ఇక్క‌డ ప్ర‌జ‌ల్ని ముంచ‌డం నేర్పెద‌రు..!

చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశాడు. విలేక‌రుల‌తో ఇలా ప్ర‌సంగం మొద‌లు పెట్టాడు. 

``పుష్క‌రాల‌తో
మ‌న కీర్తి అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఏర్పాట్లు అద్భుతం..మునిగిన
వాళ్ళంతా పైకి లేచారు. అంద‌రికి పుణ్యం ల‌భించింది`` అన్నాడు
``మ‌రి చ‌నిపోయిన వాళ్ళ సంగ‌తి`` అడిగారు విలేక‌రులు
``వాళ్ళ‌కు
స్వ‌ర్గం ల‌భించింది. పుష్క‌ర స్నానంలో వైకుంఠ ప్రాప్తి పొందితే
స‌ద్గ‌తులు ల‌భిస్తాయ‌ని పండితులు చెబుతున్నారు. ఆ ర‌కంగా మా ప్ర‌భుత్వం
పైసా ఖ‌ర్చు లేకుండా వాళ్ళ‌ని పైలోకాల‌కు పంపించింది.
`` మ‌నిషి ప్రాణానికి మీ దృష్టిలో విలువే లేదా?``
`` విలువ వుంది కాబ‌ట్టే ప‌దిల‌క్ష‌లిస్తున్నాం``
``ప‌దిల‌క్ష‌ల‌తో ప్రాణం తిరిగొస్తుందా?``
``
పోయినదేది తిరిగిరాదు. వాన‌రాక‌డ‌, ప్రాణం పోక‌డ ఎవ‌రికి తెలుస్తుంది.
మ‌న‌ది క‌ర్మ‌భూమి, ఎవ‌రి ఖ‌ర్మ‌ని అనుస‌రించి వారి మ‌ర‌ణం``. అన్నాడు బాబు
ఆకాశం వైపు చేతులు చూపిస్తూ..!
`` అంతా ఖ‌ర్మ ప్ర‌కారం జ‌రిగేతే, ఇక ప్ర‌భుత్వాలు ఎందుకు?`` అడిగారు విలేక‌రులు
``ప్ర‌భుత్వాలు
వుండ‌డం ప్ర‌జ‌ల ఖ‌ర్మ‌, ప్ర‌జ‌లు వుండ‌డం ప్ర‌భుత్వాల ఖ‌ర్మ‌. పైకి
క‌నిపించేవ‌న్ని పాలు కాన‌ట్టే, అంద‌రూ ప్ర‌జ‌లు కారు. ఓటు లేని వాళ్ళు
 ప్ర‌జ‌లు కారు. ఒక వేళ వున్న మా పార్టీకి ఓటు వేయ‌ని వాడు మా ప్ర‌జ‌లు
కాదు. అయినా  జ‌నాభా త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఎన్నో
సౌక‌ర్యాల్లో పుష్క‌రాల తొక్కిస‌లాట కూడా ఒక‌టి``
``మీరు గంట‌ల త‌ర‌బ‌డి స్నానం చేయ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని అంటున్నారు``
``
గంట‌ల త‌ర‌బ‌డి స్నానం చేయ‌డంలో త‌ప్పేముంది. ముఖ్య‌మంత్రి కూడా మూడు
మున‌క‌లేస్తే ఇక సామాన్యుడికి నాకు తేడా ఏముంది?    నేను  స్నానం
చేస్తున‌పుడు అంత‌ర్జాతీయ చాన‌ళ్ళ‌న్నీ క‌వ‌ర్ చేశాయి.``
`` అధికారులు మీ వీపు రుద్దుతూ కూచోడం వ‌ల్లే ఈ తొక్కిస‌లాట జ‌రిగింది``
``అధికారుల‌న్న‌ది ముఖ్య‌మంత్రి సేవ‌లు చేయ‌డానికి కాక‌పోతే జ‌నం సేవ చేయ‌డానికా?``
`` మ‌రి ప్ర‌జ‌ల కోసం భారీ ఏర్పాట్లు చేశామ‌ని ఎందుకు ప్ర‌క‌టించారు?``
``
రాజ‌కీయాల్లో ఎన్నో ప్ర‌క‌టిస్తాం, అవ‌న్నీ నిజ‌మ‌ని న‌మ్మితే ఎలా? ఏడాది
నుంచి రాజ‌ధాని నిర్మిస్తాన‌ని డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నాను. ఇంత‌వ‌ర‌కూ
ఒక్క ఇటుకైనా క‌ట్టానా? ఇన్నేళ్ళుగా న‌న్ను చూస్తున్నారు. అయినా జ‌నానికి
బుద్ధి రాక‌పోతే ఎలా?   చెప్పిన ప్ర‌తిమాట న‌మ్మేయ‌డ‌మేనా? అయినా మ‌న‌లో
మ‌న మాట‌, గోదావ‌రి ఎక్క‌టికైనా పారిపోతుందా? న‌దిలో నీళ్ళు ఇంకి పోతాయా?
 నిదానంగా స్నానం చేయ‌కుండా తొక్కిస‌లాడ్డం దేనికి?  తోసుకుంటే ప్రాణాలు
పోకుండా వుంటాయా?``
`` మ‌రి మీ పోలీసులంతా ఏం చేస్తున్నారు?``
``ఏం
విలేక‌రుల‌య్యామీరు? త‌లాతోకాలేని ప్ర‌శ్న‌ల‌న్నీ అడుగుతారు.
పోలీసులున్న‌ది మా సెక్యూరిటికే గానీ, ప్ర‌జ‌ల సెక్యూరిటీకా? ప‌్ర‌జ‌లు
ఎవ‌డి సెక్యూరిటీ వాడే చూసుకోవాలి`` అని న‌వ్వాడు బాబు
`` మ‌రి మీరున్న‌ది ఎందుకు?``
``ప్ర‌జ‌ల్ని ముంచ‌డానికి``
                                 స‌మావేశం ముగిసింది
Back to Top