దెబ్బకు ఠా దెయ్యాల ముఠా

అబ్బి : అరె సుబ్బి ఏందిరా పదిరోజుల బట్టి కనబడకుండా పోయావ్. ఊళ్లోగానీ లేవేటి?
సుబ్బి : ఎహే కాదురా ఇంటోనే ఉన్నా. మా బాగా బుజీగున్నాలే.
అబ్బి : అంత బుజీగా ఇంటో కూసోనేంసేత్తున్నావ్ రా.  
సుబ్బి : నాటకం సూత్తున్నారా. నాటకం. మా బాగుందిలే. 
అబ్బి : ఇంటో నాటకమా…అదేమిటిరోయ్.
సుబ్బి : అదేరా నంద్యాల ఎన్నికలు జరుగుతున్నాయి గదా. రోజూ టివిలో చూపిస్తున్నారు గందా. సినిమాలో ఎన్టీఓడిని మించి నద్యాలతో నాటకమాడతా ఉన్న చంద్రబాబును చూస్తున్నా. ఎన్నికలొచ్చినప్పుడే గదా మరి బాబు యాక్షన్ బైటపడేది. మిగిలిన దినాల్లో ఆయన ముఖం గూడా జనాలు నేరుగా చూడలేరాయే. 
అబ్బి : అవున్రోయ్. అయితే సింగపూరు కాతే అమరావతి తప్ప ఇంకెక్కడా కనబడ్డు గదా బాబు. ఇంతకీ ఇన్నిరోజులుగా నువు చూస్తున్న నాటకమేంటి?
సుబ్బి : దొంగతనం జేసిన దొంగే లగెత్తుతూ దొంగ దొంగా అనడం నువు జూసేవేంట్రీ అబ్బి.
అబ్బి : లేదురా..
సుబ్బి : అదే నాటకం ఇప్పుడు నంద్యాల్లో ఆడుతున్నాడ్రా బాబు. ఏమాటకామేటే చెప్పాలగానీ మా బాగా ఆడుతున్నాడ్లే. 
అబ్బి : అలాగా…
సుబ్బి : అలాగే మరి. దొంగ సర్వేలు జేయించడానికి కాలేజీ కుర్రోళ్లను దింపాడు. ఆళ్లని పట్టుకుని పోలీసులకాడికి తీసుకుపోతే, మా వోళ్లని కిడ్నాపు సేసినారు వైయస్సార్సీపీ ఓళ్లని ఎదురు కేసులు బనాయించాడు, వైయస్సార్సీపీ అంటే ఇష్టం ఉన్న వాళ్ల ఇళ్లు, షాపులు మీద దాడులు సేయించి, ఎలచ్చన్ కమీషనోల్లకు ఉల్టా పితూరీలు సెప్పించాడు. ఊరంతా లచ్చలు, కోట్లు పంచుతున్నాడు. తన వియ్యంకుడు బాలకృష్ణతో అయితే పబ్లిగ్గానే డబ్బులు పంచిపెట్టించాడు. అడిగితే… అబ్బే మేం కాదు ఆ పంచుతుందంతా వైఎస్సార్ సిపి వోళ్లే అన్నాడు.
అబ్బి : అరె అంతలేసి ఆబద్ధం ఎలా ఆడతార్రా. పేపర్లో ఫొటోలు కనిపిస్తున్నాయి గందా…పంచుతోంది, ముంచుతోంది ఎవరో అని. 
సుబ్బి : అదే మరి నాటకం అంటే. ఎలచ్చన్ స్టేజంటూ ఎక్కాక నాటకంలో బాబుగారి డైలాగులు ఇలాగే ఉంటాయి మరి. నిజం ఎలా జరుగుతున్నా సరే అబద్ధం అలా ఆడుకుంటూ పోడమే బాబు పెసాలిటీ. 
అబ్బి : అంతేనంటావా…
సుబ్బి : అంతేనా అంటావేంట్రా ఎర్రిమాలోకమా…ఇంకా సానా ఉంది నాటకం. ఇంకా రసవత్తర ఘట్టం రానిదే కంగారడిపోతావే. చెప్తాను ఇను.
అబ్బి : ఇంకా ఉందా… అయితే సెప్పు.
సుబ్బి : బాబు ఏస్తున్న ఏషాల గురించి జనాలకి చెబుతూ, ఇంటింటికీ తిరుగుతున్నాడు జగన్. ఆయన ఏ సందులోకెళ్లినా, ఏ ఈధిలోకెళ్లినా జనాలు పోగడిపోతున్నారు. జగనో జగనన్నో అంటూ అరుపులు, కేకలనుకో. మేడలమీద, మిద్దెలమీద, చెట్లమీదగూడ ఎక్కేసి జగన్ చెప్పేవన్నీ ఇంటన్నారు. ఇది సూసి చంద్రబాబుకు సిర్రెత్తుకొచ్చింది. ఎక్కేసి ఏం సేసేసాడో తెల్సా. ఛ…ఛ.. ఛ.. నే పుట్నాక ఇలాగైందనెప్పుడూ ఇన్లా. అసలు నే పుట్టకముందైనా అలా జరిగుండ్లా. 
అబ్బి : ఏం జరిగింద్రా.
సుబ్బి : జగన్ ఎక్కడ ఎక్కడ పెచారం చేస్తున్నాడో ఆ చోట్ల ఉండే జనాల్ని తీసుకుపోయి బందెల దొడ్లో పశుల్ని కట్టేసినట్టు మసీదుల్లో, దర్గాల్లో పెట్టేసి తాళాలేపించేసాడు. ఊళ్లల్లో ఉన్న జనాల్నైతే ఆడ్నించి ఇంకేడకో లారీల్లో తీసకపోయి, బిరియానీ పెట్టి తలకింత డబ్బులిచ్చి మర్నాడు ఇడిసిపెడతన్నాడు. 
అబ్బి : ఇంత అన్నాయమే…
సుబ్బి : అన్నాయం అంటావేంద్రా ఎర్రిబాగులోడా. నాటకం ఎహె. కాని ఇదంతా సూత్తుంటే నాకో విషయంలో సిన్న అనుమానవస్తా ఉంద్రా. 
అబ్బి : నాగ్గూడా రా. అసలా జనాలు అలా ఎల్టాకి ఎలా ఒప్పుకున్నారని… అంతేగదూ.
సుబ్బి : అవున్రా… కరెస్టుగా పట్టేశావ్… 
అబ్బి : ఉప్పుడు నేను సెప్తా సూడు ఆ విషయం. జగన్ మొన్నెట్టిన సభలో చెప్పాడు గందా. మన డబ్బు దోచుకుని బాబు మళ్లీ ఆటిలోంచే కొంత మీకిచ్చి ఓటేయమంటాడని, ఆ విషయాన్ని నెందాలోళ్లు బాగా అర్థం సేసేసుకున్నార్రా. జగన్ ఏం చాప్పాడో అచ్చం అట్టాగే సేస్తున్నారు. ఎంచక్కా బాబు చెప్పినట్టు ఎళ్లి డబ్బుచ్చుకుని, పెట్టింది తిని, నీడపట్టున రోజంతా కూకుని, బాబు చెంచాగాళ్లతో అదిగావాల, ఇదిగావాల అని తెప్పించుకుని, ఊరికి రోడ్లేయించుకుని, ఇంకేమేం గావాల్నో అన్నీ శాంఛన్ చేయించుకుని ఇంటికి చేరతన్నారు. వైసిపి గనక పోటీ పెట్టుండకపోతే ఇయన్నీ వచ్చేవి గాదుగదా అనుకున్నారు. ఇన్నాళ్లుగా పట్టించుకోని చెంద్రబాబు ఇవాళ అళ్లేదడిగితే అది సేత్తాడని ఆళ్లకీ బాగా అర్థం అయింది. జగన్ చెప్పినట్టు దెయ్యాల దగ్గర లౌక్కెంగా ఉండటం ఆళ్లు బాగా వంటపట్టించుకున్నారెహె. అన్నీ అయిన సంది ఎలక్షన్లో ఇస్తారు చూడు నా సామిరంగా. జగన్ సెప్పినట్టే సేస్తున్నార్రా ఆళ్లు. 
సుబ్బి : అవున్రోయ్. నువ్వంటంటే ఉప్పుడుప్పుడే అర్థం అవుతాంది నాగ్గూడా. లేకపోతే అలా ఎందుకు సేత్తన్నారా అనుకున్నా. మా బాగా సేత్తన్నార్రా. నాటకానికి నాటకంతోనే దెబ్బేత్తన్నారన్నమాట. ఎట్టైనా నంద్యాలోళ్లు మా గట్టోళ్లురై. మనక్కూడా ఆ ఛాన్సెప్పుడొస్తుందోరా.
అబ్బి : తొందరపడకూ 2019 దగ్గర్లోనే ఉంది. దానికంటే ముందు మన కాకినాడ ఎలచ్చన్లు కూడా వచ్చేసినాయి గంద. మా అల్లుడు అక్కడే ఉన్నాడు. నిన్నే ఫోను జేసి సెప్పాడు. మా మంచి కాండేట్లు ఉండారంట వైయస్సార్ సిపికి. అక్కడ గూడా గెలిచేది జగన్ పార్టీయే నంట. 
సుబ్బి : అంటే దెబ్బకు ఠా టిడిపి ముఠా అన్నమాట.
అబ్బి : కాదు కాదు… దెబ్బకు ఠా దెయ్యాల ముఠా!. 
సుబ్బి : మా బాగా సెప్పినావ్… సర్లే మరి నే ఇంటికి పోతున్నా. నంద్యాల లో ఇంకా ఏం నాటకం నడుస్తోందో సూడాలిగా.
అబ్బి : కానీ మరి. మళ్లీ కలుద్దాం. 

 

తాజా ఫోటోలు

Back to Top