నారా ఫ్యామిలీ నిబంధనలన్నీ బలి

నారావారి ఫ్యామిలీ ముందు అధికారిక నియమాలు, నిబంధనలూ అన్నీ బలి . నిన్న స్వాతంత్య్రదినోత్సవం రోజు ఇంటిపైనే జెండా ఎగరేసి, భార్యా కుమారుడితో కలిసి అధికారిక సైనికవందనం అందుకున్నాడు నారా లోకేష్. ఇందేం ఉంది అమెరికాలోనే టిడిపి జెండా ఎగరేస్తా అన్నాడు ఒకప్పుడు. అవసరమైతే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా అని కూడా అనగల ఘనుడు. తండ్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఒలంపిక్స్ పెట్టిస్తా, బాగా ఆడి పతకాలు తెస్తే నోబెల్ ఇప్పిస్తా అన్నట్టు, దేశభక్తిగేయాలు పాడితే పరమవీర చక్ర ఇస్తా అని కూడా చెప్పగలడు. 

గణతంత్రదినోత్సవానికి గైర్హాజరైన ఒకేఒక్కడు మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయన బదులుగా ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడితో కలిసి జెండా ఎగరేసేసారు. జెండా ఎగరేసినప్పుడు చప్పట్లు కొట్టకూడదనే జ్ఞానం లేని అధికారులంతా అక్కడ అరచేతులతో భజనలు చేసారు. ఇక ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఆయన బావమరిది బాలయ్య కోట్ల రూపాయల పనులకు సంబంధించి సమీక్షలు జరిపేస్తాడు. ప్రొటోకాల్ లాంటివేవీ నారా ఫ్యామిలీకి ఉండవ్. 

ప్రజాస్వామ్యంలో రాచరికాన్ని మించి సాగుతున్నఈ నారాఫ్యామిలీ ప్రొటోకాల్ ఉల్లంఘనల గురించి ఎల్లో మీడియా ఒక్కమాటా మట్లాడదు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం సచివాలయానికి రాని జగన్ మాత్రం క్విడ్ ప్రోకో చేశాడంటూ పుంఖానుపుంఖాలు రాసిపారేసి, వాటిపై టివిల్లో గంటల పాటు చర్చలు నడిపేస్తుంది. సిబిఐ లిస్టులేని వైఎస్ భారతి పేరు ఇడి లిస్టులోకి రావడాన్ని ఇంతింత అక్షరాలతో ప్రచురించి పాశవిక ఆనందం పొందుతుంది. అసలు ఎన్నికలనే అపహాస్యం చేసి, 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి నియమాలూ నిబంధనలూ కూడానా అనుకుంటున్నారా...అదీ నిజమేలెండి... 


 

తాజా ఫోటోలు

Back to Top