నక్క వాతలు కాపీ కూతలు

అనగనగా ఓ నక్క కథ అందరికీ తెలుసు...అడవిలో పులిలా ఉండాలనుకున్న ఓ తెలివిమాలిన నక్క, ఒంటికి వాతలు పెట్టుకుని అవే చారలనుకుందిట.... కాపీ కాట్ లా వచ్చిన నక్కను దుడ్డుకర్రతో నడ్డి విరగ్గొట్టాయిట అడవిలోని మిగితా జంతువులు.

పాపం ఎపి పప్పుబాబు కూడా ఇప్పుడు అదే పంథాలో ఉన్నాడు. సొంతంగా మాట్లాడమంటే జయంతికి నివాళులు, వర్థంతికి శుభాకాంక్షలు చెబుతాడీ చినబాబు. బట్టీపట్టి ప్రసంగాన్ని అప్పజెప్పమంటే రాష్ట్రాన్ని దేశం, దేశాన్ని నియోజకవర్గం చేసేస్తుంటాడు. ఆయాసంలో, ఆవేశంలో అసలు నిజాలు చెప్పేస్తుంటాడు. వెన్నంటే ఉండి మాస్టారు పాఠాలు చెబుతున్నా తప్పుల తడకలతో టిడిపి తోక కత్తిరించేస్తున్నాడు. దాంతో తల కొట్టుకుంటున్న బాబు ఈ గోలంతా ఎందుకు ఆ ప్రతిపక్ష నేతనే యధాతంధగా కాపీ కొట్టేయ్ అన్నట్టున్నాడు. కనీసం అలా అయినా పప్పేష్కి ఫాలోయింగ్ వస్తుందేమో అనే ఆశతో. అందుకే రీసెంట్ గా తిరుపతి సభలో పప్పేష్ పులిని చూసి నక్కవాతనలను ప్రాక్టీస్ చేసాడు. హావభావాలు, మాటలు, తీరు అన్నిట్లోనూ ప్రతిపక్ష నేతను కాపీ కొట్టడానికి సాయశక్తులా ప్రయత్నించాడు. 

ఇచ్చిన మాటను మూటకట్టి మూలన పడేసే బాబు వారసుడు, అసలు మాటివ్వడం చేతకాని చినబాబు,  మాటతప్పం  మడం తిప్పం అంటూ సభికులను తనవైపు తిప్పుకునే ప్రయత్నంతో ప్రసంగం మొదలెట్టాడు. 

వారసత్వాన్ని ప్రకటించుకోవడంలోనూ పప్పుబాబు ప్రతిపక్ష నేతను ఫాలో అయిపోయాడు. అద్భుతమైన తెలివితేటలతో ఎపి పప్పుగా పేరు తెచ్చుకున్న చినబాబు, ఏ పేరు తెచ్చుకున్నా నాన్నకు చెడ్డపేరు తేను అని ప్రకటించాడు. అయితే కమీషన్ల విషయంలో ఆల్రెడీ చినబాబుకు ఉన్న పేరు రాష్ట్రం అంతా మారుమోగుతూనే ఉంది. 

అపరి’మిత’ జ్ఞానంతో నెట్టుకొస్తున్న చినబాబు మరో నలభై ఏళ్లు ఇలాగే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకుని ప్రజలకు పెద్ద పరీక్ష పెట్టాడు. ప్రతిపక్ష నేత విశ్వసనీయ రాజకీయాలతో ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తామనే ధీమా వ్యక్తం చేయడమే పప్పుబాబు 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అనే కోరికకు మూలకారణం అని వేరే చెప్పాలా? 

ఇక గంభీరంగా, స్పష్టంగా, శుభ్రంగా, శుద్ధంగా మాట్లాడటానికి మిస్టర్ పప్పేష్ పడ్డ ప్రయాసను చూసి తీరాల్సిందే. ఒకలా నిలబడాలని, ఇంకోలా చెయ్యి ఊపాలని, మరోలా హావభావాలు ప్రకటించాలని  వేదిక మీద చినబాబు ఎంతగానో తపించిపోయాడు.
మొత్తానికి పప్పేష్ ప్రతిపక్ష నేత ప్రసంగాలన్నీ వరస పెట్టి యూట్యూబ్ లో చూసి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసాడని భుజాలు చరుచుకుంటున్నార్ట పచ్చపార్టీ వర్గీయులు. కానీ ఈ పులి చారలేసుకున్న పప్పు బాబును గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ పార్టీ నేతలకు ఎవరైనా వివరంగా చెబితే బావుణ్ణు.
 
Back to Top