హన్నా..నన్నే మోసం చేస్తారా?

..............
క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు సీరియస్ గా  కూర్చున్నారు.
మొహంలో నవ్వు లేదు.
చాలా కోపంగా రగిలిపోతూ ఉన్నారు.
చాలా టెన్షన్ తో కనిపిస్తున్నారు.
అదే సమయంలో  ఆప్తుడైన అచ్చెంనాయుడు వచ్చాడు.
అచ్చెంనాయుణ్ని ఓ చూపు చూసి... వాళ్లని  అర్జంట్ గా మీటింగ్ కు రమ్మనమని పిలు అని ఆర్డరేశారు.
చంద్రబాబు కోపాన్ని చూసి వణికపోయిన అచ్చెంనాయుడు..వాళ్లని అంటే ఎవరినో అర్ధం కాక..ఎవరిని పిలవమంటారు సార్ అని   నెమ్మదిగా తడబడుతూ అడిగాడు.
చంద్రబాబుకు లోపల కాలిపోతోంది.
ఎవరిని పిలవాలో తెలీదా? పెతీ వోడూ రాజకీయాల్లోకి వచ్చేయడమే. వచ్చాక ఎప్పుడేం చేయాలో తెలీదు. అంటూ మండి పడి.. తన టేబుల్ పై ఉన్న సాక్షి పేపర్ ను అచ్చెంనాయుడి వైపు విసిరికొట్టాడు చంద్రబాబు.
పేపర్లు చదవడం వచ్చు కదా..చదువు. సాక్షి పేపర్ చదివాక ఎవరిని పిలవాలో వాళ్లని పిలు అని కోపంగా అరిచినంత పని చేశాడు చంద్రబాబు నాయుడు.
సాక్షి పేపర్ లో  టిడిపి మంత్రులు నేతల భూ దురాక్రమణ చిట్టా  కనిపించేసరికి అచ్చెంనాయుడు బుర్రలో లైటు వెలిగింది. 
అర్ధమైంది బాబూ...ఇపుడే పిలుస్తా.అని  భూఆక్రమణల చిట్టాలో ఉన్న మంత్రులు..టిడిపి నేతల పేర్లన్నీ  చూసుకుంటూ ఒక్కొక్కరికీ ఫోను కొట్టి ఉన్న పళాన బాబుగోరి దగ్గరకు బేగి వచ్చేయండి అని చెప్పుతూ పోయాడు అచ్చెంనాయుడు.
............
ఒక్క అరగంటలో నే  సాక్షి పత్రికలో  వచ్చిన భూ ఆక్రమణ దారుల కథల్లోని పచ్చ బాబులంతా  క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు.
బాబు ఎవరినీ చూడలేదు. సీరియస్ గానే ఉన్నారు.
అందరూ బిక్కు బిక్కు మంటూ వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు.
బాబు ఎందుకు పిలిచారో..ఎందుకంత కోపంగా ఉన్నారో కూడా వాళ్లకి అర్ధం కావడం లేదు.
అందరూ కూర్చున్నాక చంద్రబాబే  కల్పించుకుని...ఏంటిది? అని సాక్షి పేపర్ ని చూపించి అడిగారు.
మంత్రులంతా తెల్లమొగాలేశారు.
ఇందుకోసమా? ఇంకా ఎందుకోసమో అనుకున్నాం అన్నట్లు ఊపిరి పీల్చుకుని  అందరూ తేలిగ్గా నవ్వేశారు.
చంద్రబాబుకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. నేనింత సీరియస్ గా అడుగుతోంటే సమాధానం చెప్పకుండా ఆ వెకిలి నవ్వులేంటి? ఏం తమాషాగా ఉందా? తోక కత్తిరించేస్తా ఒక్కొక్కరిదీ.. అని మండి పడ్డాడు బాబు.
దాంతో అంతా సైలెన్స్ అయిపోయారు.
బాబే మళ్లీ అడిగాడు. ఏంటిది? అని సాక్షి పేపర్ ని అందరికీ చూపిస్తూ అడిగాడు.
మంత్రులు పత్తిపాటి,  నారాయణ లేచి  .. ఇందులో ఏముందండీ బాబూ.. సాక్షి పేపర్ కి వేరే పనుండదు. ఎంతసేపూ అక్రమార్కులు ఎక్కడ కనిపిస్తారా? ఏయే భూములను ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారు?  ప్రభుత్వ భూములను కారు చవగ్గా ఎలా కొట్టేశారు? ఇలాంటి  వార్తలే వేస్తూ ఉంటుంది.  ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడూ వేసింది. అన్నారు.
చంద్రబాబు ఆ ఇద్దరి కేసీ కోపంగా చూశారు.
బయట కెళ్తే మీడియా వాళ్లు ఉంటారు. అందులోనూ గొట్టాలు పట్టుకుని టీవీ వాళ్లు రెడీగా ఉంటారు.  మీరేమన్నా కథలు చెప్పదలచుకుంటే వాళ్లకి చెప్పండి అంతే కానీ నా దగ్గర కాదు మీ కుప్పిగంతులు ? నాకు నిజం చెప్పండి అని కసిరాడు చంద్రబాబు నాయుడు.
అయ్యా మీరు మరీ అంత కోపంగా మాట్లాడితే ఎలాగండీ బాబూ. ..రైటే సాక్షిలో వచ్చిన కథనాలు కరెక్టే..మేం భూములు  సంపాదించుకున్నది కరెక్టే. మరి ఏమీ సంపాదించుకోకుండా.. నిజాయితీగా  ఉండడానికా మేం టిడిపిలోకి వచ్చింది. అయినా మేం దక్కించుకున్న భూముల్లో మీ వాటా మీకిచ్చేస్తూనే ఉన్నాంగా.? అన్నీ తీసుకుని ఇపుడు ఇలా సీరియస్ అయితే ఎలాగండీ బాబూ అని  కొంచెం గట్టిగానే అడిగారిద్దరూ.
చంద్రబాబుకు మండుకొచ్చింది.
కొట్టానంటే మొహం కొబ్బరి చిప్పలా పగిలిపోతుంది.
పెద్ద  నిజాయితీ పరుల్లా కబుర్లు చెబుతున్నారు.
మీరు  ఆక్రమించుకున్న భూముల  వివరాలు..చూడండి. మీరు   నాకు చెప్పిన వాటికన్నా మూడు రెట్ల భూములు దోచుకున్నారు. మరి నా కమిషన్ మాత్రం నాలుగోవంతు భూములకే ఇచ్చారు. మిగతా మూడొంతుల భూములకూ నా కమిషన్ ఎవరిస్తారు? మీ తల్లో జేజమ్మ నుండి వసూలు చేయగలను ఏమనుకుంటున్నారో ఏమో? అని చంద్రబాబు  ఆవేశపడిపోతూ గట్టిగా అరిచేశారు.
అప్పటికి అర్ధమైంది మంత్రులకు..చంద్రబాబు ఎందుకు కోపంగా ఉన్నారో.
సాక్షి పేపర్లో కథనాలు రాకపోతే.. మనం ఎంతభూములను ఆక్రమించుకున్నామో బాబుకు తెలిసి ఉండేది కాదు. ఈ సాక్షి పేపర్ పై  పరువు నష్టం దావా వేసేస్తే సరి అన్నాడు దేవినేని.  దేవినేనితో మిగతా మంత్రులు ఏకీభవించారు.
ఇంతలో బాబు చూపు మురళీ మోహన్ పై పడింది.
ఏం మోహన్ ? నువ్వేదో  నిక్కచ్చిగా ఉంటావేమో అనుకున్నాను. నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్పావు. అని సీరియస్ అయ్యారు.
మురళీ మోహన్  తల దించుకుని.. లేదు బాబు గారూ..మిగతా భూములకు సంబంధించిన  మీ వాటాని ఒకటి రెండు రోజుల్లో పంపించేస్తాను మరోలా అర్ధం చేసుకోకండి అని ప్రాధేయ పడ్డాడు. మిగతా మంత్రులు..నేతలు కూడా ఇలాగే చెప్పారు.
అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశాంత వదనుడై.. ఎందుకయ్యా అనవసరంగా నా చేతి తిట్టిపిచ్చుకుంటారు. ముందే నా వాటా నాకిచ్చేస్తే.. మిమ్మల్నేమీ అనేవాడిని కాదు కదా. మీరు అవినీతి చేసుకుంటామంటే ఎప్పుడైనా కాదన్నానా? అక్రమాలు చేసి వస్తే ఏమైనా చర్యలు తీసుకున్నానా?  అధికారులపై చేయిచేసుకున్న వాళ్లపైనే నేను యాక్షన్ తీసుకోలేదు. అలాంటిది నా దగ్గర నిజాలు దాచి ఎక్కువ భూములు కొట్టేస్తే నా మనసు కు బాధ కలగదా మీరే చెప్పండి  అని చంద్రబాబు నాయుడు మారాంగా అడిగేసరికి మంత్రులంతా నిజవేనండీ బాబూ. ఈ పాలికి ఒగ్గీయండి.మరి  మేం వెళ్లి రావచ్చా అంటూ అందరూ లేచారు.
చంద్రబాబు అందరినీ వారిస్తూ.." బయట  టీవీ వాళ్లూ..పేపరోల్లూ అందరూ గోతికాడి నక్కల్లా కాచుక్కూచున్నారు. బయటకి వెళ్లగానే అత్యవసర మీటింగ్ దేని గురించి? సాక్షి లో వచ్చిన కథనాల గురించేనా అని అడుగుతారు. మీరేం చెబుతారు? అని   అన్నారు చంద్రబాబు.
దాందేముందండీ నో కామెంట్ అంఠాం అన్నాడు నారాయణ.
చంద్రబాబుకు మండింది. నో కామెంట్ అంటే   యస్సార్ అని వెళ్లిపోరు వాళ్లు. 
అంచేత రాజధాని నగరాన్ని  ఎంత అందంగా నిర్మించాలో ప్లాన్ చేయడానికే మీటింగ్ పెట్టారని చెప్పండి  అపుడు దాని గురించి బ్రేకింగ్  ప్లేట్స్ తో డబ్బా కొట్టడానికి మన మీడియా మనకి ఉండనే ఉంది. ఒక్క సాక్షిలోనే కదా మన దొంగతనాల గురించి వచ్చింది. మిగతా  మీడియా చూసీ చూడనట్లు వదిలేస్తుందిలే.  హ్యాపీగా వెళ్లిరండి అని చంద్రబాబు పంపేశాడు.
మంత్రులు బయటకు రాగానే కేబినెట్ అత్యవసర సమావేశం హైలైట్స్ ఏంటండీ అంటూ మీడియా వాళ్లు అడిగారు.
పత్తిపాటి నవ్వుతూ... తెలంగాణలో లాగే..ఏపీలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందరికీ ఇవ్వడానికి  ఏ మాత్రం అవకాశాలున్నాయో అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేశాం.ఆ కమిటీ నివేదిక నాలుగేళ్లలో వచ్చేస్తుంది.  అని చెప్పారు.
మూడేళ్ల తర్వాత మీరు ఉండరు కదా..నాలుగేళ్ల తర్వాత రిపోర్టు వస్తే మీరేం చేస్తారు? అని అడిగాడు.
పత్తిపాటి సీరియస్ అయిపోయి నో కామెంట్స్ అని చెప్పి కారెక్కేశారు.
-కవికాకి
------------------------

Back to Top