హైట్రిక్కు బాబు


చంద్రబాబు జన్మభూమి మనూరు అంటూ ఊరూరా తిరుగుతున్నాడు. సభ పెడితే ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి,  గ్రామ సభ కెళితే తిట్లు శాపనార్థాలు వినబడుతున్నయి. పంచరైపోతున్న సైకిల్ ని రొప్పుతూ, తొక్కుతూ చంద్రబాబు శ్రీకాకుళం చేరాడు. రైతులు రుణ మాఫీ కాలేదని, భూములు లాక్కుంటున్నారని తిడుతున్నారు, మహిళలు డ్వాక్రా మాఫీ కాలేదని చీపుళ్లు తిరగేస్తున్నారు కనుక యూత్ ని టార్గెట్ చేద్దాం అనుకున్నాడు. పైగా ప్రతి పక్ష నేత యువభేరీలతో యువతరాన్ని కలెక్టివ్ గా ముందుకు తీసుకుపోతున్నాడని అధికారిక వర్గాలు చంద్రబాబు చెవిలో ఊదాయి. ప్రతిపక్ష నేత ఏం చేస్తే, దాన్ని పులిని చూసి నక్క వాతలా పెట్టుకునే నారా సేమ్ రూట్ ఫాలో అవ్వాలనుకున్నాడు. శ్రీకాకుళం యూత్ సమ్మిట్ అని పేరు పెట్టి యువతనందరినీ ఆహ్వానించాడు. కార్యకర్తలను సభలకు తరలించినట్టు యువతను తరలించలేరు కనుక హాజరైన ప్రతి వారికీ ఓ లాప్ టాప్ అని ప్రచారం చేసాడు. 

శ్రీకాకుళం యూత్ సమ్మిట్ మొదలైంది. చంద్రబాబు మైకందుకున్నాడు. భావి భారత పౌరులు మీరు, కాబోయే నా ఓటర్లు మీరు అన్నాడు. టెక్నాలజీకి నేను మానస పుత్రుణ్ణి. నా వల్లే రాష్ట్రానికి ఐటి హబ్ గా పేరొచ్చింది. కంప్యూటర్ ని తెలుగు వారికి పరిచయం చేసింది నేనే. 
డిజిటల్ క్లాసురూములు పెట్టాం. డిజిటల్ హాజరు నమోదు చేస్తున్నాం. ఇంటింటికీ ఇంటర్నెట్ ఇస్తున్నాం. ఈ గవర్నెన్స్ నడిపిస్తున్నాం.. రాష్ట్రాన్ని టెక్నాలజీతో అనుసంధానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను హైటెక్ గా మారుస్నున్నాంంఇప్పుడు మీరు మాట్లాడండి అని స్టూడెంట్స్ అడిగాడు. 
సార్ డిజిటల్ క్లాస్ రూమ్ లకు మా స్కూల్ లో కరెంట్ లేదు కదా అడిగాడో విద్యార్థి. 
మా స్కూల్ కి కరెంట్ ఉంది కాది ఒక్క కంప్యూటర్ కూడా లేదే అడిగాడు మరో స్టూడెంట్. 
మా కాలేజ్ లో ఉన్న నాలుగు కంప్యూటర్లలో రెండు రిపేరు, మిగిలిన రెండు ఉన్నా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు సీరియస్ అయ్యాడు మరో స్టూడెంట్. 
ఇంత వరకూ మేము మా కాలేజీలో ఒక్క కంప్యూటర్ అయినా చూడనే లేదు అన్నాడు ఇంకో విద్యార్థి. 
టెక్నాలజీ మా స్కూల్ కి చుట్టు పక్కల కూడా లేదు అరిచారు విద్యార్థులందరూ. 
చంద్రబాబు కంగారు పడ్డాడు. ఇంకాసేపు ఉంటే విద్యార్థులు 3ఈలో తన పాలనను కళ్లకు కట్టేస్తారని అర్థం అయ్యింది. వెంటనే లేచి ’దీనపై అధికారులను ఆదేశిస్తాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, నాకు టెలీ కాన్ఫరెన్సుకు టైమ్ అయ్యింది. మళ్లీ కలుద్దాం’ అని చల్లగా జారుకున్నాడు చంద్రబాబు. 
కబుర్లలో కంప్యూటర్లు, తెరమీద గ్రాఫిక్కుల జిమ్మిక్కులు తప్ప గ్రామాల్లో విద్యార్థులకు టెక్నాలజీ ఎప్పుడు అందిందనీం.అంతా చంద్రబాబు హైటెక్ ట్రిక్కు అనుకున్నారు అక్కడే ఉన్న విద్యాశాఖాధికారులు. 
 

తాజా వీడియోలు

Back to Top