అమరావతి నిర్మాణంపై మాస్టర్ ప్లాన్‌ని చంద్రబాబు విలేకరులకు వివరించాడు`` మీ కంతా తెలుసు, నేను ఏ విధంగా ముందుకు పోతున్నానో ఒక రోజు ఇక్కడుంటే నాలుగురోజులు సింగపూర్‌లో వుంటున్నా... ఎక్కే విమానం దిగే విమానం ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోడానికి జనం డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు, మనకు కాపిటల్ కావాలి. కాపిటల్ కావాలంటే పెట్టుబడి కావాలి. రాబడి లేనపుడు పెట్టుబడి ఎలా వస్తుంది. అందుకే హోల్‌సేల్‌గా అమరావతిని సింగపూర్‌కి అమ్మేస్తా. వాళ్ళు ఇసుకలోంచి తైలం తీస్తారు. అందుకే ఇసుక కూడా సింగపూర్ నుంచే వస్తుంది. మన తెలుగు ఇసుక పనికిరాదు. ఉన్న ఇసుకంతా తెలుగు తమ్ముళ్ళు దోచేశారు. అడ్డొస్తే అధికారుల్ని కూడా తంతున్నారు. అయినా అధికారంలోకి వచ్చింది దోపిడీ చేయడానికి కాకపోతే ప్రజలకి సేవ చేయడానికా? చెప్పేదేమిటంటే అమరావతిలో అన్ని హంగులూ వుంటాయి. పెద్దపెద్ద మాల్స్ వుంటాయి. నీరు నుంచి కారు వరకూ ఏదైనా దొరుకుతుంది. క్లబ్బుల్లో రిలాక్స్ కావచ్చు. పబ్బుల్లో మందు తాగొచ్చు. గతంలో మద్యనిషేదాన్ని ఎత్తేసి ప్రజల్ని మత్తులో ముంచిన చరిత్ర మా పార్టీకుంది. ప్రజలెంత మత్తులో వుంటే ప్రభుత్వానికి అంత సేఫ్. అన్ని రకాల అభివృద్ధిని సింగపూర్ సంస్థే చేస్తుంది. రోడ్లేసి టోల్‌గేట్ వసూలు చేసి ప్రజల తోలు వలుస్తుంది. బిల్డింగులు కట్టి అద్దెలు వసూలు చేసుకుంటుంది. టూరిజం డెవలప్ చేసి వచ్చే డబ్బుల్ని జేబులోకి వేసేసుకుంటుంది. ఇలాంటి రాజధానిని గతంలో ఎవరూ చూసేవుండరు.....`` `` అసలు మేం బతికుండగా చూస్తామా?`` అడిగాడో విలేకరి బాబు మాటలకి అడ్డుతగిలి. `` అరచేతిలో స్వర్గం చూపించినపుడు స్వర్గాన్నే చూడాలి కానీ అరచేతిని కాదు`` అన్నాడు బాబు `` ఈ రాజధాని వల్ల ప్రజలకు ఏంటి మేలు?`` అడిగాడో విలేకరి.`` సింగపూర్ కట్టడాల్ని చూస్తే ప్రజలకి ఆకలేయదు, దప్పికుండదు. మాల్స్‌లో ఎస్కలేటర్లపై వెళుతుంటే ఆకాశానికి నిచ్చెనేసి ఎక్కుతున్నట్టే వుంటుంది. మల్టిప్లక్స్‌ల్లో సినిమాలు చూస్తే నా సామిరంగా ఆ థ్రిల్లేవేరు```` అది సరే, అవన్నీ చూడాలంటే జనం దగ్గర డబ్బులుండాలి కదా```` డబ్బుల్లే కనే కదా సింగపూర్‌కి అమరావతిని అమ్ముతున్నా అయినా కష్టపడి పనిచేస్తే డబ్బులొస్తాయి.```` ఏం పని చేయాలి. వున్న భూముల్ని మీరు లాక్కుంటున్నారు. రాజదాని అని మొత్తుకోకపోతే కొత్తగా పది పరిశ్రమలు తెస్తే జనం బాగుపడతారు కదా`` `` పరిశ్రమలు తెస్తే శ్రమే మిగులుతుంది. బిల్డింగులు కదితే బిల్డప్‌కి బిల్డప్. కమీషన్లకు కమీషన్లు. అయినా ఈ బిల్డింగ్‌ల వల్ల జనంకి బోలెడు ఉపాధి దొరుకుతుంది``` `` ఏం ఉపాధి?`` `` కూలి, కొత్తరాష్ట్రంలో కొన్ని వేల మంది కూలీలను సృష్టించిన ఘనత నాదే`` అన్నాడు బాబు.-రాహుల్