చదువుకునే కుర్రాళ్లకి బొత్తిగా మంచీ మర్యాద లేకుండా పోతున్నాయి.నెల్లూరులో విద్యార్దులు ఒక పద్ధతీ పాడు లేకుండా వ్యవహరించి పాపం..నారా లోకేష్ బాబుని నానా అవస్థలూ పెట్టారు. ఏదో కుర్రాళ్లతో ఇష్ఠాగోష్ఠి నిర్వహించి వార్తల్లో మెరిసిపోదామని లోకేష్ బాబు అనుకున్నారు. నాన్నగారికి బాగా నమ్మకస్థుడు..మంత్రి అయిన నారాయణకు చెందిన కాలేజీని అందుకు ఎంచుకున్నారు లోకేష్. తీరా విద్యార్ధులతో ముచ్చట మొదలు కాగానే..ఓ విద్యార్ధి లేచి...ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి పై ఎందుకు యాక్షన్ తీసుకోలేదో చెప్పండని అడిగేశాడు. దానికి పాపం లోకేష్ బాబు ఏం సమాధానం చెబుతారు? ఆ ప్రశ్న చంద్రబాబునాయుణ్ని అడగాలి. పార్టీ పరంగా ఎందుకు యాక్షన్ తీసుకోలేదో చంద్రబాబునే నిలదీయాలి. అంతే కానీ లోకేష్ బాబుకు ఏం సబంధం? లోకేష్ బాబు ఇపుడిపుడే నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు సాగుతన్నారు. అయినా అసలు రేవంత్ రెడ్డి చేసిన తప్పు ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. టిడిపి అభ్యర్ధికి బలం లేకపోయినా గెలిపించుకోవాలి. అందుకే ఓ ఎమ్మెల్సీని కొందామనుకున్నారు. దానికోసమే బేరసారాలాడారు. బాస్..చంద్రబాబు తో డీల్ ఓకే చేయించాక..యాభై లక్షలు తెచ్చి ఇచ్చారు. అంతా రహస్యంగా జరిగిపోతోన్న ఈ అవినీతిని ఏసీబీ వారు దొంగచాటుగా కెమెరా పెట్టి షూట్ చేశారు. అందుకే రేవంత్ రెడ్డి తెలుసుకోలేక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇందులో తప్పేమన్నా ఉందీ అంటే అది ఏసీబీదే. ఏసీబీవాళ్లకి దమ్ము..ధైర్యం ఉంటే ఎదురుగా నిలబడి షూట్ చేయాలి తప్ప ..వెనుక నుంచి కాదు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు నాయుడు కేసీఆర్ పైనా..వ్యవస్థపైనా అగ్గి ఫైరైపోయారు. అది వేరే విషయం అనుకోండి.ఈ విషయాలేవీ తెలీని నారాయణ కాలేజీ కుర్రాడు మాత్రం లోకేష్ బాబును అడక్కూడని ప్రశ్న అడిగి చాలా చికాకు తెప్పించాడు. లోకేష్ బాబు స్థానంలో ఇంకెవరన్నా ఉండి ఉంటే సిగ్గుతో చచ్చిపోయేవారే..కానీ లోకేష్ బాబు కాబట్టి...ధైర్యంగా ..సిగ్గుపడకుండా..తమాయించుకుని నిలబడగలిగారు.ఇంకో విద్యార్ధి లేచి పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ మోదీకి లేఖ రాసింది చంద్రబాబేనట కదా అని అడిగారు.దానికి లోకేష్ బాబు సగర్వంగా అవునని చెప్పారు. మరి ఆ సేత్తోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ఓ లేఖ రాయచ్చు కదా అని ఆ విద్యార్ధి అడిగేశాడు. పాపం లోకేష్ బాబుకు ఏం చెప్పాలో తోచలేదు. కొంత సేపు ఆలోచించాక.... హోదా కోసం కేంద్రంతో పోరాడితే మనకే నష్టం కదా అని సెలవిచ్చారు. కుర్రాళ్లు అక్కడితో ఆగలేదు. అమరావతి లో రాజధాని నిర్మాణం అంతా పెద్దలకు లాభం తెచ్చేలాగే చేస్తున్నారటగా అని మరో కుర్రాడు నిలదీసేసరికి లోకేష్ బాబుకు ముచ్చెమటలు పట్టాయి. కర్చీఫ్ తో మొహం తుడుచుకుని లేదండీ...రాజధాని నగరం అందరికోసం కడుతున్నాం అన్నారు.విద్యార్ధులతో హుషారుగా చాలా సేపు మాట్లాడాలని లోకేష్ బాబు వస్తే..విద్యార్ధులంతా చంద్రబాబు చేసిన తప్పులనూ..టిడిపి నేతల అవినీతిని నిలదీసేసరికి లోకేష్ బాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడింది.ఎక్కువ సేపు అక్కడే ఉంటే పరువుపోతుందని లోకేష్ బాబు....కుర్రాళ్ల దగ్గర సెలవు తీసుకుని పరుగో పరుగు.ఇంటికి వెళ్లేసరికి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్నారు.లోకేష్ ని చూడగానే ఏంట్రా ఎలా జరిగింది స్టూడెంట్స్ తో డిస్కో బాగా జరిగిందా? అని అడిగారు.లోకేష్ హుషారుగా నవ్వుతూ అదిరిపోయింది నాన్నా.పెద్ద నోట్లు రద్దు చేయమని మోదీకి సలహా ఇచ్చింది నువ్వే అని అందరికీ చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు అని లోకేష్ గర్వంగా చెప్పాడు.దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఏంటీ నోట్ల రద్దు నిర్ణయం నా ఆలోచన అని చెప్పావా? అని కంగారుగా అడిగారు.దానికి లోకేష్ "అవును నాన్నారూ..మీరే కదా మోదీగారికి లేఖరాశానని మొన్న ఎప్పుడో చెప్పారు. అదే నేను చెప్పాను " అన్నాడు లోకేష్.ఒరేయ్ నువ్వు కొంపలంటించేస్తావురా. నోట్ల రద్దు మన ఆలోచన అని తెలిస్తే..ఇపుడు రాష్ట్రంలో నగదు మార్చుకునేందుకు క్యూలలో ఉన్నవాళ్లంతా మనల్ని తరిమికొడతారు.ఇంకెక్కడా అలా చెప్పకు.అది మోదీగారి ఆలోచనే. మనకేం సంబంధం లేదు.తెలిసిందా" అని గట్టిగా అరిచారు చంద్రబాబు.లోకేష్ బాబు మొహం మాడిపోయింది.ఇదేంటి మొన్నేమో అలా చెప్పారు.ఇపుడేమో ఇలా అంటున్నారు అని అయోమయంలో..ఆలోచిస్తూ ఉండిపోయారు లోకేష్.....................................-కవికాకి--------------------<br/>