డాష్ బోర్డ్ నిజాలు...డాష్ ... డాష్


అన్నీ నాకు కనిపిస్తాయి అంటారు చంద్రబాబు...
ఎలా అంటే నా దగ్గర డాష్ బోర్డు ఉంది అంటారు.
ఉంటే మాత్రం అదేమన్నా మాయా దర్పణమా? ఎక్కడున్నవన్నీ కనిపించడానికి...
అవును మాయా దర్పణమే బాబుగారికి కావాల్సినవి కనిపిస్తాయి..వద్దన్నవి మాయం అయిపోతాయి...
అదే డాష్ బోర్డు మహత్యం మరి...
అమరావతి అభివృద్ధి కోసం అప్పివ్వండి మహాప్రభో అని ఇలా జోలె పట్టగానే అలా 2000 కోట్ల రూపాయిలు వచ్చి పడ్డాయని చంకలు గుద్దుకుంటున్నారు బాబు అండ్ కో వారు. 
ఈ సొమ్మేం ఆకాశంలోచి రాలిపడలేదు, చెట్లకు కాయలుగా కాసి ఒళ్లో పడలేదు...
మరి ఎవరిచ్చారు? 
అన్ని విషయాలూ చెప్పే మీ డాష్ బోర్డును అడిగి చెప్పండి అంటే ఆ వివరాలు ఇందులో లేవు అన్నార్ట ముఖ్యమంత్రి గారు. 
అదేమిటి రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా మీకు ఆ బోర్డు లోనే తెలిసిపోతుందట కదా అని మనబోటి ఆఫ్ నాలెడ్జ్ గాళ్లు అడిగామనుకోండి....
రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా నాకు తెలుస్తుంది అన్నాను కానీ..మూల మూలల్లో నేను చేసేది మీకు తెలుస్తుందని నేను అన్నానా? అని అంతెత్తున లేస్తున్నారు బాబుగారు. 
ఇంతకీ అమరావతి బాండ్లను ఆవురావురుమంటూ కొన్నవాల్లెవరయ్యా అంటే ఆన్సర్ మాత్రం ఇవ్వడం లేదు బాబు గారు అండ్ హిజ్ వన్ అండ్ వోన్లీ మాయా డాష్ బోర్డ్...
ప్రైవేటు సంస్థలు వ్యక్తుల నుంచి ఎక్కువ వడ్డీకి అప్పులు తెస్తూ, పబ్లిక్ ఇష్యూ అంటూ ప్రచారం ఎందుకు చేసారు ముఖ్యమంత్రి గారూ అన్నా బాబుగారు నోరుమెదపడం లేదు.
లక్ష రూపాయిల అప్పు ఇస్తేనే ఎట్టా తీరుస్తారని అడిగే రోజులివి...అల్లాంటిది లోటు బడ్జెట్ తో, అప్పుల పాలై ఉన్న రాష్ట్రానికి అంతలేసి అప్పిచ్చిన ఆ అపర కుబేరులెవరా అని ఆరా తీస్తుంటే స్టాక్ ఎక్సేంజ్ ని అడగండి అంటున్నార్ట తెలుగు తమ్ముళ్లు..
అక్కడైనా సమాధానం ఉంటుందా అంటే ఉండదు? చివరకు ఇదంతా చీమా చీమా ఎందుకు కుట్టావ్ కథ అవుతుంది.
అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థ అమరావతి కోసం అప్పెందుకిచ్చుంటుంది?
ఎంత ప్రభుత్వం గారెంటీ ఇచ్చినా, అప్పులపాలైన రాష్ట్రం అధిక వడ్డీకి పుచ్చుకున్న రుణం ఎలా తీరుస్తుంది?
గొప్ప ఆదాయ వనరులే లేని ఏపీసీఆర్డీఎకు 2000 కోట్లు ఇచ్చి ఎలా రాబట్టుకోగలననుకుంటోంది?
బాబుగారి బినామీలు, తెలుగు తమ్ముళ్లే తలో చేయి వేసి సొమ్మే అమరావతి బాండ్లా?
అధిక వడ్డీతో ఆ సొమ్ము తిరిగి తిరిగి వారి జేబుల్లోకే చేరనుందా??
వీటన్నిటికీ సమాధానం డాష్ బోర్డు లో ఉన్నదా లేదా? ఆంధ్రులారా... నిజాలేమిటో అడగండి మరి....!!!

 

 
Back to Top