకొనొచ్చాడు. చేతులు పట్టరా అంటూ నా దోసిట్లో పోసేసాడు. ఇవి తినేయరా, తినేలోపు ఈతకాయలు తెంపుకొస్తా అన్నాడు. కాలంగాని కాలంలో ఈతపళ్లెట్లా తెస్తావురా అన్నా నేను. కంగారు పడ్డాడు నాచు. ఎలాగో తెస్తాలే గాని. నువు నాకో సాయం చేయాల్రా అన్నాడు. అద్గదీ అలా చెప్పు అన్నా నేను. అరచి గీ పెట్టినా సొంత అన్నకే అణా పైసా ఇవ్వని వీడు నాకెందుకు ఇన్ని తెచ్చిస్తున్నాడని అప్పుడే అనుమానం వచ్చింది. ఏం లేద్రా రేపు పరీక్షలు కదా…నేను పదిరోజులుగా జ్వరం వచ్చి ఏం చదవలేదు. రేపు కొంచెం నీ పేపర్ నాకు చూపించాలి అన్నాడు పారపళ్లు బైట పెట్టి నవ్వుతూ. నాకు ఒళ్లు మండింది. మూడు నెలల నుండి కష్టపడి పరీక్షల కోసం నే చదువుకుంటే, వీడికేమో పేపర్ చూపించాలంట. పళ్లు పటపటా కొరికాను. ఏరా చక్కిలాలు బాలేదా అన్నాడు నా పళ్ల వంక చూసి. బాగోకేం బ్రహ్మాండం అన్నాను. మరైతే పరీక్షల్లో చూపిస్తున్నట్టేగా ఒట్టేయించుకున్నట్టే అడిగాడు. అట్టే అట్టే అన్నాను నేను. దొంగ నాయాలు చూపిచ్చనంటే చేతిలో పెట్టినవి, నోట్టో పెట్టు కున్నవి కూడా లాక్కుపోయే రకం నాకు తెలీదా. అందుకే సరే అని బుర్ర ఊపా నేను. హుషారుగా ఈలేసుకుంటూ వెళ్లిపోయాడు పాపం బాబు. 
మర్నాడు పరీక్ష టైమ్ లో నా వెనకే కూర్చుని దిక్కులు చూడ్డం మొదలెట్టాడు. రేయ్ చూపించరా అన్నాడు కొద్ది సేపాగి. ఉండ్రా నేను అన్నీ రాసాక అన్నాను తల వెనక్కి తిప్పకుండా. దాంతో దర్జాగా కాలు మీద కాలేసుకుని, పెన్ను జేబులో ఏసుకుని తాపీగా కూర్చున్నాడు నాచుగాడు. పరీక్ష అయిపోడానికి ఇంకా పదినిమిషాలే ఉంది. ఏదిరా ఇవ్వరా అన్నాడు నాచు కంగారుగా టైమ్ చూసుకుని. ఇదిగో అని పేపరు చేతిలో పెట్టి నేను లేచి వెళ్లిపోయాను. అది చూసి వాడి ముఖం ఏ రంగులోకి మారుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేనిచ్చింది క్వశ్చన్ పేపర్. ఏడవలేక, అరవలేక నోరుమూసుకుని కూర్చున్నాడు నాచుగాడు పరీక్ష టైమ్ అయ్యేవరకూ. గంట ఇలా కొట్టారో లేదో పరిగెత్తుకుంటూ వచ్చి నా చొక్కా పట్టుకున్నాడు. ఏరా నీకు ఎన్ని పెట్టాను. ఇంకా ఎన్ని పెడతానన్నాను. అన్నీ తీసుకుని నన్నే మోసం చేస్తావా. దొంగ… అని ఓ తిట్టు తిట్టాడు. నా చొక్కా పట్టుకున్న వాడి చేయిని విసిరి కొట్టాను నేను. పోరా నీ బుద్ధులు నాకు తెలియవా. జ్వరం గిరం అని వెధవ అబధ్దాలు నువ్వూనూ. రోజూ బడి ఎగ్గొట్టి ఆ పొలాల వెంట, ఈ తోటల వెంట పడి మేస్తూ నువు తిరిగేది నాకు తెలీదనుకున్నావా. రోజూ మేం తెచ్చిన తిండంతా బొక్కడమే గాని, ఎవడికైనా, ఎప్పుడైనా ఒక్క పావలాతో జీడీలు కొనిపెట్టావా. ఫ్రెండ్సందరం కలిసి వెళ్తుంటే ఒక్కరోజన్నా మాతో వచ్చావా. ఇవాళ  వచ్చి నువు నాటకం ఆడితే నాకు తెలీదనుకుంటున్నావా. పోరా. రేపు రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది నా తడాఖా ఏంటో అని వెళ్లిపోయా నేను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాలనిపించిందంటే మన నంద్యాల ఉప ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుగోర్ని చూస్తుంటే నాకు మా చిన్నప్పటి నాచు గాడే గుర్తొస్తున్నాడు మరి. 

పొద్దు తిరుగుడు తల తిరుగుడు
పచ్చపార్టీ ఎప్పుడూ పొద్దుతిరిగుడు పువ్వు లాగే పని చేస్తుంది.  ఏ ఎండకాదిక్కు తిరుగుతా ఉంటది. పక్కింటి పార్టీలో మాంచి లీడర్ ఉన్నాడంటే పార్టీ చూపు చుర్రున అటు తిరుగుతాది. నయానో, భయానో, పదవి లాంటి లాలిపప్పునో పెట్టి తన పక్కకి లాగేసుకుంటది. అట్టాగే ప్రజలనేవాళ్లంతా ఓటర్లు అయిపోయే టైమ్ ఒకటుంటది. అదే ఎలక్షన్ల టైమ్. ఆ టైమ్లో ఈ పచ్చపువ్వైతే ఎండలో పెళపెళా నవ్వుతూ సూరీడిచుట్టూ చక్కర్లు కొడతుంది. ఏం లాభం పొద్దు గూకి పోతుంది. పచ్చపువ్వు తల నేల వాలిపోతుంది. రాబోయే నంద్యాల ఎలక్షన్లో పచ్చపార్టీకి కూడా అదే గతి పట్టబోతోంది అంటున్నారు ప్రజలు. వేలకోట్ల రూపాయలు మాటల్తో కుమ్మరించేస్తే, కళ్లు తేలేయడానికి మేం పదవులకు ఆశపడి పార్టీమారే నాయకులం కాము అని తెగేసి చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి సగర్వంగా వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి, పేదవాడికోసం పాటుపడే జగన్ మోహన్ రెడ్డి ఉండగా మరో నాయకుడు మాకు అక్కర్లేదు అని తెలియజేస్తున్నారు. పచ్చ చొక్కాల నేతలంతా కట్టకట్టుకుని వచ్చి నంద్యాలలో వాలినా, వరాలు, శిలాఫలకాలతో వైకుంఠమాయ చూపించినా తెలుసుకోలేని స్థితిలో లేరు నంద్యాల ప్రజలు. ఎస్సీలు, మైనారిటీల మధ్య చిచ్చు పెట్టాలని చూసే వారికి తగిన గుణపాఠం నేర్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఓటుకు ఐదు వేలు ఇవ్వడానికి కూడా వెనుకాడని అధికార పార్టీ, ప్రజలకోసం త్యాగాలకు, ఉద్యమాలకు వెనుదీయని ప్రతిపక్ష వైయస్సార్సీపీ రెంటిలో దేన్ని ఎంచుకోవాలో నంద్యాల నియోజకవర్గం ఎప్పుడో తేల్చేసుకుంది. అందుకే టిడిపి సభల్లో అరకొర జనం కనబడ్డారు. ఆ వచ్చిన వారు కూడా ముఖ్యమంత్రిని, ఆయన పుత్రరత్నాన్ని నిలువునా ప్రశ్నలతో ముంచెత్తేందుకే వచ్చారు. ఇన్నాళ్లు ఈ ఊరిలో కాలెందుకు పెట్టలేదో కనుక్కుని, ఎడాపెడా కడిగేద్దామని వచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top