డిజిటల్ మాయ

చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడు.
భవష్యత్తంతా డిజిటల్ మయం. అంతా కార్డులే తప్ప డబ్బులుండవు. కంప్యూటర్లే మనల్ని నడిపిస్తాయి. ఇ పోస్, రూపే, చొపే, టోపే ఇలా అన్నీ కార్డులే అన్నాడు బాబు
ఈ పేర్లు మేమెప్పుడూ వినలేదు సార్ అన్నారు విలేకరులు
మనం ఆన్ లైన్ లో లేకపోతే వెనుకబడినట్టే
క్యూలైన్లో నిలబడ్డానికే టైం లేదు సార్
ప్రతి దానికి యాప్స్ వున్నాయి. మనం చేయాల్సిందల్లా డవున్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకి రైతుల కోసం దివాళాయాప్ తయారుచేసాం. విత్తనాలు, ఎరువులు, పురుగులు, మందులు అన్నీ ఈ యాప్ ద్వారా కొనుక్కోవచ్చు అన్నాడు బాబు
మరి పండించిన పంటని కూడా ఆన్ లైన్ లోనే అమ్ముకోవచ్చా సార్ అని అడిగారు విలేకరులు
అది కుదరదు. ఎందుకంటే రైతు అమాయకుడు, అందరూ మోసం చేస్తారు. దళారీ ద్వారా అమ్ముకుంటేనే న్యాయం జరుగుతుంది.
అంటే రైతు రోడ్డుమీద పడితే తప్ప పంట అమ్ముకోలేడు అంతేకదా
అంతే, రైతు ఆన్ లైన్ లో వ్యవసాయం చేసి పుట్ పాత్ మీద అమ్ముకోవాలి. అప్పుడే వ్యాపారస్తులు బాగుపడేది. వాళ్లు బాగుంటే మాకు విరాళాలిస్తారు. ఆ డబ్బుని మళ్లీ మేము జనాలకి పంచుతాం. జనం డబ్బు జనం దగ్గరకే
రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలంటే గైడ్ చేసే యాప్స్ వున్నాయి సార్
అవి కూడా ఉన్నాయి. పురుగుల మదు తాగాలంటే, ఏది తాగితే వెంటనే ప్రాణం పోతుందో చెప్పే యాప్స్ వున్నాయి
వురితాడు కావాలంటే డోర్ డెలివరీ వుంటుందా సార్
ఎంతమందం కావాలో ఇండెంట్ పెడితే హాల్ సేల్ గా గవర్నమెంటే సప్లయి చేస్తుంది
రైతుల కోసం మీరు బాగా పాటుపడతారని గతంలోనే మాకు తెలుసు. రైతులకి ఇంకా ఏమేం చేయబోతున్నారు
రైతులు తమ దగ్గరున్న డబ్బుల్ని డిజిటల్ వాలెట్స్ లో నింపితే, వాళ్ల చేతిలోని స్మార్ట్ ఫోన్ బ్యాంకుగా మారుతోంది.
పైసా డబ్బు లేక అలమటిస్తుంటే నెట్ బ్యాంకింగ్ ఎలా చేస్తారు సార్
నా దగ్గర డబ్బుంది. మా మంత్రుల దగ్గర డబ్బుంది. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బుంది మరి రైతుల దగ్గర ఎందుకు లేదు?
మీరు కడుపు నిండిన మాటలు మాట్లాడుతున్నారు. వెనుకటికి ఫ్రెంచ్ మహారాణి ఆకలయితే పస్తులుండడం దేనికి?
బ్రెడ్డు బిస్కట్లు తినొచ్చు కదా అని అడిగింది.
అలాగే మీరు పేద రైతులకి ఆన్ లైన్ బ్యాంకింగ్ గురించి చెబుతున్నారు.
ఆ రైతుని గిలెటిన్ యంత్రం కింద తలనరికారు. ఇది ప్రజాస్వామ్యం కదా. వచ్చే ఎన్నికల వరకూ జనం ఎదురుచూస్తున్నారు అన్నారు విలేకరులు

Back to Top