ఒకవైపే చూడు...

బాలయ్య భారీ అంగలేసుకుంటూ వచ్చాడు. తిన్నగా సిఎమ్ ఛాంబర్లో ముఖ్యమంత్రి సీటు దగ్గరకెళ్లి కూర్చోబోయాడు. ఆ కుర్చీలోంచి మాటలు ఇలా ఇనబడ్డాయి... 
బాలయ్యా మీ బావ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ లేడన్న ధైర్యమా..రాడన్న నమ్మకమా..అంది.
నాకు ఎమోషన్స్ ఉండవ్, ఫీలింగ్స్ ఉండవ్. క్యాలిక్యులేషన్స్ ఉండవ్. మ్యానిపులేషన్స్ ఉండవ్. సిఎమ్ సీటైనా, సెక్యూరిటీ సీటైనా, అధికారమైనా, అహంకారమైనా, పవర్ ఐనా పిచ్చైనా నేను అనుకున్నది అనుకున్నట్టు చేసేయడమే. వన్స్ ఐ సిట్ హియర్ హిస్టరీ కొలాబ్స్ అన్నాడు బాలయ్య మీసం మెలేస్తూ.
నాకు తిక్క రేగిందంటే చంద్రబాబు గారికి టెలి కాన్ఫరెన్స్ లో చెబుతా అంది సిఎమ్ కుర్చీ. 
నీకు రేగాలేమో నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది చెప్పాడు బాలయ్య తగ్గకుండా. 
అంటే ఏంటి ఇప్పుడు ఈ సీట్లో నువ్వు కూర్చుంటావా అడిగింది సిఎమ్ కుర్చీ.
నేను చేసేది నాకే చెబితే నాకెక్కడో కాలుద్ది అన్నాడు బాలయ్య చొక్కా కాలర్ పీక్కుంటూ..
ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే మీడియా వాళ్లతో రిస్కేమో ఆలోచించండి అర్థం అయ్యేలా చెప్పబోయింది సీటు. 
నేను మీడియాను చూసినా, మీడియా నన్ను చూసి మా బావకే రిస్క్. నాకేం కాదు ఇంతకు ముందు చూడలేదా...; ఎవరి చెంప పగలగొట్టినా మా బావ చంద్రబాబు గూబ గూయ్ మనేలా వాయించేసారు గదా  ఏం జరిగినా నాకేం ఫర్లేదు అన్నట్టు చెప్పాడు బాలయ్య.
నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత మీ ఇష్టం అంది సిఎమ్ సీటు. 
బాలయ్య వెళ్లి దర్జాగా కూర్చున్నాడు. అధికారులు, నాయకులతో చర్చలు చేసాడు. 
చంద్రబాబు సీటుకు ఎసరెట్టిన బాలయ్య, బాబు దావోస్ కు బాలయ్య బాబు సీటుకు, సిఎమ్ కుర్చీని ఆక్రమించుకున్న వియ్యంకుడు అంటూ పేపర్లు, ఛానెళ్లు దరువేసేసాయి. 
దావోస్ లో ఉన్న చంద్రబాబుకు వార్త అందింది. పాతికేళ్లకు ముందు మామ పర్యటనలో ఉన్నప్పుడు తానేసిన స్కెచ్ గుర్తొచ్చింది. మామకు తను పొడిచిన వెన్నుపోటు, వియ్యంకుడు తనకు పొడవబోతున్నాడా అని అనుమానం వచ్చింది...ఆఘమేఘాల మీద అమరావతికి తిరిగెళ్లే పనిలో పడ్డాడు బాబు. చూడు బావవైపే చూడు...ఎప్పుడేం చేస్తాడో చూడు...ఇంకోవైపు చూడకు అనుకుంటూ టెంక్షన్ పడుతున్నాడట చంద్రబాబు. 

Back to Top