ఇదెక్కడి లాజిక్?

 

తప్పుడు ఆరోపణలు చేయడానికి
కాస్తైనా లాజిక్ అక్కర్లేదు కొన్ని పత్రికలకి. అందులోనూ చంద్రబాబు దత్త పుత్రికల్లా పనిచేసే ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మరీను. రెండు రోజులుగా పేపర్లలో
ఫ్రంట్ పేజీలో వైఎస్ భారతి రెడ్డిపై నేరాలు ఆరోపించి, పాఠకులచేత ఔననిపించేందుకు
వాళ్లు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎలాగూ ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్లో చంద్రబాబు, ఇంకా ఈ ప్రతికలకోసమే
ప్రభుత్వ జీతం తీసుకుంటూ పనిచేస్తున్న అధికారులున్నారని బయటపడిపోయింది కనుక, కోర్టుకు సమర్పించడానికి
ముందే ఆ కాగితాల్లో ఉన్న విషయాలను పాఠకుల ముందు పరిచేస్తున్నారు వీళ్లు. అందులో నిజానిజాలేమిటో
న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి తేల్చడానికి ముందే సదరు ఎల్లో పత్రికలు
తమ తీర్పును పాఠకులకు చదివి వినిపించేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పత్రికాధినేతలే సిట్టింగ్ జడ్జీల
స్థానంలో సెటిల్ అయ్యారు మరి.

ఇందులో భారతీ సిమెంట్స్
కేసు విషంలో ఈనాడు వారి పత్రికా విజ్ఞాన ప్రదర్శన ఇలా ఉంది. సిమెంట్ పరిశ్రమపై అవగాహన
లేనప్పటికీ ఛైర్ పర్సన్ హోదాలో వైఎస్ భారతీ భారీగా వేతనం పొందుతున్నారు. కంపెనీ డైరెక్టర్లు, ఛైర్మన్లు అత్యధిక వేతనం
తీసుకోవడానికి ప్రామాణికత ఏమిటో ఈ పేపర్లో వార్త రాసిన వారు వివరంగా రాస్తే బావుండేది. కోట్ల టర్నోవర్ కలిగిన
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 15 కోట్లు జీతం పుచ్చుకుంటారు. ఆయన భార్య నీతా అంబానీ 1.50 కోట్ల జీతం అందుకుంటారు. ఆయన బంధువులే ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్లుగా ఉండి నెలకు 19 కోట్లు పైనే వేతనం పుచ్చుకుంటారు. ప్రతిష్ఠాత్మక టాటా
గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సిఇవో గా గత ఏడాది 30 కోట్ల పారితోషకం అందుకున్నారు. ఇదంతా ఎందుకు ఇంత జ్ఞానాన్ని
ప్రజలకు పంచి పెడుతున్న ఈనాడు అధినేత రామోజీరావు కూడా సంస్థ నుంచి భారీ జీతం అందుకుంటున్న
వారే. ఈయన గారి కోడలు ఏ అనుభవంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ లో మేనేజింగ్ డైరెక్టర్
అయ్యింది? చంద్రబాబు ఏ పాలమ్మిన అనుభవంతో హెరిటేజ్ పెట్టాడు. ఆయన భార్య, కొడుకు లోకేష్ లు ఏ
అనుభవంతో అందులో అత్యున్నత పదవుల్లో ఉన్నారు? వీళ్లంతా ఏ అనుభవం ఉండి తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించారు? ఏ అనుభవం తో అంత జీతం
అందిపుచ్చుకుంటున్నారు? భారతీ రెడ్డి విషయంలో అనుభవం గురించి ప్రశ్న వచ్చినప్పుడు
వీళ్లందరి అనుభవాల గురించి ఎవడైనా ప్రశ్నిస్తాడనే లాజిక్ గుర్తుకు రాలేదా?

తాము చేస్తే సంసారం
ఎదుటివారు చేసేది వేరే అన్నట్టుంది ఈనాడు జర్నలిజం తీరు. జగన్ చెప్పినట్టు రాజకీయాలనే
కాదు ఇలాంటి రాతలు రాసే పత్రికలను చూసి కూడా ఛీ థూ అనాలనిపిస్తోంది!!

 

 

 

Back to Top