జగన్ ఎవరి పుత్రుడో జనానికి తెలుసు

పవన్ ఎవరికి దత్తపుత్రుడో అదీ తెలుసు.
లోకేష్ ఎలాంటి పుత్రుడో కూడా బాగా తెలుసు.

రాష్ట్రానికి సంక్షేమ పాలన అందించిన వైఎస్ రాజశేర్ రెడ్డి కొడుకును జగన్ అని రాష్ట్రమంతా చెప్పుకుంటోంది. బిజెపి నాయకులతో కానీ, ఎన్డీయె ప్రభుత్వంతోకానీ జగన్ తీరు ఎలా ఉందో జనాలకు తెలుసు. ఏ కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాడో, హోదా కోసం ఏ జాతీయ పార్టీతో తలపడ్డాడో, ఏ ప్రభుత్వం నుంచి తన ఎంపీలను విత్ డ్రా చేసుకున్నాడో, ఏ కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసాడో, దేశ రాజధాని నడిబొడ్డున నిరాహారదీక్షలు చేసాడో అందరికీ తెలుసు. ఒక్క తెలుగుదేశం తెలివితక్కువ దద్దమ్మలకు తప్ప. 
ఇక పవన్ మేటర్ కి వద్దాం. చంద్రబాబుకు సొంత పుత్రుడిలా, బిజెపికి దత్తపుత్రుడిలా బాబు మోదీల మధ్య నిలబడ్డప్పుడు పవన్ కళ్యాణ్ ను లోకేష్ నువు ఎవరిపుత్రుడివి అని అడిగుంటే బాగుండేది. అప్పుడే లోకేష్ డౌట్ క్లారిఫై అయ్యేది. అప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబుకు కన్నపుత్రుడికంటే దత్త పుత్రుడే ఎక్కువ అవసరం అయ్యాడు. అందుకే ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని ప్రేమ ఒలకబోసారు. ఇప్పుడు అదే దత్త పుత్రుడిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఇప్పటి కాంగ్రెస్ తో పొత్తు ఎలా ప్రజాస్వామిక అవసరమో అప్పటి దత్తపుత్ర పొత్తు బాబుకు చారిత్రక అవసరం. ఎందుకంటే 10సంవత్సరాలుగా అధికారానికి దూరమై, ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక. ఆ సమయంలో తనకు ఉపయోగపడతాడన్న ఏ చెత్తనాపుత్రుణ్ణైనా చంద్రబాబు చేరదీసి ఒళ్లో కూర్చోబెట్టుకునే వాడు. ఒక్క లోకేష్ ని తప్ప. అంతే కదా మరి కన్నపుత్రుడు ఎన్నికల ప్రచారంలో పంచర్ వేసేసి, తెలుగుదేశానికి ఓటేయద్దని ప్రచారం చేస్తున్నాడాయె. అందుకే ఎక్కడా పోటీ చేయించి, పరువు పోగొట్టుకోకుండా కాపాడుకుని, అడ్డదారిలో మంత్రిని చేసి కూర్చోబెట్టుకున్నాడు చంద్రబాబు. కన్న పుత్రుడితో సుఖంలేదని కొనుక్కున్న పుత్రుడితో (పాకేజీ పవన్ కళ్యాణ్ లాంటి వారిని) ప్రచారం చేయించుకున్న దుస్థితి చంద్రబాబుది. 
కనుక మిస్టర్ నారా లోకేష్ ఎవరు ఎవరి పుత్రులు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని, ఏ పుత్రుడికి ఎంత క్రెడిట్ ఉందో అర్థం చేసుకుని మాట్లాడాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు. పచ్చ వేదికలెక్కి పచ్చిపచ్చిగా మాట్లాడితే పబ్లిక్ లో తమ పరువే పలుచనౌతుందని అర్థం చేసుకోవాలని హితబోధ చేస్తున్నారు.


తాజా వీడియోలు

Back to Top