రైతే రాజు అన్న ప్రచారం ఎందుకంటే

పట్టువదలని విక్రమార్కుడు అడుగులో అడుగేసుకుంటూ చెట్టువైపు వస్తున్నాడు.చెట్టుమీది శవాన్ని దింపి భుజాలకెత్తుకున్నాడు. విక్రమార్కుడి భుజాలపై ఆనగానే శవంలోని బేతాళుడు లేచి బద్దకంగా ఆవులించాడు.

  • "ఏం  విక్రమార్కా? ఏంటి కబుర్లు? నేను కాస్త బద్ధకం వదలగానే కథ చెబుతాను కానీ అంతవరకు ఏమన్నా విశేషాలుంటే చెప్పు" అన్నాడు బేతాళుడు.
  • విక్రమార్కుడు తనలో తానే నవ్వుకుంటూ...
  • " ఏం లేదు బేతాళా . చంద్రబాబు నాయుడు  సింగపూరు..మలేషియా..జపాన్..చైనాలు విమానాల రెక్కలు అరిగేలా తిరిగేశారు. కానీ మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మాత్రం  అందరి చేతా సెహభాష్ అనిపించుకుంటున్నారు" అన్నాడు విక్రమార్కుడు.
  • "ఆవిడ ఏం ఘనత సాధించిందేంట"ీ అని బేతాళుడు కుతూహలంగా  అడిగాడు.
  • "ఆవిడ ఏ దేశానికి వెళ్లకుండా వివిధ దేశాల ప్రతినిథుల బృందాలను తమిళనాడుకు రప్పించుకుని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండని అడిగారు. అంతే రెండున్నర లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులకు వివిధ కంపెనీలు ఓకే అన్నాయి." అని విక్రమార్కుడు చెప్పాడు.
  • బేతాళుడు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మెచ్చుకుని  ..సరే ఇక కథ విను అని చెప్పడం మొదలు పెట్టాడు.
  • " విక్రమార్కా...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రైతులకు వ్యతిరేకి అని  అందరూ ఆడిపోసుకుంటూ ఉంటారు. వ్యవసాయానికి కూడా ఆయన వ్యతిరేకి అని అంటూ ఉంటారు. కానీ అదేంటోనయ్యా  మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తోటపల్లి రిజర్వాయర్ ను ప్రారంభించాడు. ఆ ప్రాజెక్టు ను దగ్గరుండి కట్టించడానికి ఆయన గట్ల మీద పడుక్కున్నారట కూడా. నిన్నటికి నిన్న పట్టిసీమ ప్రాజెక్టు  ప్రారంభించేసి నదుల అనుసంధానం కూడా చేశానని చంద్రబాబు చెప్పారు. ఇక రాష్ట్రంలో రైతులు ఎలా ఉన్నారో తెలుసుకోడానికి ఆయన రైతు కోసం చంద్రన్న యాత్ర కూడా చేయబోతున్నారట. ఇవన్నీ చూస్తోంటే ఆయన రైతుల కోసం ఇంతగా తపిస్తున్నారా అనిపిస్తోంది. ఇప్పుడు రైతుల కోసమే అన్నీ చేస్తున్నట్లు ఆయన ఫేస్ బుక్ లో కూడా ప్రకటించుకొన్నారు. దీనిని ఏమంటారు...  మరి ఆయన రైతు వ్యతిరేకని ఎందుకు  అంటున్నారో నాకైతే అర్ధం కావడం లేదు. ఆయన మంచి చేసినా చెడు అంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసీ కూడా చెప్పకపోతే  నీ తల వెయ్యి చెక్కలైపోతుంది అని బేతాళుడు ముగించాడు.
  • విక్రమార్కుడు పొలమారేలా  పగలబడి నవ్వి...
  • "బేతాళా నువ్వొఠ్టి అమాయకుడివయ్యా. బతికున్నప్పుడు కూడా ఇంతే అమాయకత్వంతో ఉండేవాడివా లేక చచ్చాక అమాయకత్వం అబ్బిందా "అని  అడిగాడు.
  • బేతాళుడు నవ్వేసి...
  •  "అదిప్పుడెందుకులే నువ్వు సమాధానం చెప్పు" అన్నాడు.
  • విక్రమార్కుడు చెప్పడం మొదలు పెట్టాడు.
  • "బేతాళా  నువ్వు  చెప్పినట్లు తోటపల్లి రిజర్వాయర్  చంద్రబాబు ప్రారంభించాడే కానీ దాన్ని కట్టించింది ఆయన కాదు.2003 లో చంద్రబాబు దానికి శంకుస్థాపన రాయి పాతి చేతులు దులుపుకున్నారు.2004 ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష నేతగా మిగిలారు. అక్కడి నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందులో మొదటి ఆరేళ్లలోనే  అప్పటి ముఖ్యమంత్రి  దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలోనే తోటపల్లికి మోక్షం వచ్చింది.వై.ఎస్.ఆర్. పట్టుదలతో తోటపల్లి నిర్మాణం దగ్గరుండి  చేయించారు. ఇపుడు చంద్రబాబు సిఎం అయ్యాక తాను కట్టని ప్రాజెక్టును ప్రారంభించారు.
  • ఇక  నదుల అనుసంధానం చేశారంటున్నావు. నదుల అనుసంధానం జరగనే లేదు. అసలు పట్టిసీమే పూర్తికాలేదు. అయితే చంద్రబాబు పేరు పేపర్లలో ప్రచారం చేసుకోడానికి ఆదరా బాదరాగా పట్టిసీమ ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టేశారు. నీళ్లు లేకపోవడంతో   వై.ఎస్.రాజశేఖర రెడ్డి నిర్మించిన తాడిపూడి రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించి అవే పట్టిసీమ జలాలుగా మభ్యపెట్టారు. ఇక రైతుల కోసం చంద్రన్న యాత్ర అంటున్నావు.
  • తోటపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవం రోజునే చంద్రబాబు నాయుడు  ఏమన్నారో తెలుసా...వ్యవసాయం ఒక దశ దాటిన తర్వాత లాభదాయకం కాదన్నారు.దాని కన్నా పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. విషయం ఏంటంటే చంద్రన్న యాత్రలో ఇలా ఊరూ వాడా తిరిగి రైతులను  మభ్యపెట్టి లక్షలాది ఎకరాల భూమిని సేకరించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఆ భూములను పరిశ్రమలకు దారాదాత్తం చేస్తారు. దానికి బదులుగా  ముడుపులు అందుకుంటారు.పైకేమో రైతు బంధులా మాట్లాడతారు..లోపలేమో  కార్పొరేట్ పెద్దలకు మేలు చేస్తారు.
  • అందుకే ఇవన్నీ చప్పుడు లేకుండా జరిగిపోవాలంటే ఫేస్ బుక్ లోనూ, టీవీ చానెళ్లలోనూ రైతే రాజు అంటూ ప్రకటనలు గుప్పిస్తుండాలి. అందుకే ఈ హడావుడి అంతా.. ఇదీ చంద్రబాబు అసలు నైజం" అని విక్రమార్కుడు ముగించాడు.
  • బేతాళుడు వెంటనే మాయమై చెట్టుకు వేలాడాడు.
-వీర పిశాచి

తాజా వీడియోలు

Back to Top