ఆట మొదలైంది

  • ఈ పొద్దు నంద్యాలంతా కళకళ లాడతా ఉంది. నిన్ననే జగనన్న  వచ్చినాడు గదూ.
  • కొన్నాళ్లుగా గుంటనక్కల్ని, పందికొక్కుల్ని చూసి చూసి చిరాకు పుట్టిన నంద్యాల జనాలకు సింహం సింగిల్ ఎంట్రీ చూసినట్టనిపించె. 
  • కారు కూతలు, కాకి లెక్కలు వినీ వినీ విసిగెత్తిపోయున్న ప్రెజానీకానికి నమ్మకమైన ఓ గొంతు నంద్యాలంతా రీసౌండ్ లా వినిపించె.
  •  నికార్సయిన నాయకుడెవరో, నక్కజిత్తుల దొంగ కుక్కలెవరో తెల్లగా తెల్లారినట్టు తెలిసిపోలా? 
  • పథకాలు, పంపకాలు, ఇళ్లు, రోడ్లు అంటూ చేసిన మాయంతా ఏమిటో జగనన్న అరటిపండు ఒల్సి చెప్పినట్టి చెప్పంగనే, పచ్చ నాయకులందరికీ పగలే చుక్కలు కన్పించె. 
  • ఎంత పకడ్బందీగా కళ్లకు గంతలు గట్టినా, జగనొచ్చి క్షణంలో జాగృతం జేసేసినాడే అని నెత్తి నోరూ బాదుకుంటాండారు. 
  • పదనైదు రోజులుగా ఎండనకా, వాననక, మంత్రనక, ఎమ్మెల్యే అనకా అందరూ నంద్యాల రోడ్ల మీద నానా నాటకాల దుమ్ము లేపితే, జగనొచ్చి ఒక్క సభతో ఆ దుమ్మంతా దులిపేసి పాయె అని మొత్తుకుంటండారు. 
  • వేళ్ల చివర్ల పూలు పూయించి చెప్పిన కథలన్నీ కంచి కెళ్తాయని సాచ్చాలతో సహా నిరూపించేసెనయ్యే. 
  • ఇక ఆట మెదలైందని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పింది నంద్యాల ఎలక్షన్ల గురించి మాత్రమే కాదబ్బా, చంద్రబాబు చెడ్డీ ఊడగొట్టేదానికి కూడా...!

Back to Top