సినిమా చూపిస్త మామా...


పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాలంటే పనికొచ్చేదో పనికిమాలినదో ఏదో ఒకపని చేయాలి. అసలు పత్రికల్లో పతాకాలెందుకు...? ప్రచారం కోసం...ప్రచారం ఎందుకు....? ఇలా అడిగితే అంతకు మించిన చవట దద్దమ్మ ఎవ్వరూ ఉండరు. పత్రికలంటేనే పచ్చగా ఉండాలని, పచ్చగా ఉంటేనే పత్రికలని, పలు రకాలుగా ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ప్రజల కు రంగు రంగుల సినిమాలు చూపించడమే వాటి కర్తవ్యమని చంద్రబాబుగారి నమ్మకం. ఆ థియరీ ప్రకారమే ఆయన పత్రిక పూటకో కొత్త శీర్షిక నిర్వహిస్తుంటారు. 
విదేశాలకు వెళ్లేముందు ఎంత పెట్టుబడులు తేబోతున్నారో తాటికాయంత అక్షరాలతో రాయడం ద్వారా ప్రజలకు జ్ఞానోదయం కలుగుతుంది. విదేశాలకు వెళ్లిన తర్వాత అక్కడ జరిగే కుమ్మక్కుల గురిచి మరో చేంతాడు అంత రాయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందన్న భ్రమ కలుగుతుంది. భ్రమ దాకా ఎలాగో వచ్చాం గనక కాస్త భ్రమరావతి దాకానూ వెళ్లొద్దాం. ఇక నేటి పతాక శీర్షికలో చంద్రబాబు కు ఆయన స్వప్న నగరం భ్రమరావతికీ ఎప్పటిలాగే మరోసారి గొప్ప టైటిల్ దక్కింది. అమరావతి సినిమా...ఏ పత్రిక తొలి పేజీ చూసినా భ్రమరావతి బంగారు సినిమా గురించే చర్చ. 
ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తీస్తుండటం మరో విశేషం. ఆయన కొడుకు కూడా పబ్లిసిటీ సంస్థను నడుపుతున్నాడు కనుక పనిలో పని అతడి ద్వారా విదేశాల్లో ఈ ప్రచార చిత్రాన్ని ప్రదర్శింపచేసే కార్యక్రమాలు చేపట్టాల్సిందని చంద్రబాబు అదేశం. 
ఇంతకీ ఈ వార్తలు చదివిన తర్వాత ప్రజలకు కలిగే సందేహాలు రెండు...
ఒకటి ఎండిపోయిన బీడులా ఉన్న అమరావతి ఖాళీ స్థలాలను సినిమాగా తీసి విదేశాల్లో ఏమని చెబుతారు...పెట్టుబడులకోసం ఇవన్నీ మీకు రాసిచ్చేస్తామని చెబుతూ సినిమా తీస్తారా...?
రెండు తీసేది రాజమౌళి కనుక మాహిష్మతికి మామ్మ లాంటి గ్రాఫిక్ వర్క్స్ తో, మొన్నటి నార్మన్ ఫోస్టర్ నమూనాలను మిక్స్ చేసి భ్రమరావతిని బ్రహ్మాండంగా యానిమేట్ చేసి సినిమా తీస్తారా...?
ఇంకో ప్రశ్న కూడా పుట్టుకొచ్చేసింది తీసిన ఈ సినిమా తెలుగు వాళ్లకు చూపిస్తారా...?
పనిలో పనిగా మరో ప్రశ్న ఈ అమర భ్రమర ప్రచార చిత్రంలో మహా నటులు చంద్రబాబు, నారాయణలతో పాటు వెండితెర వీరనటడు, టిడిపి అపర విధేయుడూ పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారా...?
ఏంటీ మీక్కూడా ఇంకా కొన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయా...?
మరైతే వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారబ్బా...?
 

తాజా వీడియోలు

Back to Top