డ్రమెటిక్ నారా ట్రిక్

చంద్రబాబు ట్రిక్కులన్నీ ఇన్నీ కావు...కొత్తగా ఆయన ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. బాబ్లీ విషయంలో డ్రామా ఆడవలసిన అవసరం ఆయనకు లేదట. ఇదెలా ఉందంటే కళాకారుల విషయంలో ఓసామెతుంటుంది. కళాకారుడు బాగా నటిస్తున్నాడంటే వాళ్లకి కోపం వస్తుందట. జీవిస్తున్నాడు అంటేనే ఆ పాత్రకు, నటుడికి మర్యాద ఇచ్చినట్టు అని అంటారు. చంద్రబాబు లాంటి కళాకారుడు దేశం మొత్తం మీద ఎక్కడ వెతికినా దొరకుతాడా? ఎంతటి ఆర్టిస్టు కాకపోతే నాడు నందమూరి తారక రామారావు నుంచి నేటి తెలుగు ప్రజల వరకూ అందరినీ ఏకబిగిన తన నటనతో మెప్పించి, ఒప్పించి, ముంచి పడేసాడు. బాబు నటనకు, డ్రామాకు పేరెట్టగలవాళ్లే లేరు. కనుక బాబు చెప్పింది కరెక్టే ఆయనకు డ్రామా ఆడే అవసరం లేదు..ఎందుకంటే కొత్తగా బాబు డ్రామా ఆడాల్సిన పనేముంది...బాబు జీవితమే ఓ పొలిటికల్ డ్రామా అయితేను...
మావ ఎన్టీఆర్ పై పోటీ చేస్తా అనడం డ్రామా అని ఎవ్వరూ అనలేరు. ఎందుకంటే ఆ తర్వాత నిస్సిగ్గుగా వచ్చి మావగారి కాళ్లుపట్టుకుని టిడిపిలో చేరిపోయాడు కనుక.
నక్క వినయాలు నటించి ఎన్టీఆర్ ను ముంచాడు అనలేం ఎందుకంటే నయవంచన చేసి వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి అవమానకరంగా పిల్లనిచ్చి, రాజకీయ జీవితాన్నిచ్చిన మామను తరిమేసాడు కనుక.ఎన్టీఆర్ పేరు చెప్పుకునే ఎన్నికల్లో తిరుగుతాడు అనలేం ఎందుకంటే ఆ ఎన్నికలవ్వగానే పెద్దాయన ఫొటో పీకేసి తన ఫొటు, ఇప్పుడు కొత్తగా తన కొడుకు ఫొటోతో ప్రచారం చేస్తున్నాడు గనక. 600 హామీలిచ్చి గద్దెనెక్కడనలేం ఎందుకంటే ఆ మేనిఫెస్టోనే మాయం చేసేసాడు గనక.
ప్రతిపక్ష పార్టీ నేతలను సంతలో పశువుల్లా కొనడం ఏమిటి అని అనలేం ఎందుకంటే స్వంయగా తానే కేంద్రంలో అమ్ముడుపోయాడు గనుక.
సిగ్గు లేకుండా ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయావేం అనలేం ఎందుకంటే లోపాయకారీ ఒప్పందాలు చేస్కుని కేసులను తొక్కిపెట్టి ఉంచాడు గనక. 
పరిశ్రమలు ఏవి? రుణమాఫీ ఏది? ఉద్యోగాలేవి? పోలవరం ఎక్కడ?  స్మార్ట్ సిటీలెప్పుడు? పోర్టులు ఇంకెంత కాలం? రైల్వేజోన్ సంగతి ఏమిటి? ప్రత్యేక హోదా పరిస్థితి ఏమిటి? అసలు శాసన సభలో ప్రతిపక్షం ఎందుకు లేకుండా పోయింది? ఇలాంటి ప్రశ్నలేం అడగలేం ఎందుకంటే చంద్రబాబు వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్ అంటూ ఒక్కదానికి సరిగ్గా సూటిగా సమాధానం ఇవ్వడు కనుక.
సో...డ్రామా అంటే నాటకం...కానీ బాబుకు నాటకమే జీవితం. కనుక నారావారు డ్రామా చేయాల్సిన పనేలేదు. ఆటోమేటిక్ గా వారి ప్రతి చర్యా డ్రామాగానే ఉంటుంది. గమనించగలరు. 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నటుడు, ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఇక్కడ...కనుక ఎవ్వరూ బాబును నటిస్తున్నావ్...డ్రామా ఆడుతున్నావ్...అనొద్దు..నటుడికి కోపం వస్తుంది...జీవిస్తున్నావ్ అనండి...ఆయన సంతోషిస్తాడు. 
 
Back to Top