జెసీకి తైసీ

 నీ సిగతరగా అనే అర్థంలో
‘ఐసీ కీ తైసీ’ అంటుంటారు హిందీవాళ్లు. మహానాడులో ముఖ్యమంత్రి
చంద్రబాబు మాడు వేడెక్కేలా’ జెసీ కి తైసీ’ అనేలా ఉంది జెసి దివాకర్
రెడ్డి ప్రసంగం. వేదికల మీద మరో హాస్యగాడి అవసరం లేకుండా చేయగల సమర్థులెవరైనా ఉంటే పప్పు తర్వాత
జెసి ఒక్కరే అనుకోవాలి. ఆయన అపోజిషన్ ను తిడుతున్నట్టు మొదలెట్టి చివరికి చంద్రబాబు
గడ్డి పెట్టేస్తుంటారు. బాబు నవ్వలేక ఏడ్వలేక అన్నట్టుంటుందా వ్యవహారం. ప్రతిపక్షాన్ని తిట్టినందుకు
సంతోష పడాలో వేదిక మీద గాలి తీసేసినందుకు ఏడవాలో తెలియక కుర్చీకి అతుక్కుపోయారు చంద్రబాబు.

యధావిధిగా ప్రతిపక్ష
పార్టీ నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడంతోనే
జెసి ప్రసంగం మొదలైంది. తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని పిలిచారంటూ
చెప్పుకొచ్చారు. ఈ విధంగా అయినా తన కోరికను జెసి బయటపెట్టుకుంటున్నాడని వేదిక మీదున్న మిగిలిన
టిడిపి నేతలు ముఖాలు చిన్నబుచ్చుకున్నారు. వైఎస్ జగన్ పై నోరు
పారేసుకోవడం పూర్తి కాగానే జెసి నాల్క చంద్రబాబు వైపు తిరిగింది.

మీరు ముఖ్యమంత్రి కావాలి
అదే నా కోరిక. మీరు నాకు మూల విరాట్ అన్నాడు జెసి. చంద్రబాబు నవ్వాడు. బిజెపితో విడాకులే అని ఎప్పుడో ఈ పెద్దమనిషితో చెప్పాను. ఆయన తలూపాడు అన్నాడు
జెసి. బాబు గతుక్కుమన్నాడు. స్పెషల్ స్టేటస్ కంటే ప్యాకేజీలో ఎక్కువ ఇస్తాం అని
వాళ్లంటే చంద్రబాబు బోల్తా పడ్డాడు అన్నాడు. ఈసారి బాబు ముఖంలో కత్తివేటుకు నెత్తుర చుక్కలేకుండా
పోయింది. బాబు ముఖం చూసిన జెసికి జాలి కలిగింది. ఆయన బోల్తా పడలేదు. బోల్తా పడ్డట్టు నటించాడు అని తన మాటను సవరించాడు. అధికారంలో ఉన్న మోదీని
ఏం చేయలేము, కనుక సలాం పెట్టి పది రూపాయిలు సంపాదించుకుందాం అన్నాడు చంద్రబాబు అని ముక్తాయింపు
కూడా ఇచ్చాడు. బాబు ఇమేజీని డ్యామేజీ చేయడం, తర్వాత పైన కట్టు కట్టడం జెసి అలవాటే కదా. ఇక్కడితో జెసి ప్రసంగం
అయిపోలేదు. మైకిమ్మని అడగడానికొచ్చిన సాటి ఎంపిని కూడా విదిలించాడు. ఇంకా నే చెప్పాల్సింది
ఉందయ్యా అంటూ మైకును వదల కుండా గట్టిగా పట్టుకున్నాడు.

చంద్రబాబు నన్ను పిలిచారు
గనక. నేనో విషయం చెప్పాలి అన్నాడు. బాబుకు పల్స్ రేటు పెరిగిపోతోంది. ఈసారి జెసి ఏం షాకిస్తాడో
అని రాని నవ్వును బలవంతాన తెచ్చుకుని తిప్పలు పడుతున్నాడు. మాట మెదిల్తే టెలీ
కాన్ఫరెన్స్ అంటావేందయ్యా అన్నాడు ఆవేశంగా జెసి. తాసిల్దారు, కలెక్టరు, ఆఫీసరు, చివరికి ఫ్యూను కూడా టెలికాన్ఫరెన్సే అంటున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ నువు
ఆళ్లతో కాన్ఫరెన్సులో కూచుంటే ఆళ్ల పనులు ఆళ్లెప్పుడు చేసుకోవాలి. దీని గురించి ఆలోచించు
అని బాబును నిలదీసినంత పని చేసాడు. బాబు ముఖంలో నవ్వు ఆవిరైపోయింది. మహానాడులో చంద్రబాబు
కథ జెసి చేతిలో ఖల్ నాయక్ అయిపోయింది. పొగుడుతూ పొగబెట్టడంలో జెసి తర్వాతే ఎవరైనా అనుకుంటూ
మహానాడు నుంచి బైటికెళ్లారు టిడిపి కార్యకర్తలు. 

Back to Top