గజినీ నాటకం

ఏమ్రా గజనీ చీటికీ మాటికీ అన్నీ మర్చిపోతున్నావంట
అవును నాకున్న జబ్బే అది కదా. 
అయితే మాత్రం నిన్న మొన్న జరిగినవి కూడా మర్చిపోతావా?
పోతా?
నెత్తిమీద వేసిన మొట్టికాయలు మర్చిపోతావా?
పోతా.
అయితే మట్టిగొట్టుకుపోతావ్?
నన్నెందుకయ్య అంతగా గసురుతావ్… మన డిప్యూటీ సిఎమ్ అంతటోడే అన్నీ మర్చిపోతా ఉంటే…నా మరుపు ఓ లెక్కా జమా…?
డిప్యూటీ సిఎమ్ ఏమ్ మర్చాడ్రా.
జగన్ ప్రజల కోసం ఏం పోరాటం చేసాడు అని అడగలా? అరె… ఆ పెద్దాయన పోయింది సంది జగన్ చేస్తున్నవే పోరాటలు గందా...! అట్టెట్టా అంటడు?
అది మరపు కాదురా దడుపు?
దడుపా….!!!!???
అవునెహె…
రైతులకు రుణమాఫీ, మద్దతుధరల గురించి దీక్ష చేయడం ఆ పెద్దాయన మర్చిపోయాడనుకున్నావా?
మరి…
గుర్తుందని చెబితే రుణమాఫీ ఎందుకు చేయలేదు అని రైతులు అడుగుతారు గందా..?
అట్టనా..!?
ప్రత్యేక హోదా కోసం ఆయన ప్రాణాలు పణంగా పెట్టి దీక్షచేసిన సంగతి యాద లేదంటే నమ్మినవా నువ్వు..!
ఆ… మీడియా ముందే అన్నడు మరి. జగన్ పోరాటాలు ఏమి జేసిండు? అని…
అరె మంచిగున్నవు నువ్వు… పోరాటం చేసింది గుర్తుంటే, ఆనాడు వైజాగ్ ఎయిర్ పోర్టులో కాలు బటయపెట్టకుండా అన్యాయంగా ఆపిన మాట ఒప్పుకోవల్నా వద్దా..?
ఆ… సముజైతాంది…
ఇక ఎక్కడ ఎవరికి ఏ కట్టమొచ్చినా ఎంటనే ఎల్లి.. ఆల్లకు ధైర్యం జెప్పి, న్యాయం చేయాలని పెబుత్వాన్ని గట్టిగా ఎడా పెడా కడిగేసిన సంగతి ఆయనకు, ఆ పార్టీవోల్లకు మతికుండదంటే ఎట్టా నమ్మినవబ్బానువ్వు..!?
మరే…
ఇవన్నీ జగన్ చేస్తుండాడని ఒప్పుకుంటే… మేమెక్కడికీ ఎల్లలేదు.. పెజల్ని ఎంత కట్టమొచ్చినా పట్టించుకోనేదని పెపంచకం ముందు ఒప్పేసుకున్నట్టే గదా!
ఎట్టెట్టా..!? 
అట్టే మరి… జగన్ పెజలకోసం ఏ పోరాటాలూ చేయట్లేదు, జగన్ ఎల్లిన చోటకి జనమే రావట్లేదు, అసలు ఈ జనానికి జగన్ అంటేనే తెలియదు అని అనుకుంటే తప్ప ఆ టిడిపివోల్ల పొద్దు గడవట్లా… అందుకే ఈ మతిమరపు నాటకం. 


Back to Top