ఆ ఒక్కటీ అడగను

చంద్రబాబును జాతీయ మీడియా చుట్టుముట్టి, ప్రశ్నల మీద ప్రశ్నలతో కొట్టి, సమాధానాలు సంతృప్తికరంగా లేవని మైకుల మీద మొట్టి వెళ్లిపోయింది.... 

ప్రత్యేక హోదా అడుగుతారా?
అది నేను అనలేదు ప్రజల సెంటిమెంట్.
మీరెప్పటి నుండి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు?
ఎన్నికలు దగ్గరపడ్డప్పటి నుండీ.
పార్లమెంట్ కు ఇంతకు ముందు వచ్చినప్పుడు మొక్కని మీరు ఇప్పుడు మొక్కడంలో అర్థం ఏమిటి?
భయంతో కూడిన భక్తి వల్ల కలిగిన గౌరవం నాతో అలా చేయించింది.
మోదీకి ఇప్పటి వరకూ ఎన్ని పార్టీల మద్దతు కూడగట్టారు?
అలా అని మీతో ఎవరు చెప్పారు?
మరి పార్లమెంటు లాబీల్లో కనబడ్డ ఎమ్.పితో అల్లా మాట్లాడారు గదా?
కేంద్రానికి రాష్ట్రం చేసిన అన్యాయం గురించి వాళ్లకి వివరించాను అంతే!!
అయితే బిజెపి ఎమ్.పిలతో కూడా మాట్లాడారు గదా...అన్యాయం చేసినవాళ్లతో ఏమని మాట్టాడారేంటి?
(బాబు గతుక్కుమన్నాడు...దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి చూపులు చూసాడు...తర్వాత సర్దుకుని...)
అన్యాయం చేసిన వాళ్లనే న్యాయం చేయమని అడుగుతున్నాం. 
అలాంటప్పుడు మిగిలిన పార్టీల వారిని సంప్రదించాల్సిన పని లేదుగదా??? బిజెపినే న్యాయం చేయమని అడగాలి గానీ, అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు?
(బాబు గబగబా చెమటలు తుగుచుకున్నాడు)
కేంద్రం అన్యాయం చేసింది అందుకే అవిశ్వాసం పెట్టాం. మోదీ న్యాయం చేయాలి అందుకే పోరాడుతున్నాం. 
సరే మీరు ప్రత్యేక హోదా కోసం ఏవిధమైన పోరాట కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారో వివరిస్తారా?
జపాన్ తరహా నిరసన, సింగపూర్ తరహా ధర్నా, చైనా తరహా వినతి, దుబాయ్ తరహా పోరాటం...
ఇతకీ కేంద్రాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు?

మా ప్రతిపక్షాన్ని దగ్గరకు తీయొద్దని...
పదే పదే పాత లెక్కలు అడగొద్దని...
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్.పిలకు మోదీ అప్పాయింట్ మెంట్ ఇవ్వొద్దని...
ఒకె.ఒకె ... మరి మీ ప్రభుత్వం అవినీతి చేసినట్టు కేంద్రం ఆరోపిస్తోంది కదా..మీరు సిబిఐ ఎంక్వైరీ వేయమని కూడా అడుగుతారా?
నో నెవర్ ఆ ఒక్కటీ అడగను...
 


 

 

 

Back to Top