ముంద‌స్తు వ‌స్తే బాబుకు బ్యాండే...


తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ముంద‌స్తుకు రెడీ అయిపోయాడు. 
ఢిల్లీ వెళ్లి వ్య‌వ‌హారం తేల్చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు...
ఎన్నిక‌ల‌కు ఎప్పుడైనా మేం రెడీనే అని చెప్పేశాడు...
మ‌రి చంద్ర‌బాబు కొన్నాళ్ల క్రితం...
ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ధం అన్నాడు...
త‌ర్వాత మాట మార్చి ప్ర‌జ‌ల‌కు మా పై న‌మ్మ‌కం ఉంది అని త‌ప్పించుకున్నాడు...
ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచే ఎపి తెలంగాణాల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.
పైకి బాబుగారు బికంగా సిద్ధ‌మ‌ని చెప్పినా...
లోలోప‌ల  భ‌యంతో వ‌ణికిపోయాడు.
ఎప్పుడు కేంద్రం ముంద‌స్తుకు రెడీ కమ్మంటుందో అని క్ష‌ణ క్ష‌ణం భ‌యం భ‌యంగా గ‌డిపాడు...
ఇప్పుడు ఆల్ మోస్ట్ తెర తొలిగిన‌ట్టే అయ్యింది. 
కెసిఆర్ సెప్టెంబ‌ర్ లో అసెంబ్లీ ర‌ద్దు చేస్తాడ‌ని అంటుడటంతో, ఇప్పుడు బాల్ బాబు గారి కోర్టుకొచ్చింది.
ద‌మ్ముంటే కెసిఆర్ లా చంద్ర‌బాబు కూడా ముంద‌స్తుకు రెడీ కావాలని అంటున్నారు..
తెలంగాణా, ఎపితో మ‌రో నాలుగు రాష్ట్రాల‌కూ ఎన్నిక‌లు ఉండొచ్చ‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతోంది.
ఒక్క ఎపి త‌ప్ప మిగిలిన రాష్ట్రాల‌న్నీ ముంద‌స్తు రెడీనే అంటున్నాయి.
బాబు ముంద‌స్తు ఎన్నిక‌లు స‌సేమిరా వ‌ద్దంటూ కేంద్రానికి రాయ‌బారాలు పంపుతున్నాడు.
ఇచ్చిన హామీల్లో ఏవీ నెర‌వేర్చ‌క‌పోవ‌డం, భారీ అవినీతి, తెలుగు త‌మ్ముళ్ల అరాచ‌కాలు, జ‌న్మ‌భూమి క‌మిటీల జులుం, నేటికీ ప‌డ‌గ విప్పుతున్న కాల్ నాగులు, పోల‌వ‌రం, ప‌ట్టిసీమ‌ల్లో భారీ అవినీతి, కుల విద్వేషం...
బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలు...
ప్ర‌తిప‌క్షం వేగంగా ప్ర‌జ‌ల్లో ముందుకుపోతుండ‌టం, వైఎస్ జ‌గ‌న్ కు వ‌స్తున్న విప‌రీత ప్ర‌జాద‌ర‌ణ చూస్తే బాబుకు త‌న భ‌విష్య‌త్ ఏంటో క‌న్ఫ‌ర్మ్ గా తెలిసిపోయింది. 
ఎప్ప‌టిలాగే ఎన్నిక‌ల ముందు జిమ్మిక్కుల‌కు ట్రిక్కుల‌కు త‌గిన స‌మ‌యం లేక‌పోతే రాబోయే ఎన్నిక‌లు ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మే.
అందుకే ముంద‌స్తు పేరెత్తితే బాబుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.
ఓ ప‌క్క కాంగ్రెస్ తో పొత్తుల విష‌యం ఖ‌రారు చేసుకోవ‌డం, తెలంగాణాలో సీట్లు ఇచ్చిపుచ్చుకోవ‌డం, ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మోసం చేసేందుకు కొత్త హామీలు వెతుక్కోవ‌డానికి చంద్ర‌బాబుకు ఎంతైనా స‌మ‌యం కావాలి. 
అందుకే ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జ‌ల్లో త‌న బ‌ల నిరూప‌ణ‌కు బాబు సిద్ధంగా లేడు.
జాతీయ పార్టీ పంచ‌న చేరి, ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మ‌భ్య‌పెట్టి, జాతి మీడియాను విచ్చ‌ల‌విడిగా వాడుకుని, కుల నాయ‌కుల‌కు తాయిలాలు పంచి, ప్యాకేజీలు పెంచి త‌న‌కున్న ఏకైక ప్ర‌త్య‌ర్థిని గెల‌వాల‌ని అనుకుంటున్నాడు చంద్ర‌బాబు...
ఎనీ సెంట‌ర్, ఎనీ టైమ్, సింగిల్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్...పొత్తులు లేకుండా సింగిల్ గా పోటీ చేస్తుంటే...
బాబు మాత్రం ప్ర‌తిప‌క్షాన్ని ఎదుర్కోడానికి నూటొక్క ఆయుధాల‌ను వెతుక్కుంటున్నాడు.
ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌క్కా అయిపోయేలా ఉంటే బాబు ఉరుకులు ప‌రుగుల మీద చేసే ప‌నేమంటే...
ప్రెస్ మీట్ పెట్టి బిజెపి వైఎస్సార్ కాంగ్రెస్ క‌లిసి రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లకు కార‌ణం అయ్యార‌ని క‌న్నీళ్లు కార్చ‌డం.  
Back to Top