ఇప్పుడు కూడా యాక్టింగ్ చేయకు బాబూ

పవన్ కళ్యాణ్ బాబుగోరికి దండాలు. 
అయ్యా తవరేమో ఎక్కడో దూరాన కూకున్నారు.
మరిక్కడేమో మా బతుకులు ఏమీ బాగాలేవండీ బాబూ.
మీరు విన్నారో లేదో తెలీదు కానీ... నిన్నటికి నిన్న  పార్లమెంటులో బిజెపి మంత్రిగోరు ప్రత్యేక హోదా ఇచ్చే బేరం కాదని తేల్చి చెప్పేసేరండీ బాబూ.
తవరేమో ప్రత్యేక హోదా ఇప్పిస్తారని చెబితేనే కదా మేం టిడిపి,బిజెపిలకు ఓటేసింది.
మీరేమో వాళ్లు ఇవ్వకపోతే పెస్నిస్తామని చెప్పారు.
ఇపుడేమో పెస్నించడానికి మీరు ఇక్కడ లేరు. ఎక్కడున్నారో మాకు తెలీదు.
అయినా మీరు కూడా కట్టాల్లో ఉన్నారని మా మేనమామకూడా చెప్పాడనుకోండి.
మీరు ఏక్టింగ్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్  మట్టికొట్టుకుపోయిందట కద.
దాని గురించే డిస్ట్రిబ్యూటర్లూ ..ఎగ్జిబిటర్లూ మిమ్మల్ని పెస్నిస్తున్నారని మా మేన మామ చెప్పాడు.ఇక మీరు మా గురించి ఏం పెస్నిస్తారులేనని ఆగాం కానీ..ఇహ లాభనేందు గురూగోరు.
మీరో పాలి బయటకు రావల్సిందే. సెందరబాబుగోరిని..ఎనకయ్య నాయుడిగోరినీ  మీరు కాలరు పట్టుకుని పెస్నించాల్సిందే గురూగోరూ.
అయినా ప్రత్యేక హోదా ఇసయం ఏటండీ బాబూ ..మొదట్నుంచీ గందరగోలవే.
పార్లమెంటులో అపుడేమో కాంగిరేసోళ్లు అయిదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు.
వెనకయ్యనాయుడుగోరు పంచీ సదురు కుని అయిదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్నారు.
మీ సెందరబాబుగోరేమో పదేళ్లెక్కడ సరిపోతాది...పదిహేనేళ్లియ్యండన్నారు.
ఇద్దరూ కలిసి ఏపీకోసం బాగా ఆలోచిత్తన్నారేమోనని మేం అనుకున్నాం.
దానికి తోడు మీరేమో టిడిపి-బిజెపికి ఓటెయ్యండంటూ మా చెవిలో గూడు కట్టుకుని మరీ పెచారం చేశారాయె.
ఇపుడు చూడండి. ఇద్దరూ అధికారంలోకి వచ్చారు.రెండేళ్లు దాటిపోయింది.
మొన్నటికి మొన్నయితే  ఇదే సెందరబాబుగోరు అసలు ప్రత్యేక హోదా వస్తే ఎంత..రాకపోతే ఎంత? అదేవన్నా సంజీవనా ఏటి అని లా పాయింటు లేవదీశారు.
ఎనకయ్య నాయుడేమో కాంగిరేసోళ్లు రాట్రాన్ని విడగొట్టారు కాబట్టి  ప్రత్యేక హోదా వాళ్లే ఇవ్వాలంటున్నారు.
నాకు తెల్వదు కానీ  కళ్యాన్ బాబూ... పెద్ద పెద్ద నాయకులు కూడా ఇంత సిల్లరి సిల్లరిగా మాట్లాడితే ఎట్టాగండీ బాబూ. మీరైనా ఆ నాయుడు బాబులను నిలదీత్తారా లేక మీరు కూడా వాళ్లలాగే సిల్లరిగా మిగిలిపోతారా?
ఏదో ఒకటి తేల్చి చెప్పు బాబూ.
ఒకటి గుర్తుంచుకో బాబూ.
మీరు సినిమాల్లో శానా మందిని కాపాడినట్లు చూపిస్తారు.
మామూలు జీవితంలో కూడా  అలా కాపాడతారా లేక అంతా ఏక్టింగేనా?
మాకు మీ ఏక్టింగ్ అంటే చాలా ఇట్టం బాబూ.
అందుకే మీరు చెబితే కాదనకుండా టిడిపి-బిజెపిలకు ఓటేశాం.
ఆ పార్టీలు రెండూ మమ్మల్ని ముంచాయి.
మీరు కూడా వాళ్లతో కలిసిపోనారనుకోండి.. మీ ఏక్టింగ్ ఇంకా బాగుందని  ఓ దండం పెట్టి ఊరుకుంటాం.ఇహ జీవితంలో మిమ్మల్ని అది చేయి..ఇది చేయి బాబూ అని ఇసిగించం.
ఆలోచించుకుని పెస్నించు బాబూ.
పెస్నించిన తర్వాత ఆలోచించడానికేవీ ఉండదు మరి.
మరుంటా బాబూ.
Back to Top