కేసుల్లేకుండా చూసుకోవడమే ముఖ్యం..హోదా కాదు.



గోపాత్రుడు అయోమయంగా  పేపర్ కేసి చూస్తూ ఉండిపోయాడు.
ఎంతకీ పేపర్ లోంచి తల పైకి ఎత్తడం లేదు. అలాగని పేపర్ చదవడమూ లేదు.
వాడి వాలకం చూసి జాలేసింది.
ఏంట్రా గోపాత్రుడూ ఏంటి ఏమైంది? అలా ఉండిపోయావు? అని అడిగాను.
గురూగోరూ...యనమల రామకృష్ణుడుగోరేటండీ బాబూ? బిజెపి  ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబితే..బిజెపితో గొడవలు ఎందుకు..వాళ్లు ఎంతో కొంత ఇస్తానే ఉన్నారు కదా అంటారేటండీ బాబూ."అని చాలా అసహనంగా..చికాగ్గా అడిగాడు.
నేను నవ్వాపుకుంటూ మరేం చేయాలంటావురా " అని అడిగాను.
ఏం సేయడమేటి గురూగోరూ  మా హోదా మాకివ్వకపోతే మరియాదగా ఉండదని గట్టిగా అరవాలి కదండీ బాబూ. ఏమీ సేత కానట్లు..వాళ్లు ఏదిస్తే అది పుచ్చుకుంటాం..ఏం చెబితే దానికి తలాడిత్తాం అంటే ఎలాగండీ?  సీసీ పరువు తీసేసారండీ బాబూ " అన్నాడు.
అది సరే కానీరా మరి మీ సెందరబాబు ఏటంటున్నాడు" అని వాడి యాసలోనే అడిగాను.
వాడు తలదించేసుకున్నాడు.
ఏరా అలా ఉండిపోయావు సెందరబాబు గురించి అడిగితే మాట రావడం లేదా? అని అడిగాను.
గోపాత్రుడు చాలా అవమానంగా..కోపంగా..అసహ్యంగా చూస్తున్నాడు.
ఏం జరిగిందిరా మళ్లీనూ? అని అడిగాను.
ఏటీ నేదండీ బాబూ. సెందరబాబుగోరు కూడా నాకు నచ్చనేదండీ అన్నాడు.
"అదేంట్రా  చంద్రబాబు ఒంటి మీద ఈగ వాలితే ఊరుకునేవాడివి కావు ఇపుడు నీకే చంద్రబాబు నచ్చడం లేదా ? ఏం జరిగిందేంటి? " అని ఆరా తీశాను.
"బిజెపి వాళ్లు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అన్నప్పుడు మా సెందరబాబు విదేశాల్లో ఉన్నారండి.
ఆయనే కనక దేశంలో ఉండి ఉంటే బిజెపి లీడర్ల తాట ఒలిచేస్తాడని అనుకున్నారు. సరే విదేశాల నుండి వచ్చిన తర్వాత అయినా బిజెపి వాళ్లని వదలరు లే అనుకున్నాను"
మరాయన విదేశాల నుంచి వచ్చేశాడు కదరా. దీని గురించి ఏమన్నా అన్నారా? అని అడిగాను.
ఎందుకనలేదండీ అన్నారండీ బాబూ. అన్నాడు నీరసంగా గోపాత్రుడు.
మరంత నీరసం ఎందుకురా అన్నాను.
నీరసం లేదు గీరసం లేదండీ బాబూ ఒళ్లు మండిపోతా ఉంది అన్నాడు.
ఎందుకు మండుతోందో చెప్పరా బాబూ అన్నాను.
సెందర బాబుగోరు విదేశాల నుంచి రాంగానే పార్టీ లీడర్లు అంతా కలిసి బిజెపి వాళ్లు ప్రత్యేక హోదా గురించి అన్నవన్నీ చెప్పారండి. సెందరబాబు ఎప్పుడూ ప్రత్యేక హోదా అడగలేదని కూడా బిజెపి వాళ్లు అన్నారని చెప్పారండి" అన్నాడు గోపాత్రుడు.
సెహభాష్..మరి చంద్రబాబు నాయుడు ఏమన్నార్రా? అని ఆతృతగా అడిగాను.
గోపాత్రుడు పళ్లు పట పటా కొరుకుతూ.. మరేం నేదండీ..బిజెపి వాళ్లని టిడిపి లీడర్లు ఎవరూ కూడా ఏమీ అనడానికి వీల్లేదన్నారండి. బిజెపితో గొడవలు పడితే మంచిగా ఉండదని కూడా అన్నారండి. అందరూ సద్దుకుపోవాలని అన్నారండి... ఏటి సద్దుకోవాలండీ.. బిజెపి వాళ్లు ఇవ్వాల్సిన హోదా ఇవ్వకపోతే   వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలా కాలర్ పట్టుకుని అడగాలి .. ఢిల్లీ వెళ్లి నిలదీయాలి అంతే కానీ సెందరబాబు ఏటండీ బాబూ సేతకాని కబుర్లు చెబుతారు. నాకు ఒళ్లు మండిపోతాందండీ బాబూ అని గోపాత్రుడు రొప్పుతూ చెప్పుకుపోతున్నాడు.
నాకు నవ్వాగలేదు.
ఒరేయ్ గోపాత్రుడు..నీతో వచ్చిందదేరా బాబూ.
ఆనందం వచ్చినా తట్టుకోలేవు..
దుఖం వచ్చినా తట్టుకోలేవు.
చంద్రబాబు నాయుడు బిజెపితో గొడవలు వద్దని ఎందుకన్నాడనుకుంటున్నావు? అని అడిగాను.
గోపాత్రుడు చురుగ్గా నాకేసి చూశాడు.
"ఎందుకో ఏమో నాకేటి తెలుత్తాదండీ బాబూ.ఏమీ సేతకాకే అని ఉంటారు" అన్నాడు.
కాదురా ఒరేయ్. ఇపుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని బిజెపిని గట్టిగా అడిగాడనుకో..అపుడు బిజెపి వాళ్లకి కోపం వచ్చిందనుకో.. చంద్రబాబు పై ఉన్న ఓటుకు కోట్ల కేసుతో పాటు రాజధాని భూదందాల వ్యవహారంలో జరిగిన అక్రమాలన్నింటిపైనా బిజెపి ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఆదేశించిందనుకో అపుడేమవుతుందిరా ? అని అడిగాను.
గోపాత్రుడుకి అర్ధం అయ్యీ కానట్లు ఉంది. అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. నాకు తెలీదండీ బాబూ అన్నాడు.
మళ్లీ నేనే చెప్పడం మొదలెట్టాను.
ఆ కేసులు కానీ దర్యాప్తు చేశారనుకో మీ సెందరబాబు  అర్జంట్ గా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.అపుడు ముఖ్యమంత్రి ఉద్యోగం కాస్తా ఊడుతుంది. జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతారో కూడా చెప్పలేం.  అంత డేంజరుందన్నమాట అన్నాను
గోపాత్రుడి కోపం ఇంకాస్త పెరిగింది." అంటే..చంద్రబాబుగోరి మీద కేసులు వస్తాయని రాష్ట్రానికి రావలసిన హోదా రాకపోయినా నోరుమూసుకుని కూకుంటారన్నమాట. ఎంత అన్నేయమండీ బాబూ అన్నాడు.
అదే కదరా నేను మొదటి నుంచీ చెప్తోంది.
మీ సెందరబాబు నాయుడు తన లాభాల గురించి ఆంధ్ర ప్రదేశ్ ను ఢిల్లీకి తాకట్టు పెట్టేశాడు. అన్నాను.
గోపాత్రుడికి అంతా అర్ధమైనట్లుంది.
తలవంచుకుని ఇంటికి పోతూ...ఇక సెందరబాబుగోరి ఫ్యాన్ కాదండీ నేను అన్నాడు.
పగలబడి నవ్వాను.
గోపాత్రుడు కూడా నవ్వుతూ వెళ్లాడు.
................................
-కవికాకి

తాజా వీడియోలు

Back to Top