జగన్ ఆస్తులు చూసి బాబుకి జరమొచ్చింది

ఎప్పుడూ జగన్ ఆస్తులు, అక్రమాస్తులు అంటూ ఊకదంపుడు తప్పుడు ప్రచారంతో పబ్బం గడుపుకోవడంలో తెలుగు తమ్ముళ్లు ఆరితేరిపోయారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మినహాయింపు కాదు. తప్పుచేసి అడ్డంగా దొరికిపోయినపుడు అధికార పార్టీ నేతలకు సడన్ గా వైయస్ జగన్ ఆస్తులు గుర్తొస్తాయి. బాబుగారి ఆదేశాలతో ఎవరో ఒకరు ఆవు కథ మొదలుపెట్టి ప్రజలను నమ్మించడానికి ఏకరువు పెడతారు. ఉన్నదీ లేనిదీ తగిలించి, న్యాయస్థానం పరిధిలో ఉన్న విషయాలనుకూడా విచ్చలవిడిగా మాట్లాడేస్తారు. అది సభలో అయినా... బయటైనా సరే. విషయాన్ని పక్కదారి పట్టించడానికి జగన్ ఆస్తుల ప్రస్తావనను ఇన్నాళ్లూ అద్భుతంగా ఉపయోగించుకున్న టిడిపి నేతలు ఇప్పుడు ఆ ఊసు ఎత్తితేనే హడలెత్తిపోతున్నారట. అదేంటీ..! ఆడలేక మద్దెలోడు అన్నట్లు, పచ్చపార్టీ నేతల డొంకతిరుగుడు బతుక్కి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడే జగన్ ఆస్తుల ప్రస్తావన.. సడన్ గా వారిపాలిట శరాఘాతంగా ఎలా మారిందబ్బా..? అందుకు కారణం లేకపోలేదు.
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న వైయస్ఆర్ పార్టీ అధినేత వైయస్ జగన్.. అక్కడ ప్రజలతో సభల్లో మాట్లాడుతూ తన ఆస్తులు ప్రకటించారు.  అదిగో.. ఆ లెక్కలు విని పచ్చ తమ్ముళ్లకు ముచ్చెమటలు పట్టేశాయి. అప్పటినుంచి 'జగన్ ఆస్తులు' అనే సబ్జెక్టు మాట్లాడాలంటే చాలు ఎల్లో గ్యాంగ్ వెన్నులో వణుకు పుడుతుందట. ఆ విషయంపై ప్రెస్ మీట్ పెట్టమంటే చాలు... ఏదో ఒక సాకు చెప్పి తప్పుంచుకుపోతున్నారట. చివరకు బాబుగారు పిలిచి చెప్పినా సరే... ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారట. కావాలంటే 'వెన్నుపోటు పుట్టుక... దాని పర్యవసానం' అనే అంశంపై Phd చేయడానికైనా సిద్ధం కానీ... జగన్ ఆస్తుల గురించి మాత్రం మాట్లాడమని అడగొద్దు అని దండాలు పెట్టేస్తున్నారట.
ఇంతకీ పచ్చనేతలకు ఇంత కంగారు కలవరం కలిగించేంత ఆస్తులు జగన్ ఏం ప్రకటించారబ్బా..! అని చూస్తే... ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- నాకున్న ఆస్తేమిటో తెలుసా!
జగన్ అబద్ధం ఆడడు, మోసం చెయ్యడు అనే ప్రజల నమ్మకమే నా ఆస్తి.
- నాకున్న ఆస్తేమిటో తెలుసా!
జగన్ ఒక మాట ఇచ్చాడంటే ఆరునూరైనా అది నెరవేర్చి తీరతాడు అని ప్రజల్లో ఉన్న విశ్వాసమే నా ఆస్తి.
- నాకున్న ఆస్తేమిటో తెలుసా!
విలువలు, విశ్వసనీయతే నా ఆస్తి!
- నాకున్న ఆస్తేమిటో తెలుసా!
నాన్నగారు ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు దూరమై ఎనిమిదేళ్లు కావస్తున్నా... తన సంక్షేమ పాలనతో ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన వెళుతూ వెళుతూ నాకిచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి.
ఇలా జగన్ తన ఆస్తుల వివరాలను నంద్యాల ఎన్నికల ప్రచారం సాక్షిగా ప్రజలముందుంచారు. 
ఇప్పుడు టిడిపి వాళ్లు ఎక్కడైనా జగన్ ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెడితే... మళ్లీ ప్రజలకు జగన్ ప్రకటించిన ఆస్తులు గుర్తుచేసినట్టు ఉంటుందేమో అని జడుసుకు చస్తున్నారట.
ఇలా తమదగ్గర మచ్చుకైనా లేని ఆస్తులు... బాబుగారి ఆలోచనల్లో కూడా లేని ఆస్తులు... తాము తలకిందుల తపస్పు చేసినా, మరో వందజన్మలు ఎత్తినా సంపాదించుకోలేని ఆస్తులు జగన్ బహిరంగంగా ప్రకటిస్తే... వాటికి జనహోరు జయహో అని ఓటేస్తే జ్వరం కాక ఇంకేమొస్తుంది. 


Back to Top