రాష్ట్రంలో వృద్ధిరేటు

"రాష్ట్రంలో వృద్ధిరేటు పెరిగింది" అని చంద్రబాబు అధికారుల సమావేశంలో అనగానే అందరూ తలలు వూపారు. 
"అభివృద్ధి గురించి చెప్పండి" అని అడిగాడు బాబు
రైతుల ఆత్మహత్యలు గతంలో కంటే పెరిగాయి. చిల్లిగవ్వలేక వ్యవసాయం చేయడం మానివేశారు. గతంలో కష్టమొస్తే ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి కూలి చేసుకునేవాళ్లు. మోడీ పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఎవరికీ పనులు లేవు. ఎక్కడికెళ్లినా పస్తులే అని చెప్పాడో అధికారి
"వ్యవసాయం దండగ అని నేనెప్పుడో చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. నా మాట ఎవరూ వినలేదు. చేతిలో రూపాయి లేకుండా చేసేసరికి ఇన్నాళ్లకు రైతులు దారికొస్తున్నారు"అన్నాడు బాబు
"ఇక పరిశ్రమల విషయానికొస్తే తమరి దయవల్ల గతంలోనే చాలా మూతపడ్డాయి.ఇప్పుడు నోట్ల రద్దుకి చిన్నాచితకా అన్నీ మూసుకున్నారు. వేలమంది కార్మికులు రోడ్డున పడుతున్నారు"అన్నాడో అధికారి.
"మంచి పరిణామం. పట్టణాల్లో బతకలేని కార్మికులంతా పల్లెలకు వలస వెళ్లలేరు. పల్లెల్లో బతకలేని రైతులంతా పట్టణాలకి వస్తారు. అప్పుడు సమతుల్యత లభిస్తుంది" అన్నాడు బాబు
?దీనివల్ల ప్రయోజనమేంటి?" అడిగాడో అధికారి
"తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడమే రాజకీయం. రెండున్నరేళ్లుగా నేను చేస్తున్నదదే. ఇంకా అభివృద్ధి గురించి చెప్పండి?" అన్నాడు బాబు
"మన నాయకులు, ఎమ్మెల్యేలు సమృద్ధిగానే సంపాదించుకున్నారు. అధికారులు నోట్ల రద్దులో కూడా లంచాలు మానడం లేదు. కొత్త టెక్నిక్ లు కనుక్కుంటున్నారు"
కొత్త టెక్నిక్ అంటే నాకు చాలా ఇష్టం. చూద్దాం పదండి అన్నాడు బాబు
"తమరి పాలనలో అంతా ఆన్ లైనే కదా, వీడియో కాన్ఫరెన్స్ లో చూపిస్తా" అన్నాడా అధికారి.
ఒక ఎక్సైజ్ అధికారిని లైన్ లోకి తెచ్చి పని చెప్పాడు. లక్ష రూపాయలు లంచం అడిగాడు
"సుబ్రమమ్యం కిరాణా కొట్టుకెళ్లి లక్ష రూపాయల సరుకులు కొనండి. క్యాష్ ఇవ్వక్కర్లేదు"
"ఆసరుకులు కొని మేమేం చేసుకోవాలి?" అన్నాడు ఇంకో అధికారి
"మీకు సరుకులు ఇవ్వం. మీరు మాత్రం  లక్షరూపాయలివ్వాలి. స్వయిప్ మిషన్ లో గీకి బిల్లు ఇస్తాడు. ఆ లక్ష నాకు వస్తుంది. ఆ కిరాణావాడు నా బామ్మర్దే"
తమరి ఆన్ లైన్ ఇలా ఉపయోగపడుతోంది
బాబు సంతోషించి "అధికారులంతా టెక్నాలజీ తెలుసుకోవడమే నా ప్రభుత్వ లక్ష్యం. మరి నా మంత్రులేం చేస్తున్నారు?"
"శతకోటి దందాలకి అనంతకోటి ఉపాయాలు. మంత్రులు స్వయిపింగ్ ఇండస్ట్రీనే పెట్టారు. ఎక్కడ గీకినా డబ్బులు వాళ్లకు చేరేలా ప్లాన్ చేసారు"
"ఐటీ అధికారుల భయం లేదా?" అడిగాడు బాబు
"ఐటీ అధికారులు సరిగా పనిచేస్తే తమరి రెండెకరాలు లక్షల కోట్లు ఎలా అవుతాయి. మీరు మోడీ పేదవాడి ఇంట్లో దీపం వెలిగిస్తానని చెప్పి వాడి ఇంటికి నిప్పు పెట్టారు"
"ఆ నిప్పుని ఆర్పేస్తాం"
"మీ వల్ల కాదు. వచ్చే ఎన్నికల్లో ఆ నిప్పు మీ ఇద్దరినీ దహిస్తుంది"

తాజా వీడియోలు

Back to Top