బాబు హయాంలో రైతు దివాళా

చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు.
నాహయాంలో రైతులు సుఖసంతోషాలతో వున్నారు. నేను రైతు పక్షపాతిని అన్నారు.
వెనకటికి మీరు వ్యవసాయం దండగ అన్నారా లేదా? అడిగాడో విలేకరి
కానీ ఇప్పుడు వ్యవసాయం పండగ అంటున్నాను
పండగే ఐతే రైతు తిండి లేకుండా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు?
రైతులు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నాడు బాబు
పంట పండకపోవడం అనే బాధ తప్ప, రైతుకి ఇంకే సమస్య వుంటుంది?
రైతులకి చాలా సమస్యలున్నాయి.  పంటలు బాగా పండితే ఆ సంతోషంతో మద్యం తాగడానికి, మత్తుమందుల వాడకానికి అలవాటుపడుతున్నాడు. ఆమత్తులో ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నాడు చంద్రబాబు
మత్తుమందుల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పిన ఏకైక రాష్ట్రం మనదేసార్ అన్నారు విలేకరులు
నేను ఏదీ వూరకే మాట్లాడను. పరిశోధించి తెలుసుకుంటాను అన్నాడు బాబు
మరి రుణమాఫీ వాగ్దానంతో అధికారంలోకి వచ్చారు. మరి చేసారా?
మెల్లిగా దశలవారిగా చేస్తాను
అంటే రైతు పోయిన తరువాత?
రైతు పోతే నష్టపరిహారమిస్తాం
రైతుకి చిప్ప తప్ప ఇంకేమి ఇవ్వరు. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా సరిగా ఇవ్వలేదు.
రైతుకు అన్నీ ఇస్తాం. ఎక్కడా లేని విధంగా రెయిన్ గన్ లిచ్చాం
కాకిలెక్కలు చూపడానికి, మీ అధికారులు కమీషన్లు తినడానికి పనికొచ్చాయి. ఆ గన్ లతో ఎక్కడైనా పంటని కాపాడారా?
నిజంగా గన్ లతో పంటలు బతికేట్టు వుంటే, ఈ ప్రాజెక్టులు ఇవన్నీ ఎందుకు?
కొత్తగా పరిశోధనలు చేయడం నాకు అలవాటు. వెనకటికి కుప్పంలో ఇజ్రాయిల్ సేద్యం చేయించాను
ఆ దెబ్బకి కుప్పం రైతులు  దివాళాతీసారు. మీకు తెలుసో తెలియదో కుప్పంనుంచే రైతులు వలసపోతున్నారు
వలస అనేది ఒక జీవన విధానం. అవతల పార్టీ నుంచి మా పార్టీలోకి వలసలు రాలేదా?
దాన్ని వలస అనరు. కొనుక్కోవడం అంటారు
ఇంతలో ఒక అస్థిపంజరం అటువైపుగా వచ్చింది. చంద్రబాబు జడుసుకొని భూతం అని అరిచాడు
భూతం కాదు, తమరి పాలనలో బక్కచిక్కిన రైతు అన్నారు విలేకరులు
Back to Top