హిందీలో తిడితే తెలుగులో పొగిడినట్టు


ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాదు. గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కాదు. ఆవేశం వస్తే నేను బాలయ్య కాదు. అప్పుడు నేను మాట్లాడేది తెలుగూ కాదు. రగ్ రగోం మే రక్తం దౌడ్ తా హై జబ్ మా బావ నన్ను పీఛే మార్ తా హై. సామదానభేదదండోపాయాలు నాముందు పనిచేయవ్. ఓన్లీ దండంంఅది రెండు చేతులు దగ్గరకి పెట్టి వినయంతో చేసేది కాదు. నేను ఒంటిచేత్తో ఎదుటివారి చెంపపై వేసేది. దీన్నే నా భాషలో దండోపాయం అంటాను. ఇకపోతే ఇప్పటికిప్పుడు నేను హిందీలో మాట్లాడటానికి కారణం మా బాబ్బావే. ఆయనే అన్నాడు ఒక సారి వచ్చి మైకు ముందు మాట్లాడు అని. ఎలాగో నువు మాట్లాడాక తెలుగువాళ్లే ఏం అర్థం కాక జుట్టు పీక్కుంటారు. ఇక హిందీలో మాట్లాడితే ఢిల్లీ వాళ్లు ఏం కనుక్కుంటారూ అనడంతో నేను ఇప్పుడు హిందీలో మాట్లాడుతున్నాను అన్నమాట. అందుకే ఇప్పుడు మోదీని తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చాను. 

పెద్దల్ని నేర్చుకోవడం గౌరవాన్ని పెద్దరించడం చాలా ముఖ్యం. నాకది ఉంది. కావాలంటే నా చరిత్ర చూస్కోండి. మా నాన్నగార్ని వెన్నుపోటు పొడిచిన బావకు వెనకాలే ఉన్నా. అంతేనా వియ్యంకుడ్ని కూడా చేస్కున్నా. ఇదిగదా పెద్దల్ని నేర్చుకోవడం అంటేంనన్ను చూసైనా నువ్ సబక్ సీఖ్ంనువ్వో గద్దర్ వి. అంటే గబ్బర్ సింగ్ కి తమ్ముడివి. నువ్వో నమక్ హరామ్ వి అంటే హరేరామ్ అన్నయ్యవి. నిన్ను భాగ్ భాగ్ కే దౌడాయేంగే. ఎందుకంటే మళ్లీ ఎన్నికల్లో మీతో పొత్తు కావాలిగదా. మా బావ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ంమేం ఎన్ని తిట్టినా, వాటిని మీరు రివర్స్ లో అర్థం చేసుకోవాలి. గతంలో మోదీని ఎపిలో అడుగుపెట్టనివ్వనన్న మా బావా మిమ్మల్ని పిలిచి తిరపతిలో సభపెట్టారు గదా. ఇదీ అలాంటిదే అన్నమాట. మరి ఆ కాలంలో నాన్నగారు పార్టీని పెట్టారు. తర్వాతి కాలంలో బావగారు దాన్ని దొడ్డిదారిలో చేపట్టారు. మా అందరినీ వలేసి పట్టారుంకనుక ఆంధ్రులు చేతగానివాళ్లు గాదు. మోదీకి నన్ను అర్థం చేసుకోడం చేతగాదు. జైహింద్

 
 
Back to Top