నాణేనికిరెండువైపులు


విక్రమార్కుడు చాలా చికాగ్గా ఉన్నాడు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను రెప్ప వాల్చకుండా చూసిన విక్రమార్కుడు చాలా అసహనంగా ఉన్నాడు.  చాలా కోపంగా  ఉంది.  కోపాన్ని తమాయించుకుని శవం కోసం చెట్టు వైపు నడుస్తున్నాడు.  విక్రమార్కుని అల్లంత దూరం నుంచే గమనించిన భేతాళుడు  " ఏంవిక్రమార్కా? ఏమైందేంటి?  ఎందుకంత చికాగ్గా న్నావు  ఏంటీవీలో  సీరియస్సీరియల్ ఏమైన్నా చూశావా? " అని భేతాళుడు వెటకారంగా నవ్వాడు.

విక్రమార్కుడి కోపం రెట్టింపైంది.  ఉక్రోషం వచ్చింది. "సీరియల్లా...చింతకాయా చాలా అసియ్యంగా ఉంది భేతాళా"అన్నాడు విక్రమార్కుడు.

భేతాళుడికి జాలేసింది."అసలేం జరిగిందో చెప్పు విక్రమార్కా" అన్నాడు భేతాళుడు.

"పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చూశావా భేతాళా" అని అడిగాడు విక్రమార్కుడు.

"స్మశానాల్లో టీవీలుండవు కదా. కొంతకాలం పోతే అవీ వస్తాయేమో ఎవరు చెప్పగలరు. అది సరే కానీ పార్లమెంటు సమావేశాల్లో ఏంజరిగిందేంటి? " అని ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.

ఇంచుమించు  మూడువారాల పాటు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. కానీ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా సమావేశాలు సజావుగా సాగలేదు.

ఆరోపణలు చేసిన కాంగ్రెస్రోజూ సభలోగందరగోళం సృష్టించి సభను జరగనివ్వలేదు. పోనీ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానాలు చెప్పి సభను నడిపించుకోలేదు.పాలకపక్షం..ప్రతిపక్షంకలిసిస్కూల్లోమాస్టారులేనిక్లాస్రూమ్లోపిల్లల్లాఅల్లరిచేసిసమావేశాలనునీరుగార్చారు.సమావేశాలనిర్వహణకుకోట్లాదిరూపాయలుఖర్చుచేస్తున్నారు. ఆడబ్బు ఎక్కడిది? మనదే.  మనంకట్టే పన్నులతోనే ఆఖర్చులన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్..బిజెపిలు  రెండూకలిసి ప్రజలడబ్బుతో తమరాజకీయఆట ఆడుకుంటున్నాయి అదిచూసే చాలా చికాకేసింది" అన్నాడు విక్రమార్కుడు ఆయాసపడుతూ.

 

భేతాళుడు నవ్వాడు.సరేఅయితే ఈరోజుకథ కూడా దీనికిసంబంధించిందే చెబుతాను. సావధానంగా కథవిని నేనడిగినప్రశ్నకు సమాధానంచెప్పు అనికథచెప్పడం మొదలుపెట్టాడు.

"విక్రమార్కా ఎన్డీయేప్రభుత్వం  2014 లోఅధికారంలోకి రాకముందు  కేంద్రంలోయూపీయే ప్రభుత్వం ఉండేది.  దానికి మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధాని .ఆయనహయాంలో అప్పటిప్రభుత్వం సరుకులసేవాపన్ను బిల్లును రూపొందించి సభలో ప్రవేశపెట్టింది.  అదేజిఎస్టి   బిల్లన్నమాట.  అప్పుడు ఈబిల్లు ప్రజావ్యతిరేకమైనదని చెప్పి బిజెపి అడ్డుకుంది.  అప్పుడుఈబిల్లు దేశానికి..రాష్ట్రాలకీ చాలామంచిదని కాంగ్రెస్చెప్తే.. బిజెపి ఒప్పుకోలేదు. ఇపుడుబిజెపి ఈబిల్లువల్ల రాష్ట్రాలకు చాలాలాభం జరుగుతుందని చెప్తోంటే ..దానికి మద్దతు ఇవ్వలేమని కాంగ్రెస్చేతులెత్తేసింది."  ఇదీకథ. ఇపుడు చెప్పు విక్రమార్కా" ఒకేబిల్లు విషయంలో రెండు పార్టీలు..రెండు సందర్భాల్లో రెండురకాలుగా ఎందుకు స్పందించాయి?

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపికి జిఎస్టిబిల్లు ఎందుకు చెడ్డదనిపించింది?  ఇపుడు అదే బిజెపికి  మంచిది ఎందుకైంది?

అధికారంలోఉన్నప్పుడు మంచిదిగాకనిపించిన ఈబిల్లు కాంగ్రెస్కు ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు చెడ్డదైపోయింది? ఈప్రశ్నలకు సమాధానాలు తెలిసీకూడా చెప్పలేకపోయావా నీతల రెండువేల చెక్కలయ్యేలాంటి  టీవీసీరియల్నినీకు బలవంతంగా చూపించాల్సి వస్తుంది" అని భేతాళుడు బెదిరించాడు.

విక్రమార్కుడు ఒక్కక్షణం వణికిపోయి అంతపని చేయద్దు సమాధానం చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.

"భేతాళా కాంగ్రెస్..బిజెపిలు అందరూ అనుకుంటోన్నట్లు రెండు  భిన్నమైనపార్టీలేం కావు. నాణేనికి అవి రెండు వైపులు అంతే. 

ఇపుడు సేమ్అదేదుగ్ఢతో కాంగ్రెస్కూడా ఆబిల్లును అడ్డుకుంటామని ముందుకొచ్చింది. ఇందులో మనం బుర్రలు బద్దలుకొట్టుకోడానికి ఏమీలేదు" అని చెప్పాడు.

విక్రమార్కుని  సమాధానం నచ్చగానే భేతాళుడు అమాంతం మాయమై చెట్టుకు వేలాడాడు.

-వీరపిశాచి

---------------------------

 

 

 

తాజా వీడియోలు

Back to Top